
తమిళనాడు గవర్నర్ పని చేస్తున్నారా?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయడానికి సహకరించకుండా ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. గవర్నర్ చర్యలపై మండిపడ్డారు.
భారతీయ జనతాపార్టీ డైరెక్షన్‌లో తమిళనాడు గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు. అసలు గవర్నర్ విధులను ఆయన నిర్వర్తిస్తున్నారా అని దిగ్విజయ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అంతకుముందు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరునవుక్కరసర్ సైతం బీజేపీ వ్యవహారాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ లబ్ధి పొందాలని భావిస్తుందని ఆయన విమర్శించారు.
Political turmoil in TN and Governor playing truant. Is he fulfilling his duties ? No. He is doing politics under direction of BJP.
— digvijaya singh (@digvijaya_28) February 8, 2017