బ్యారేజీ వివరాలు, నష్టంపై ఆరా.. సర్కారుకు నివేదిక ఇస్తామన్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్
ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందని వెల్లడి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు.
బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్‌అండ్‌టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.
మేడిగడ్డకు ఇంకా గండమే!
» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ
» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక
» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి
» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచన
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.
కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..
» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.
» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.
» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.
» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.
» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.
» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.
» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి.
Comments
Please login to add a commentAdd a comment