జపాన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ | Ambedkar statue in Japan | Sakshi
Sakshi News home page

జపాన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Published Mon, Mar 16 2015 10:23 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

జపాన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ - Sakshi

జపాన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

జపాన్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు.

హైదరాబాద్: జపాన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ గర్వంగా ఉందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. బంగారు లక్ష్మణ్, బీఎస్ వెంకట్రావ్ మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండన్లో అంబేద్కర్ నివశించిన గృహాన్ని ఎన్ని కోట్ల రూపాయలైనా స్వాధీనం చేసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయులంతీ కలసి ఈ డిమాండ్ చేయాలనన్నారు. అంబేద్కర్ చెప్పిన సమతా విధానాలే ప్రపంచానికి స్పూర్తి అని పేర్కొన్నారు. దళితులకు వారి వాటా ఇంకా దక్కడంలేదని విద్యాసాగర్ రావు అన్నారు.

 దళితుల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ  తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికే మోదీ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement