balayogi stadium gachibowli
-
చివర్లో గోల్ సమర్పించుకొని...
సాక్షి, హైదరాబాద్: ఆరంభంలో ప్రదర్శించిన దూకుడును చివర్లో కొనసాగించలేని హైదరాబాద్ ఎఫ్‌సీ సొంతగడ్డపై తొలి ఓటమిని మూటగట్టుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ చేతిలో ఓడిపోయింది. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాక్సిమిలియానో బరీరో (86వ ని.లో) పెనాలీ్టని గోల్‌గా మలిచి నార్త్ఈస్ట్ను గెలిపించాడు. ఈ గెలుపుతో నార్త్ఈస్ట్ ఎఫ్‌సీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి అర్ధభాగంలో అంచనాలకు మించి ఆడిన హైదరాబాద్ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. మరోవైపు తొలి 45 నిమిషాల పాటు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడిచేయలేకపోయిన నార్త్ఈస్ట్ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. 4 సార్లు ప్రత్యర్థి గోల్ ఏరియాలోకి చొచ్చుకుపోయింది. మ్యాచ్ మొత్తంలో 12 గోల్ అవకాశాలను సృష్టించుకున్న హైదరాబాద్ ఫినిషింగ్ లోపంతో ఒక్క గోల్‌నూ నమోదు చేయలేకపోయింది. ఇందులో 9 షాట్లు టార్గెట్ పైకి దూసుకెళ్లినా ప్రత్యర్థి చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌ను నిలువరించింది. -
8న అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు
పంజాగుట్ట, న్యూస్‌లైన్ : ది ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 8న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి. మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ముంబై గ్లాడియేటర్ జట్టుతో... ఢిల్లీ డిఫెండర్స్, బెంగుళూరు వార్హావ్క్స్తో... కోల్‌కతా వైపర్స్, పుణే మారథాన్ మధ్య పోటీలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ప్రతీ మ్యాచ్ గంట పాటు కొనసాగుతుందని, ఏసీబీ డెరైక్టర్ ఏకే ఖాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ప్రధాన కార్యదర్శి కార్తీక్, హెడ్ కోచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు మీడియా భాగస్వామిగా సాక్షి వ్యవహరించడం సంతోషకరమని అన్నారు.