కోల్‌కతాకు రెండో విజయం
గువాహటి: అట్లెటికో డి కోల్‌కతా జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో దూసుకెళుతోంది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో నెగ్గింది. ఫిక్రూ, పోడి జట్టు తరఫున గోల్స్ సాధించారు. దీంతో వరుసగా రెండు విజయాలతో కోల్‌కతా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై కోల్‌కతా ఆటగాళ్లు దాడులకు దిగారు.
ఫలితంగా తొమ్మిదో నిమిషంలోనే బొర్జా ఫెర్నాండెజ్ లాంగ్ సైడ్ నుంచి తన్నిన షాట్ నేరుగా గోల్ పోస్టులోకి వెళ్లగా కీపర్ జొర్వాస్ వేగంగా స్పందించి ఒడిసిపట్టుకున్నాడు. అయితే 15వ నిమిషంలోనే తామనుకున్నది సాధించారు. లూయిస్ గార్షియా అందించిన బంతిని ఫిక్రూ చాతితో నియంత్రించుకుని అద్భుతమైన వ్యాలీ షాట్‌తో జట్టుకు తొలి గోల్‌నందించాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా 90+2వ నిమిషంలో పోడి గోల్‌తో నార్త్‌ఈస్ట్ చిత్తయ్యింది.
ఐఎస్‌ఎల్‌లో నేడు మ్యాచ్‌లు లేవు