సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, దిల్‌సుఖనగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్టులు జరిగాయని అన్నారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్లలోకూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయని తెలిపారు.
పాకిస్థాన్‌లో కూర్చొని రిమోట్ నొక్కితే భారత్‌లో బాంబ్ బ్లాస్టులు జరిగేవని అన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లుపాతుకొని భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని తెలిపారు. మతకలాహాలు ప్రేరేపించి, ఆడీఎక్స్‌లు పేల్చేవాళ్లని, ఏకే 47లు పంపేవాళ్లని కిషన్‌రెడ్డి అన్నారు.
అయితే ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు, కర్ఫ్యూ లు, ఎకే 47లు, RDXలు లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని గుర్తుచేశారు. భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదని తెలిపారు.
ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీగా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేదన్నారు.ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు.
చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment