4న రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్‌ ప్రమాణ స్వీకారం | vaddera federation pledge on 4th | Sakshi
Sakshi News home page

4న రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్‌ ప్రమాణ స్వీకారం

Published Tue, Aug 2 2016 8:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

vaddera federation pledge on 4th

కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్‌ ప్రమాణ స్వీకారం ఈ నెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర ఫెడరేషన్‌ చైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన దేవళ్ల మురళిని నియమించడం అభినందనీయమన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో 13 జిల్లాల నుంచి వడ్డెర సంఘీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  హస్తకళలు, మైనింగ్‌ కార్పోరేషన్, భవన నిర్మాణ సంక్షేమం చైర్మన్‌ పదవులలో రెండు కోస్తా జిల్లాల వడ్డెరలకు కేటాయించాలని కోరారు. స్మార్ట్‌ పల్స్‌ సర్వే చేసే అధికారులకు బి.సి. జాబితాలను అందజేసి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు. గుంటూరు మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రగిరి ఏడుకొండలుకు కేటాయించాలన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేను కూడా కలసి విన్నవించడం జరిగిందని, ఎమ్మెల్యే కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు, గౌరవాధ్యక్షుడు వల్లెపు ముసలయ్య, కర్ణాటక రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వేముల ఆంజనేయులు, సంఘం నాయకులు బత్తుల కూర్మయ్య, వల్లెపు బాబు, బత్తుల సాంబశివరావు, ఓర్సు కొండలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement