నెలరోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ‍్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితను గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు శనివారం పరామర్శించారు. ఆయన ఇవాళ ఉదయం అపోలో ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.