సాక్షి, హైదరాబాద్: ఆరంభంలో ప్రదర్శించిన దూకుడును చివర్లో కొనసాగించలేని హైదరాబాద్ ఎఫ్‌సీ సొంతగడ్డపై తొలి ఓటమిని మూటగట్టుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1తో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ చేతిలో ఓడిపోయింది. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాక్సిమిలియానో బరీరో (86వ ని.లో) పెనాలీ్టని గోల్‌గా మలిచి నార్త్‌ఈస్ట్‌ను గెలిపించాడు. ఈ గెలుపుతో నార్త్‌ఈస్ట్ ఎఫ్‌సీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
తొలి అర్ధభాగంలో అంచనాలకు మించి ఆడిన హైదరాబాద్ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. మరోవైపు తొలి 45 నిమిషాల పాటు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడిచేయలేకపోయిన నార్త్‌ఈస్ట్ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. 4 సార్లు ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చొచ్చుకుపోయింది. మ్యాచ్ మొత్తంలో 12 గోల్ అవకాశాలను సృష్టించుకున్న హైదరాబాద్ ఫినిషింగ్ లోపంతో ఒక్క గోల్‌నూ నమోదు చేయలేకపోయింది. ఇందులో 9 షాట్లు టార్గెట్ పైకి దూసుకెళ్లినా ప్రత్యర్థి చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌ను నిలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment