ఢిల్లీ డైనమోస్ విజయం
గువాహటి: సొంత మైదానంలో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీకి పరాజయం ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా సోమవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ 2-1 తేడాతో యునెటైడ్‌పై నెగ్గింది. ఆరంభంలోనే రెండు గోల్స్‌తో విరుచుకుపడిన ఢిల్లీ ముందు నార్త్‌ఈస్ట్ నిలబడలేకపోయింది. 6వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్ చేయగా 14వ నిమిషంలో ముల్డర్ గోల్‌తో జట్టు ఆధిక్యం పెరిగింది. 80వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ తరఫున టోంగా గోల్ చేసినా ఫలితం లేకపోయింది.