
సాక్షి, భోపాల్ : బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్థులచే ఉపాధ్యాయులు ప్రమాణం చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇటార్సీలోని విజయలక్ష్మి ఇండస్ర్టియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్ పరీక్షలను నిలిపివేసే వరకూ రానున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని విద్యార్ధులచే ప్రమాణం చేయించారు.దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రంలో పెను దుమారం రేపింది.
బీజేపీ కార్యకర్తలు, వాలంటీర్లకు ఏ రకంగానూ సహకరించబోమని, రానున్న 24 గంటల్లో ప్రతి ఒక్కరూ మరో ముగ్గురతో ఇలాంటి ప్రతిజ్ఞ చేయించాలని ఈ వీడియోలో విద్యార్థులు ప్రతినబూనుతూ కనిపించడం గమనార్హం. ఈనెల 26 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో ఈ వీడియో బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment