కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా అన్యాయం చేసింది
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైల్వే బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం కేసీఆర్ స్పందిస్తూ.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వలేదని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు 20 కోట్ల రూపాయిలు కేటాయిస్తా సరిపోతాయా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరే ఎన్డీయే ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని కేసీఆర్ విమర్శించారు.