Indira Gandhi Stadium
-
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణదినానికి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పోలీస్ అమరవీరుల సంస్మరణదినం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించనున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి 31 వరకు విజయవాడలో ‘ఓపెన్ హౌస్’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. అక్టోబర్ 24 నుంచి 27వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ..ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. గతేడాదిలో 11,486 మంది పోలీసు కుటుంబాలు నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలను పొందాయి. పోలీస్ శాఖ భద్రతా పథకం ద్వారా పోలీసులకు రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు రూ.98.85 కోట్లు, ఉన్నత చదువుల కోసం రూ.11.66 కోట్లు, వివాహ రుణాలు రూ.3.95 కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ ప్రమాద బీమా పథకం కోసం ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి రూ.40 లక్షలు, యాక్సిస్ ఖాతా ఉన్నవారికి రూ.60 లక్షలు, హెచ్డీఎఫ్సీ ఖాతా ఉన్నవారికి రూ.70 లక్షలు బీమా పరిహారం కోసం ఒప్పందాలు చేసుకుంది. బీమా పరిహార మొత్తాన్ని రూ.85 లక్షలకు పెంచేందుకు ఆయా బ్యాంకులతో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వాటితోపాటు సాధారణ మృతికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తోంది. సర్విస్‌లో ఉంటూ చనిపోయిన పోలీసుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకం కింద పోస్టింగులు కల్పిస్తోంది. గతేడాదిలో 244 మంది పోలీసులు చనిపోగా వారిలో 186 కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన 436 మందికి ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన ధరఖాస్తులు పలు దశల్లో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. -
పోలీసులకు సేవా పతకాల ప్రదానం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం జగన్ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు.. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం)–2020 ► కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ ► డాక్టర్ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు ► కుమార్ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే ► కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ ► ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ఎస్ఐ, ఏసీబీ, విజయవాడ పోలీస్ మెడల్–2021 ► జి. గిరీష్‌కుమార్, అసిస్టెంట్ కమాండో, గ్రేహౌండ్స్ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)–2020, 2021 ► పీహెచ్‌డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ ► ఎస్. వరదరాజు, రిటైర్డ్ ఎస్పీ ► ఆర్. విజయ్‌పాల్, రిటైర్డ్ ఏఎస్పీ, సీఐడీ ► ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ ► ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎన్. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎంకేఎస్. రాధాకృష్ణ, అడిషనల్ కమాండెంట్, పీటీసీ, తిరుపతి ► ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి ► సీహెచ్‌వీఏ రామకృష్ణ, అడిషనల్ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ ► కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ ► ఎం. భాస్కర్‌రావు, రిటైర్డ్ డీఎస్పీ, సీఐడీ ► జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ ► జి. విజయ్‌కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్ ► ఎం. మహేశ్‌బాబు, రిటైర్డ్ అడిషనల్ కమాండెంట్ ► వై. శ్యామ్సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి ► కె. జాన్మోషెస్ చిరంజీవి, ఆర్ఐ, విజయవాడ ► ఎన్. నారాయణమూర్తి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్. శ్రీనివాసులు, ఎస్ఐ, ఏసీబీ తిరుపతి ► వి. నేతాజి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్ఎస్ కుమారి, ఎస్ఐ, ఒంగోలు ► ఎన్. గౌరిశంకరుడు, ఆర్ఎస్సై, నెల్లూరు ► వై. శశిభూషణ్‌రావు, ఆర్ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ ► పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్ ► కెఎన్ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు ► బి. సురేశ్‌బాబు, ఏఎస్సై, నెల్లూరు ► జె. నూర్ అహ్మద్‌బాషా, ఏఎస్సై, చిత్తూరు ► జె. విశ్వనాథం, ఏఆర్ఎస్సై, ఇంటెలిజెన్స్ ► కె. వాకలయ్య, ఏఆర్ఎస్సై, మచిలీపట్నం ► ఎం. వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సై, విజయవాడ ► జె. శ్రీనివాసులు, ఏఆర్ఎస్సై, అనంతపురం ► ఎస్. రామచరణయ్య, ఏఆర్ఎస్సై, అనంతపురం ► వైకుంఠేశ్వరరావు, ఏఆర్ఎస్సై, 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ► వై. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒంగోలు ► పి.విజయభాస్కర్, హెడ్ కానిస్టేబుల్, విజయవాడ ► ఎన్.రామకృష్ణరాజు, ఆర్‌హెచ్‌సీ, విజయనగరం ► సీహెచ్. రంగారావు, హెచ్‌సీ, ఏసీబీ, విజయవాడ ► కె.గురువయ్య బాబు, ఏఆర్‌హెచ్‌సీ, విశాఖపట్నం ► ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► డి. మౌలాలి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► ఎం. జనార్థన్, హెచ్‌సీ, ఆక్టోపస్ ► వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్ ► ఎన్. సూర్యనారాయణ, ఆర్పీసీ, విజయవాడ ► ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో మొదటి బహుమతి అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రెసిడెంట్ ఫైర్ సర్వీసెస్ మెడల్–2020 ► లేట్ కె. జయరామ్ నాయక్ ఫైర్ సర్వీసెస్ మెడల్ ► ఎం. భూపాల్‌రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ► వి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, అనంతపురం ► సీహెచ్ కృపవరం, జిల్లా అగ్నిమాపక అధికారి, విశాఖపట్నం ► బి. వీరభద్రరావు, అసిస్టెంట్ డీఎఫ్ఓ, శ్రీకాకుళం ► బి. గొల్లడు, రిటైర్డ్ లీడింగ్ ఫైర్‌మ్యాన్ ముఖ్యమంత్రి శౌర్య పతకాలు : ఏపీ అవతరణ దినోత్సవం–2021 ► జి. నాగశంకర్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జి. ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► బి. రమేశ్, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► ఎం. శ్రీనివాసరావు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► ఎస్. సురేశ్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జిఎస్ రామారావు, ఆర్ఐ, గ్రేహౌండ్స్ ► కె. జగదీష్, హెడ్ కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. గోవిందబాబు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జె. ఈశ్వరరావు, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► పి. పెంచల ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. నాగేంద్ర, ఎస్ఐ, గ్రేహౌండ్స్ -
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
AP: సర్వం.. త్రివర్ణ శోభితం
మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్.. భారత్ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్వర్క్: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్– హర్ ఘర్ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు. ఎటు చూసినా అదే వేడుక స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తోంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 3 కి.మీ పొడవునా జాతీయ పతాకం ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. 300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది. – కడియం ‘జల’ జెండా! 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్ షీట్ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు. – రామచంద్రపురం రూరల్ -
75వ భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
-
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "రంజాన్" కళ (ఫొటోస్)
-
AP: రాష్ట్ర ప్రతిష్టపై దాడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొత్త తరహా నేరాలు, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతలను పరిరక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 1959 అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్, ఆయన సహచరుల ధైర్యం, ప్రాణత్యాగాన్ని అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 62 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇలా దూషించడం సమంజసమా? ► మావాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజూ అబద్ధాలే వార్తలుగా, వార్తా కథనాలుగా ఇస్తాం.. అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజూ నడుపుతామని చెబుతున్న పచ్చ పత్రికలు, పచ్చ చానెళ్లను కూడా చూస్తున్నాం. ► మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజాకొడుకు అంటామని దారుణమైన బూతులు వాడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, ఆయన తల్లినుద్దేశించి ఇలాంటి మాటలు, బూతులు తిట్టడాన్ని అంతా చూస్తున్నాం. ఇలా దూషించడం కరెక్టేనా..? ► ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి.. వాళ్లు రెచ్చిపోవాలి.. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి.. దానివల్ల గొడవలు సృష్టించాలని ఆరాట పడుతున్నారు. ఇదంతా సమంజసమేనా? అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ సవాంగ్ ఇక గెలవలేమని బెరుకు ► మునిసిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికలు, చివరికి ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదని వారికి తెలిసిపోయింది కాబట్టే ఇలా చేస్తున్నారు. ► చివరకు మన రాష్ట్రం పరువు, ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ లేనిది ఉన్నట్లు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వీరు టార్గెట్ చేస్తోంది ముఖ్యమంత్రిని, మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్నీ కూడా. ఇది నామీద దాడి కాదు. మనం రాష్ట్రం మీదా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీదా దాడి. ► మన పిల్లలను డ్రగ్ అడిక్టŠస్‌గా ప్రపంచానికి చూపించేలా దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. అది ఇది పచ్చి అబద్ధమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వివరణ ఇచ్చినా... విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ వివరణను చూపిస్తూ మళ్లీ చెప్పినా.. చివరకు డీజీపీ పదేపదే ఇదే విషయాన్ని స్పష్టం చేసినా వినిపించుకోవడం లేదు. అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్ బ్రెయిన్‌తో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పౌరుల రక్షణలో రాజీ పడొద్దు.. ► నేరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపాల్లో దాడి చేస్తోంది. శాంతి భద్రతలు మనకు అత్యంత ప్రాధాన్యత అంశం. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ఏమాత్రం రాజీపడొద్దని స్పష్టం చేస్తున్నా. ► బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిపై కులపరమైన దాడులు, హింసకు పాల్పడితే కారకులు ఎవరైనా సరే ఉపేక్షించొద్దు. తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించొద్దు. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు కాగా అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారున్నారు. ప్రజాసేవలో అమరులైన ప్రతి పోలీసు సోదరుడికి, సోదరికి నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో మా పరిపాలన సాగుతోంది. పోలీసుల పట్ల కూడా అదే చిత్తశుద్ధి, బాధ్యతను చేతల్లో చూపిస్తూ వచ్చాం. భారీగా పోలీసు నియామకాలు ► పోలీసుల సంక్షేమానికి గత సర్కారు 2017 నుంచి బకాయి పెట్టిన రూ.15 కోట్లు నిధులు కూడా విడుదల చేశాం. త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టబోతున్నాం. హోంగార్డుల గౌరవ వేతనం పెంచాం. 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నియమించాం. వారందరికీ శిక్షణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ► కరోనా వల్ల మృతి చెందిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఆదేశించాం. చికిత్స పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్‌గ్రేషియా ఇతర సదుపాయాలను అందించి ఆదుకున్నాం. నవంబర్ 30లోగా కారుణ్య నియామకాలు కరోనాతో మృతి చెందిన పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు ఊరట కల్పిస్తూ కారుణ్య నియామకాలన్నీ నిర్ణీత కాలపరిమితితో నవంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అక్కచెల్లెమ్మల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం. బాలికలు, మహిళల సంరక్షణ కోసం మహిళామిత్ర, సైబర్‌మిత్ర కార్యక్రమాలను వార్డు, గ్రామ స్ధాయిలోకి తీసుకువెళ్లాం. మహిళా హోంమంత్రి ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేస్తున్న ఈ రక్షణ చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు కూడా లభించాయి. కొత్త నేరగాళ్లు అధికారం దక్కలేదన్న అక్కసుతో రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కొత్త నేరగాళ్లు వస్తున్నారు. చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. రథాలు తగలబెడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలనూ ఆపేయించారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందడానికి వీల్లేదని అంటున్నారు. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని బోసిడీకే.. అంటే లంజాకొడకు అని బూతులు తిడుతున్నారు. ఇది నాపై దాడి కాదు.. రాష్ట్రంపైన దాడి. మన రాష్ట్రం, మన పిల్లలపై డ్రగ్స్ కళంకం మోపుతూ వారి భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు. – ముఖ్యమంత్రి జగన్ ఆవేదన -
కూరగాయలకు పోటెత్తిన ప్రజలు
-
ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక గ్యాలరీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చేయనున్న పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమాన్ని సామాన్యులు సైతం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులతోపాటు ప్రజలు, కార్యకర్తలు కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దాదాపు 30వేల మంది వీక్షించే విధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సూచన మేరకు ప్రజలు కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమం నిమిత్తం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓ స్టేజిపై ప్రమాణ స్వీకార అధికార కార్యక్రమం, మరోదానిపై గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఉంటారని తలశిల రఘురాం వెల్లడించారు. అలాగే ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఓ గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా మైదానం ప్రాంగణంలోనూ, బయట కూడా ప్రజలు వీక్షించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాన్యులు, కార్యకర్తలంతా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించవచ్చునని ఆయన ప్రకటించారు. -
ప్రజలకు పండుగ
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం అందుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరి ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రజలకు ఆరోజు పండుగే అవుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపైనగరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, పలు శాఖల అధికారులు, ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆదివారం సమావేశమై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అతిథులు, వీవీఐపీలు, వీఐపీలు, సామాన్య ప్రజానీకానికి కేటగిరీల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ సూచించారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలో ఏర్పాట్లు ఇలా.. ప్రొటోకాల్ ప్రకారం స్టేడియంలో సీటింగ్‌ను కేటగిరీల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా ఏఏ కేటగిరిలో రాష్ట్ర గవర్నర్, జ్యుడీషియల్ అధికారులకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. ఏ1 కేటగిరీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఏ2 కేటగిరీలో పార్టీ నేతలు, ప్రముఖులకు సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం గ్యాలరీల్లో సామాన్య ప్రజలకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు. వివిధ క్యాటగిరీల మధ్య ముందుగా బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదిక, మైక్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు, కూలర్లు, షామియానాలు, సందర్శకులకు మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని 10 ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఎల్ఈడీ స్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఒన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్, సిద్ధార్థ కాలేజీ, పైపులరోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద, పామర్రుతోపాటు మరో మూడు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్కీన్లు, షామియానాలు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీళ్లను అందుబాటులో ఉంచుతారు. నిరాడంబరంగా ప్రమాణస్వీకారోత్సవం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణాస్వీకారం చేయనున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్‌రెడ్డి సూచనల మేరకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సామన్య ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ అడిషినల్ సెక్రటరీ అశోక్‌బాబు, డీసీపీలు రవిశంకర్ రెడ్డి, హర్షవర్దన్ రాజు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి బొప్పన భవకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడపా సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పల్లకిలో...
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు దేశ రాజధాని వేదికగా రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 24 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. మొత్తం 10 విభాగాల్లో కలిపి 73 దేశాలకు చెందిన 300కు పైగా బాక్సర్లు ఈ ప్రతిష్టాత్మక పోరులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి కూడా ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున 10 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 2001 నుంచి తొమ్మిది సార్లు మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహించగా... 2006లో నాలుగో వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత ఢిల్లీలో మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ జరుగుతోంది. స్కాట్లాండ్, మాల్టా, బంగ్లాదేశ్, కేమన్ ఐలాండ్స్, డీఆర్ కాంగో, మొజాంబిక్, సియరా లియోన్, సోమాలియా దేశాలు తొలిసారి విశ్వ వేదికపై తలపడనుండటం ఈ పదో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో విశేషం. 2001 నుంచి 2010 మధ్య ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ జరిగితే తొలిసారి (2వ స్థానం) మినహా ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత స్టార్ మేరీకోమ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి మేరీకోమ్‌కు యువ బాక్సర్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు. 2006లో ఇదే వేదికపై స్వర్ణం సాధించిన మరో భారత బాక్సర్ సరితా దేవిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. భారత్ ఒక స్వర్ణం సహా కనీసం మూడు పతకాలు గెలుచుకునే అవకాశం ఉందని జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు: మేరీకోమ్ (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు), సవీటీ బూరా (75 కేజీలు), భాగ్యవతి కచారీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు). -
గణతంత్రమా....స్వాతంత్య్ర దినోత్సవమా..?
జీఏడీ ఆదేశాలపై ఉద్యోగుల విస్మయం సాక్షి, అమరావతి: జనవరి 26న గణతంత్ర దినోత్సవమని...ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవమని ఊహ తెలిసిన ప్రతి ఒక్కరు ఇట్టే చెబుతారు. కానీ..రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ (ప్రొటోకాల్ విభాగం) అధికారులకు ఈ రెండింటికీ మధ్య తేడాలు తెలియకపోవడం పలువురి ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలకు హాజరు కావాలంటూ ఆశాఖ అధికారులు బుధవారం అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం..గణతంత్ర దినోత్సవాల మధ్య తేడా తెలియని సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) అధికారుల తీరుపై పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
4న రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం
కొరిటెపాడు (గుంటూరు): రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం ఈ నెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని ఓ హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన దేవళ్ల మురళిని నియమించడం అభినందనీయమన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో 13 జిల్లాల నుంచి వడ్డెర సంఘీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హస్తకళలు, మైనింగ్ కార్పోరేషన్, భవన నిర్మాణ సంక్షేమం చైర్మన్ పదవులలో రెండు కోస్తా జిల్లాల వడ్డెరలకు కేటాయించాలని కోరారు. స్మార్ట్ పల్స్ సర్వే చేసే అధికారులకు బి.సి. జాబితాలను అందజేసి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు. గుంటూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రగిరి ఏడుకొండలుకు కేటాయించాలన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేను కూడా కలసి విన్నవించడం జరిగిందని, ఎమ్మెల్యే కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు, గౌరవాధ్యక్షుడు వల్లెపు ముసలయ్య, కర్ణాటక రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వేముల ఆంజనేయులు, సంఘం నాయకులు బత్తుల కూర్మయ్య, వల్లెపు బాబు, బత్తుల సాంబశివరావు, ఓర్సు కొండలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ పండగొచ్చింది
► ఫ్యాన్ పార్కుకు సర్వం సిద్ధం ► ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు ► ప్రవేశం ఉచితం విజయవాడ స్పోర్ట్స్ : రెండు రోజుల పాటు ఐపీఎల్ ఫ్యాన్ పార్కు పండగ నగరంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు అంతా సిద్ధమైంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవేశం ఉచితం. కనీసం 10వేల మంది క్రికెట్ అభిమానులు ఫ్యాన్ పార్కుకు హాజరై వైజాగ్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ను లైవ్ స్క్రీన్‌లో చూడాలని బీసీసీఐ భావి స్తోంది. దేశవ్యాప్తంగా బీహార్‌లోని ముజఫ్ఫాపూర్, మహారాష్ట్రలోని కొలహాపూర్, విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ ఫ్యాన్ పార్కును ఏర్పాటు చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫ్యాన్ పార్కులకు 1,45,000 మంది ప్రేక్షకులు హాజరైనట్లు బీసీసీఐ చెబుతోంది. అసలు ఫ్యాన్ పార్కు అంటే.. ఏ స్థాయి క్రికెట్ మ్యాచ్ అయినా పలు కారణాల వల్ల కోట్లాది క్రికెట్ అభిమానులు చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లోని ప్రజలకు ప్రత్యక్షంగా చూసే వీలుండదు. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోని క్రికెట్ స్టేడియాలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పనికిరావు. అయితే, ఈ ప్రాంతాల్లో లక్షలాది మందిక్రికెట్ అభిమానులు ఉంటారు. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేని స్టేడియాలున్న నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కును బీసీసీఐ దేశవ్యాప్తంగా 36 నగరాల్లో ఏర్పాటుచేసింది. రోజుకు మూడు నుంచి నాలుగు నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కు ఏర్పాటుచేసి భారీ స్క్రీన్ ద్వారా లైవ్ మ్యాచ్‌లు చూపిస్తుంది. స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఫ్యాన్ పార్కులో గ్రీన్ కార్పెట్ పరిచారు. చుట్టూ ఫుడ్‌కోర్టు స్టాల్స్, వీఐపీలకు లాంజ్ ఏర్పాటుచేశారు. భారీ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్, ఆడుకునేందుకు వర్చ్యు వల్ క్రికెట్ స్టాల్ సిద్ధమైంది. అందరూ గ్రీన్ కార్పెట్‌పై కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని పలు కూడళ్లలో లక్కీడిప్ కూపన్లు పంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రారంభిస్తారు. మూడు గంటలకు ప్రవేశం కల్పిస్తారు. ప్రతి ఒక్కరికీ రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. విలువైన వస్తువులు లోనికి తీసుకురాకూడదు. వొడాఫోన్ జుజూలు ఈ ప్రాం తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. లక్కీ కూపన్లను లక్కీడిప్‌లో వేయాలి. డ్రాలో ఎవరిని వరిస్తే వారికి ఆయా క్రికెటర్లు వాడిన బ్యాట్, ఫోన్ బహూకరిస్తారు. -
తొలి పరేడ్ నేడే
* గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఇందిరాగాంధీ స్టేడియం * విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్ * నగరంలో విడిది చేసిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 7.15 గంటల నుంచి గంటా నలభై నిమిషాల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రికే నగరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హాజరవుతారు. గత 15 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌డే వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపీ రాముడులతో వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్నారు. గవర్నర్ రాక గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విచ్చేశారు. అక్కడ నుంచి కారులో విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ గౌరవవందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ హాజరవుతారు. 500 మంది వీవీఐపీలు, 1500మంది వీఐపీలు, దాదాపు 15వేల మంది విద్యార్థులు, ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వేడుకలు జరుగుతున్న ఐజేఎం స్టేడియంలో 10 గేట్లు ఏర్పాటు చేశారు. వేడుకలు తిలకించేందుకు విచ్చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 19 మంది డీఎస్పీలు, 35మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 150 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, వెయ్యిమందికిపైగా పోలీసు కానిస్టేబుల్స్, హోంగార్డులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో గత నాలుగు రోజులుగా నిఘా ఏర్పాటు చేశారు. -
సర్వం సిద్ధం
రిపబ్లిక్ డే వేడుకలకు నగరం ముస్తాబు.. నేడు గవర్నర్, సీఎం రాక ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు సందర్శకులు ఉదయం 7గంటలకు రావాలి విద్యుత్ దీపాలతో పలు కూడళ్లకు అలంకరణ.. ప్రకాశం బ్యారేజీకి కొత్త కళ విజయవాడ : నగరం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సోమవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. ఈ వేడుకలను బందరురోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లుచేసింది. శనివారం స్టేడియంలో ఫుల్డ్రెస్డ్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీజీపీ జేవీ రాముడు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను బెటాలియన్స్ డీజీ గౌతంసవాంగ్ పరిశీలిస్తున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం చద్రబాబు, పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గవర్నర్ ఇక్కడ ఉదయం 7.15 గంటలకు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 9గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లుచేశారు. గవర్నర్ జెండా ఆవిష్కరించి ప్రసంగించిన తర్వాత పోలీసులు పలు విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో ప్రదర్శించేందుకు తొమ్మిది శాఖలు తమ శకటాలను సిద్ధంచేశాయి. విద్యుద్దీపాలతో ప్రత్యేక అలంకరణ వేడుకలు జరిగే ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు నగరంలోని ముఖ్య కూడళ్లు, భవనాలను అధికారులు విద్యుత్ దీపాలతో కనులపండువగా అలంకరించారు. విద్యుత్ దీపాల అలంకరణతో ప్రకాశం బ్యారేజీ కొత్తకళను సంతరించుకుంది. ప్రముఖులకు ఆహ్వానం : ఈ వేడుకలకు సంబంధించి కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఆహ్వానాలను పంపారు. గవర్నర్, సీఎంలతోపాటు పలువురు మంత్రులు ఆదివారం సాయంత్రానికే నగరానికి చేరుకుంటారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రిపబ్లిక్ డే వేడుకలను తిలకించాలనుకునే నగరవాసులు సోమవారం ఉదయం ఏడు గంటలలోపు స్టేడియంలోకి రావాల్సి ఉంది. -
ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను ఎంపిక చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను మంగళవారం పరిశీలించారు. ఉదయం ఏడుగంటలకే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ప్రారంభిస్తామని సీఎస్, డీజీపీ తెలిపారు. ఇక రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. -
హొంగార్డు రిక్రూట్మెంట్లో ఉద్రిక్తత
-
కోల్‌కతాకు రెండో విజయం
గువాహటి: అట్లెటికో డి కోల్‌కతా జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో దూసుకెళుతోంది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో నెగ్గింది. ఫిక్రూ, పోడి జట్టు తరఫున గోల్స్ సాధించారు. దీంతో వరుసగా రెండు విజయాలతో కోల్‌కతా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై కోల్‌కతా ఆటగాళ్లు దాడులకు దిగారు. ఫలితంగా తొమ్మిదో నిమిషంలోనే బొర్జా ఫెర్నాండెజ్ లాంగ్ సైడ్ నుంచి తన్నిన షాట్ నేరుగా గోల్ పోస్టులోకి వెళ్లగా కీపర్ జొర్వాస్ వేగంగా స్పందించి ఒడిసిపట్టుకున్నాడు. అయితే 15వ నిమిషంలోనే తామనుకున్నది సాధించారు. లూయిస్ గార్షియా అందించిన బంతిని ఫిక్రూ చాతితో నియంత్రించుకుని అద్భుతమైన వ్యాలీ షాట్‌తో జట్టుకు తొలి గోల్నందించాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా 90+2వ నిమిషంలో పోడి గోల్‌తో నార్త్ఈస్ట్ చిత్తయ్యింది. ఐఎస్ఎల్లో నేడు మ్యాచ్‌లు లేవు -
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ
సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం విధానసభను ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ప్రత్యేకంగా సమావేశపరచాలని కేబినె ట్ నిర్ణయించింది. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టినా, కొన్ని విభాగాలపై అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతం దానిని ఆమోదించలేదని చెప్పారు. మళ్లీ సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు. అభ్యంతరాలేంటో సిసోడియా స్పష్టం చేయనప్పటికీ హోంశాఖ, న్యాయ విభాగాలు బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలిసింది. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 16న ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే అసెంబ్లీ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించిందని సిసోడియా తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాలని ఆయన ప్రజలను ఆహ్వానించారు. బిల్లును ఆమోదించడానికి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. భద్రతా సమస్యల దష్ట్యా మైదాన్‌లో విధానసభను సమావేశపరచడాన్ని పోలీసులు వ్యతిరేకించారు. దాంతో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ స్టేడియంలో 15 వేల మంది కూర్చోవడానికి వీలుంది. స్టేడియంలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించాల్సి ఉంటుంది. బిల్లు విశేషాలివి.. లోకాయుక్త వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ‘ఢిల్లీ లోకాయుక్త బిల్లు 2014’ ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లును పోలి ఉన్నా, దానికన్నా కఠినంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తకు జవాబుదారీ అవుతారు. కొత్త బిల్లు ప్రకారం.. పది మంది లోకాయుక్తలకు ఒక చైర్మన్ ఉంటారు. సగం మంది సభ్యులు న్యాయవ్యవస్థకు చెందిన వారుంటారు. మిగతా సగం మంది వివిధ రంగాల నిపుణులు ఉండవచ్చు. రిటైర్డు న్యాయమూర్తులు, అధికారులతో కూడిన కమిటీ లోకాయుక్త సభ్యుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఈ పేర్లను ఖరారు చేస్తుంది. అవినీతి అధికారులను డిస్మిస్ చేయడం, డిమోట్ చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. నేరస్తులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అధికారం ఉంటుంది. కేసుల విచారణను ఆరునెలల్లో ముగించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు.