Inquiry Commission
-
కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రెండు నెలల పాటు గడువును పెంచుతూ ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటితో గడువు ముగియడంతో ఆగస్టు 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెలలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
భీమా–కోరేగావ్ కేసులో పవార్‌కు సమన్లు
ముంబై: 2018 జనవరి 1న చోటుచేసుకున్న భీమా–కోరేగావ్ హింసాకాండ కేసులో దర్యాప్తు కమిషన్ నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు సమన్లు జారీ చేసింది. మే 5, 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన సాక్ష్యాన్ని నమోదు చేస్తామని తెలిపింది. దర్యాప్తు కమిషన్‌కు శరద్ పవార్ ఏప్రిల్ 11న సమర్పించిన అదనపు అఫిడవిట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ సంఘటన విషయంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదన్నారు. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(దేశద్రోహానికి సంబంధించినది) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని శరద్ పవార్ కోరారు. ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని లేదా ఇందులో మార్పులు చేయాలని విన్నవించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి 1870లో బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన సెక్షన్ 124ఏను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశ సమగ్రతను కాపాడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సరిపోతుందని సూచించారు. భీమా–కోరేగావ్ కేసులో దర్యాప్తు కమిషన్ 2020లో శరద్ పవార్‌కు సమన్లు జారీ చేసింది. కానీ, అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సమన్లు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. -
లఖీమ్‌పూర్ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
లక్నో: లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్‌ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను బుధవారం కలుసుకొని ‘పరిహారం ఇవ్వడం కాదు న్యాయం జరగాలి’ అని డిమాండ్ చేశారు. తాజాగా ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లఖీమ్‌పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొ కొన్ని నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లఖీమ్‌పూర్ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. A single-member Commission of Enquiry with headquarters at Lakhimpur Kheri constituted to investigate the death of 8 persons in Lakhimpur Kheri on October 3. pic.twitter.com/fGcS8JducS — ANI UP (@ANINewsUP) October 7, 2021 కాగా అక్టోబర్ 3న లఖీమ్‌పూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అలాగే సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు. -
దిశ నిందితుల ఎన్కౌంటర్లో నేరం జరిగిందా?
సాక్షి, న్యూఢిల్లీ: దిశ ఘటనలో నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయిన ఉదంతంలో ఏదైనా నేరం జరిగిందా.. అదే జరిగితే అందుకు బాధ్యులెవరో తేల్చాలని జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌కు నిర్దేశించిన విధివిధానాల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నిందితులను ఎన్కౌంటర్లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న న్యాయవిచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్‌యాదవ్, ఎంకే శర్మ, మనోహర్ లాల్ శర్మలు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్ చైర్మన్‌గా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా గల ఈ కమిషన్ 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని ఆదేశించింది. తాజాగా జనవరి 10న తదుపరి విచారణకు రాగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిస భ్య ధర్మాసనం కమిషన్ విధివిధానాలు ఖరారు చేసింది. ‘దిశ నిందితులు అరెస్టై పోలీసుల కస్టడీలో మృతి చెందిన ఘట నపై, ఆ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలి’అని నిర్దేశించింది. -
దిశ: ఎన్కౌంటర్ కేసుపై విచారణకు ఎంక్వైరీ కమీషన్
-
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంపై ఎంక్వైరీ కమిషన్ వేయాలి
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంౖMð్వరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ‘ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. సంక్షోభానికి కొన్నాళ్ల ముందే గ్రూప్ సంస్థలకు ఓవర్ రేటింగ్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీలతో పాటు గ్రూప్‌లో అతి పెద్ద వాటాదారు ఎల్ఐసీ సహా ఇతరత్రా సంస్థాగత వాటాదారుల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ పేర్కొంది. ఇక, దేశీయంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు భారీ స్థాయిలో రుణాలిస్తున్న కంపెనీ కావడంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపెనీలు ఎల్లకాలం ఒకే రేటింగ్ ఏజెన్సీని కొనసాగించేలా కాకుండా ఆడిటర్ల తరహాలో వీటికి కూడా నిర్దిష్ట కాలావధి నిర్దేశించి, రొటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని పేర్కొంది. -
పోలీసులు చెప్పినందుకే..
చెన్నై: తమిళనాడు సీఎం దివంగత జయలలితకు చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలో సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని అపోలో ఆసుపత్రి ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్ న్యాయవాది కమిషన్‌ముందు అఫిడవిట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయలలితను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలో సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేసేవారమని ఆమె తెలిపారు. లిఫ్ట్ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలిత చికిత్స గదిలోకి వెళ్లిపోగానే సీసీటీవీలను ఆన్ చేసేవాళ్లమని అపోలో గ్రూప్ న్యాయవాది పేర్కొన్నారు. -
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జయలలిత ఆస్పత్రి దృశ్యాలు నకిలీవి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జ్యూస్ తాగినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో పూర్తిగా నకిలీదని విచారణ కమిషన్ తేల్చింది. జయలలిత మృతి మిస్టరీపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముస్వామి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కమిషన్ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రత్యేక గదిలో టీవీ చూస్తూ జయలలిత జ్యూస్ తాగుతుండగా శశికళ చిత్రీకరించినట్లుగా చెబుతున్న వీడియోపై అక్కడ పరిశీలన జరిపారు. జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం మాత్రమే ఉంది. టీవీ అమర్చేందుకు అవకాశమే లేదని గుర్తించారు. దీని ప్రకారం జయ జ్యూస్ తాగుతున్న దృశ్యాలు నకిలీవని తేలినట్లు కోమల వివరించారు. ఇంకా అనేక కోణాల్లో చేపట్టిన దర్యాప్తులోనూ అవి డూప్లికేట్‌వని రుజువైందన్నారు. -
దినకరన్‌కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్‌కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్‌గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్‌కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్‌కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ విచారణ జోరును పెంచింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డిలకు శుక్రవారం సమన్లు జారీచేయడం ద్వారా విచారణ కీలకదశకు చేరుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ అనారోగ్యం, 75 రోజుల తరువాత ఆకస్మిక మరణం ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోసం తమిళనాడు ప్రభుత్వం తరపున వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు...ఇలా అమ్మకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందింది. జయకు కేవలం జ్వరం, డీ హైడ్రేషన్లతో స్వల్ప అనారోగ్యమేనని చేరిన వెంటనే అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. నిజాన్ని దాచాల్సి వచ్చింది.. అయితే అదంతా అబద్దమని, వాస్తవానికి జయ విషమ పరిస్థితిలో చేరారని అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జయకు తీవ్ర అనారోగ్యం అని ప్రకటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తుతాయనే ఆలోచనతో నిజాన్ని దాచాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతకు కొన్నినెలల ముందే మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సైతం అమ్మ ఆరోగ్యం విషయంలో అనేక అబద్ధాలు ఆడాం, మన్నించండి అని బహిరంగసభలో ప్రజలను వేడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు.. పెనుభూతాల నడుమ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 25వ తేదీన జయ మరణంపై విచారణ కమిషన్ వేసింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ ప్రారంభించారు. డీఎంకే వైద్యవిభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ కమిషన్ ముందు హాజరై...అమ్మ చనిపోయిన స్థితిలో వేలిముద్రలు సేకరించి ఉప ఎన్నికలకు బీ ఫారం విడుదల చేశారని వాంగ్మూలం ఇచ్చి సంచలనం రేపారు. ఆ తరువాత జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ సీఎస్‌లు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు తదితర ముఖ్యులు తమ వాంగ్మూలం ఇచ్చారు. విచారణలో కీలక ఘట్టం.. ఇదిలా ఉండగా, విచారణలో భాగంగా శశికళ, ప్రతాప్ సీ రెడ్డి, ప్రీతారెడ్డిలకు కమిషన్ శుక్రవారం సమన్లు పంపడంతో జయ మరణంపై జరుగుతున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. జయ ఆసుపత్రికి వచ్చినపుడే విషమపరిస్థిలో ఉన్నారని ప్రతాప్ సీ రెడ్డి చెప్పగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఇంట్లో జయకు ఏమి జరిగిందనే ప్రశ్న తలెత్తింది. జయకు సీరియస్ అయిన సమయంలో శశికళ మాత్రమే ఉంది. జయ ఆసుపత్రిలో ఉండగా ఆమెకు అందుతున్న వైద్యసేవలను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, అపోలో గ్రూప్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి పర్యవేక్షించారు. దీంతో విచారణ కమిషన్ ఈ ముగ్గురికీ సమన్లు జారీచేసింది. బెంగళూరు జైలు అధికారుల ద్వారా శశికళకు ఈ సమన్లు అందాయి. 15 రోజుల్లోగా బదులివ్వాలని శశికళను కమిషన్ ఆదేశించింది. శశికళ తరఫున ముందుగా ఆమె న్యాయవాది హాజరై వాంగ్మూలం ఇస్తారు. అందుకు కమిషన్ సంతృప్తి చెందని పక్షంలో శశికళను నేరుగా పిలిపించుకుని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారని సమాచారం. అలాగే ప్రతాప్ సీ రెడ్డికి పదిరోజుల గడువు ఇచ్చారు. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన కమిషన్ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే జయకు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన అన్ని బులెటిన్లు పదిరోజుల్లోగా కమిషన్ కు అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రీతారెడ్డి సమన్ల వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, జయవిచారణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మూడునెలల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అనేక అంశాలు విచారణ రావాల్సిన కారణంగా గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
పుష్కర తొక్కిసలాటపై మూడోసారి విచారణ
రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ సోమవారం మూడోసారి విచారణ చేపట్టనుంది. అంతకుముందు ఈ ఏడాది జనవరి 18న, ఫిబ్రవరి 23న రెండు దఫాలుగా జరిగింది. తొలిదఫా ఒక్క అఫిడవిట్ మాత్రమే అందగా, తర్వాత 31 అఫిడవిట్లు దాఖలయ్యాయి. అఫిడవిట్ల సమర్పణకు ఈ నెల 5తో గడువు ముగిసింది. అఫిడవిట్ల సమర్పణకే మూడు నెలలు గడిచింది. మిగిలిన మూడు నెలల కాలంలో విచారణ పూర్తిస్థాయిలో జరిపి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా ఈ సంఘటనలో ప్రభుత్వ లోపాలు ఉండడం వల్లే బాధ్యులపై చర్యలు ఉంటాయా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అందని ఆధారాలు తొక్కిసలాట సంఘటనపై వివిధ శాఖల అధికారులు ఇంకా ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యతలు ఎవరు నిర్వహించారు, ఏ శాఖలు ఉన్నాయి, వాటి ఇన్చార్జిలు ఎవరు, పుష్కర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంత మందిని వలంటీర్లుగా నియమించారు తదితర విషయాలపై రికార్డులు కమిషన్‌కు అందజేయాలి. ఇలాఉండగా బాధితుల పక్షాన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటీషన్‌పై కమిషన్ ఎదుట ప్రభుత్వ ప్లీడర్ ప్రాథమిక అభ్యంతరాలు తెలిపారు. కమిషన్ ముందు ముప్పాళ్ల సుబ్బారావు పార్టీగా కాకుండా సాక్షిగా మాత్రమే హాజరవుతున్నారని, ఆర్డర్ 12, రూల్ 8 సివిల్ ప్రొసీజర్ కింద అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. అందువల్ల కమిషన్ ముందు డాక్యుమెంట్లను దాఖలు పరిచే అంశాన్ని తిరస్కరించాలని ఫిబ్రవరి 22న ఫైల్ చేశారు. నిజనిర్ధారణ ఎలా! పుష్కర తొక్కిసలాటకు సంబంధించి ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలు కమిషన్ కు సమర్పించకపోతే నిజనిర్ధారణ ఎలా జరుగుతుందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధితుల తరఫున ముప్పాళ్ల సుబ్బారావు నిబంధనల మేరకు తన వాదనలు దాఖలు చేస్తున్నారు. కమిషన్ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను విచారణ సమయంలో అనుసరిస్తామని బహిరంగంగా చెప్పింది. పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుందన్న భయంతోనే విజువల్స్ సాక్ష్యాలను మాయం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 19లోగా ఆధారాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా ఇవ్వలేదు. -
గుజరాత్ ‘నిఘా’పై దర్యాప్తునకు కేబినెట్ ఓకే
కేంద్రం నిర్ణయంపై మండిపడిన బీజేపీ న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడైన ఆ రాష్ట్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి అమిత్ షా ఆదేశాలతో ఒక మహిళపై పోలీసులు నిఘా కొనసాగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గురువారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీల్లో అనధికారిక నిఘా వ్యవహారాలపై ఈ కమిషన్ దర్యాప్తు జరుపుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఈ దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ కమిషన్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కేంద్రం నిర్ణయంలో చట్టబద్ధతను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ప్రకటించారు.