షార్ట్‌ లవ్‌... హిట్‌ ఫార్ములా | Successfull Short Films on Love Stories | Sakshi
Sakshi News home page

షార్ట్‌ లవ్‌... హిట్‌ ఫార్ములా

Published Fri, Feb 14 2020 8:54 AM | Last Updated on Fri, Feb 14 2020 10:28 AM

Successfull Short Films on Love Stories - Sakshi

వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని సెటిలైన అతని ప్రేమికురాలి మధ్య ఒక రోజున్నర పాటు చోటు చేసుకునే భావోద్వేగాలు...తాజాగా వచ్చి మంచిటాక్‌ తెచ్చుకున్న ఓ తెలుగు సినిమా ఇది. విలన్లు, డ్యూయట్లు వగైరాలేవీ లేకుండా  సింపుల్‌గా సాగే ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీస్‌ ఇప్పుడిప్పుడేవెండితెరపై సందడి చేస్తున్నాయేమోగానీ ఎప్పటినుంచో షార్ట్‌ఫిలిం రూపంలో పొట్టి తెరపై హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. –

సాక్షి, సిటీబ్యూరో:లవ్‌ స్టోరీస్‌ విషయంలో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా రూట్‌ మార్చిన వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి. అంతేకాదు...ప్రేమనే సోపానం చేసుకుని వైవిధ్యభరితమైన కథాంశాలతో షార్ట్‌తెరపై హిట్‌ కొట్టిన సిటీ దర్శకులు, నటీనటులు ఆ తర్వాత వెండితెరపైనా చోటు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌లో హల్‌చల్‌ చేసిన కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ గురించి...

మధురం :
ఆధునిక ప్రేమలకు సనాతన ధర్మాలు, పురాణాలకూలింకేమిటి? ప్రేమలో ఉన్న ఏడు దశలను వివరిస్తూ,కాఫీషాప్‌నకు వచ్చిన అమ్మాయి మనసు దోచుకుంటాడో కుర్రాడు. ప్రేమ, పురాణాలను టచ్‌ చేస్తూయానిమేషన్‌ను కూడా ఉపయోగించుకుంటూ సాగుతుందీ షార్ట్‌ ఫిలిమ్‌. మంచి హిట్టయిన ఈ సినిమా దర్శకుడు తర్వాత మను అనే సినిమా అవకాశం కూడాదక్కించుకున్నాడు. ఇందులో నటించిన చాందినిచౌదరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె మెయిన్‌స్ట్రీమ్‌ హీరోయిన్‌గా ఎదగడానికి దోహదం చేసింది. 

15 డేస్‌ ఆఫ్‌ లవ్‌

సెలవులకు హైదరాబాద్‌కి వస్తుందో అమ్మాయి. 15 రోజులు మాత్రమే నగరంలో ఉన్న ఆమెను ఇక్కడే పరిచయం చేసుకున్న ఓ పోకిరీ అబ్బాయి ప్రేమవైపు ఎలా నడిపించగలిగాడు?  జీవితం గురించిన గొప్ప దృక్పథం, మాటలు, ఆలోచనలతో ఆమె మనసులో ఎలా చోటు సంపాదించాడు? ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఆమె నుంచి రాని గ్రీన్‌సిగ్నల్‌ వైజాగ్‌ వెళ్లాక ఎలా పొందగలిగాడు? వంటి వాటితో సూపర్‌హిట్టయిన ఈ షార్ట్‌ ఫిలిమ్‌కు జయకిషోర్‌ బండి దర్శకుడు, చక్కని, చిక్కని ఆలోచనలను, గాఢతను పొట్టి తెరకెక్కించిన జయకిషోర్‌...ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారాడు.  

హ్యాపీ లైఫ్‌..
సాధారణంగా లవ్‌ ఫెయిల్యూర్‌ అబ్బాయిలను దేవదాసుల్ని చేస్తుంది అంటారు. అయితే తాగుబోతైన 20 ఏళ్ల యువకుడు లవ్‌ ఫెయిల్యూర్‌లో ఉండి, ప్రేమ పట్ల వ్యతిరేకత నింపుకున్న 27 ఏళ్ల అమ్మాయిని ఎలా కన్విన్స్‌ చేశాడు? సంతోషకరమైన సమాప్తం అనే అర్థం వచ్చే టైటిల్‌తో  2015లో వచ్చిన ఈ సినిమా చూపించేది ఇదే.  ఒక గంట వ్యవధితో ఫీచర్‌ ఫిల్మ్‌ని తలపించే దీని దర్శకుడు జయశంకర్‌. ఇందులోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఆ తర్వత కొన్ని మెయిన్‌స్ట్రీమ్‌ మూవీస్‌లోనూ వాడుకోవడం విశేషం.  మనోజ్‌ అనే హీరో క్యారెక్టర్కి అర్జున్‌ రెడ్డి హీరో క్యారెక్టర్‌ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ షార్ట్‌ ఫిలిం హిట్‌తో దీని డైరెక్టర్‌ పేపర్‌ బాయ్‌ అని ఒక మూవీ తీశాడు ..ఒక పెద్ద బ్యానర్లో సినిమాతో పాటు , కొన్ని వెబ్‌ సిరీస్‌కూ పనిచేస్తున్నాడు.  

డైలాగ్‌ ఇన్‌ ది డార్క్‌...
ఓ ప్రేమకథని విజువల్స్‌ లేకుండా చూపించడం సాధ్యమా? ఈ పేరుతో సిటీలో ఒక రెస్టారెంట్‌ ఉందని,  అది ప్రేమికులకు చిరునామా అని మనకు తెలుసు. అదే పేరుతో ఒక సినిమాని రూపొందించడం డైరెక్టర్‌  ప్రశాంత్‌వర్మ కు తెలుసు. కళ్లు లేని వారు కూడా హృదయంతో చూడవచ్చు అంటూ...వర్చువల్‌ టెక్నాలజీతో వచ్చిన  మొదటి షార్ట్‌ ఫిల్మ్‌ ఇది. వీక్షకులను నేరుగా సన్నివేశాల్లోని భావోద్వేగాలతో అనుసంధానం చేస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్‌ షాక్‌ ఇస్తుంది. చాలామంది సెలెబ్రిటీస్‌ కూడా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని షేర్‌ చేశారు.    

పొట్టి తెరది గట్టి పాత్ర  
సోషల్‌ మీడియా వినియోగంలో యువతదే పెద్ద వాటా కాబట్టి సహజంగానే ప్రేమ ఆధారిత షార్ట్‌ ఫిలింస్‌ బాగా వచ్చేవి. అలాంటి  పొట్టి చిత్రాలు తీసిన మాలాంటి వారి పరిమితుల వల్ల హంగు ఆర్భాటాల కన్నా వైవిధ్య భరిత సబ్జెక్టులు, సంభాషణలు, భావోద్వేగాలపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తే మంచి సక్సెస్‌ సాధించాం. ఇప్పుడు ఆ ప్రభావం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ మీద కూడా పడింది.– జయశంకర్, సినీ దర్శకులు

కృష్ణమూర్తిగారింట్లో (2016)

హీరోకి  నాన్న ఫోన్‌ చేసి అతని స్నేహితుడు కృష్ణమూర్తికి వంట్లో బాగాలేదు రాజమండ్రి దగ్గర ఒక విలేజ్‌ లో ఉన్నాడు అతడిని కలిసి రమ్మని చెబుతాడు.  హీరోకి ఏమాత్రం ఇష్టం లేకున్నా నాన్న కోసం ఆ ఊరికి వెళతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కృష్ణమూర్తి కూతురితో ప్రేమలో పడతాడు. అయితే కృష్ణమూర్తి గతంలో హీరో తల్లిని ప్రేమించాడని  తెలిసి హీరో  ఇబ్బందిగా ఫీల్‌ అవుతాడు. అక్కడి నుంచి సున్నితమైన సన్నివేశాలతో కథని నడిపిస్తారు డైరెక్టర్‌ లక్ష్మణ్‌.కె.కృష్ణ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement