
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.