Northeast united FC
-
నార్త్ఈస్ట్ యునైటెడ్ బోణీ
వాస్కోడగామా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1–0తో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన అపియా నార్త్ఈస్ట్కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్ఈస్ట్పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది. -
చివర్లో గోల్ సమర్పించుకొని...
సాక్షి, హైదరాబాద్: ఆరంభంలో ప్రదర్శించిన దూకుడును చివర్లో కొనసాగించలేని హైదరాబాద్ ఎఫ్‌సీ సొంతగడ్డపై తొలి ఓటమిని మూటగట్టుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ చేతిలో ఓడిపోయింది. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాక్సిమిలియానో బరీరో (86వ ని.లో) పెనాలీ్టని గోల్‌గా మలిచి నార్త్ఈస్ట్ను గెలిపించాడు. ఈ గెలుపుతో నార్త్ఈస్ట్ ఎఫ్‌సీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి అర్ధభాగంలో అంచనాలకు మించి ఆడిన హైదరాబాద్ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. మరోవైపు తొలి 45 నిమిషాల పాటు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడిచేయలేకపోయిన నార్త్ఈస్ట్ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. 4 సార్లు ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చొచ్చుకుపోయింది. మ్యాచ్ మొత్తంలో 12 గోల్ అవకాశాలను సృష్టించుకున్న హైదరాబాద్ ఫినిషింగ్ లోపంతో ఒక్క గోల్‌నూ నమోదు చేయలేకపోయింది. ఇందులో 9 షాట్లు టార్గెట్ పైకి దూసుకెళ్లినా ప్రత్యర్థి చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌ను నిలువరించింది. -
ఢిల్లీ డైనమోస్ విజయం
గువాహటి: సొంత మైదానంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీకి పరాజయం ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా సోమవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ 2-1 తేడాతో యునెటైడ్పై నెగ్గింది. ఆరంభంలోనే రెండు గోల్స్‌తో విరుచుకుపడిన ఢిల్లీ ముందు నార్త్ఈస్ట్ నిలబడలేకపోయింది. 6వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్ చేయగా 14వ నిమిషంలో ముల్డర్ గోల్‌తో జట్టు ఆధిక్యం పెరిగింది. 80వ నిమిషంలో నార్త్ఈస్ట్ తరఫున టోంగా గోల్ చేసినా ఫలితం లేకపోయింది. -
కోల్‌కతాకు రెండో విజయం
గువాహటి: అట్లెటికో డి కోల్‌కతా జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో దూసుకెళుతోంది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో నెగ్గింది. ఫిక్రూ, పోడి జట్టు తరఫున గోల్స్ సాధించారు. దీంతో వరుసగా రెండు విజయాలతో కోల్‌కతా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై కోల్‌కతా ఆటగాళ్లు దాడులకు దిగారు. ఫలితంగా తొమ్మిదో నిమిషంలోనే బొర్జా ఫెర్నాండెజ్ లాంగ్ సైడ్ నుంచి తన్నిన షాట్ నేరుగా గోల్ పోస్టులోకి వెళ్లగా కీపర్ జొర్వాస్ వేగంగా స్పందించి ఒడిసిపట్టుకున్నాడు. అయితే 15వ నిమిషంలోనే తామనుకున్నది సాధించారు. లూయిస్ గార్షియా అందించిన బంతిని ఫిక్రూ చాతితో నియంత్రించుకుని అద్భుతమైన వ్యాలీ షాట్‌తో జట్టుకు తొలి గోల్నందించాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా 90+2వ నిమిషంలో పోడి గోల్‌తో నార్త్ఈస్ట్ చిత్తయ్యింది. ఐఎస్ఎల్లో నేడు మ్యాచ్‌లు లేవు