tamilnadu governor
-
ముఖ్యమంత్రి సలహానే కీలకం
ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. భారత గణతంత్రంలోని గవర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదనేది స్పష్టం. ముఖ్యమంత్రి సలహా లేకుండా సిట్టింగ్ మంత్రిని తొలగించడం ద్వారా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగపరంగా అరు దైన సాహసోపేత ప్రయోగం చేశారు. వాస్తవానికి, ఆదేశం జారీ చేసిన కొన్ని గంటల్లో, ఆయన దానిని నిలిపివేశారు. అయినా ఈ చర్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతో పాటు రాజ్యాంగవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సూచించిందని అనంతరం గవర్నర్ వెల్లడించారు. దేశంలోని అత్యున్నత న్యాయ అధికారిని సంప్రదించకుండా, ముఖ్యమంత్రి తప్పనిసరి సలహా లేకుండా, అసెంబ్లీలో పూర్తి మెజా రిటీ ఉన్న ప్రభుత్వ మంత్రిని తొలగించాలనే అపూర్వమైన ఉత్తర్వు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఆర్టికల్ 164 ప్రకారం, సీఎం సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. తన మంత్రులను ఎంపిక చేయడం లేదా తొలగించడం పూర్తిగా సీఎం ప్రత్యేకాధికారం. ఒక మంత్రిని వద్దనుకుంటే, తదనుగుణంగా గవర్నర్‌కు సలహా ఇస్తాడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించే అన్ని దేశాల్లోనూ ఇదే వాడుకగా ఉంటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, ‘గవర్నర్ సంతుష్టి (ప్లెజర్)తో ఉన్నంతకాలం మంత్రులు తమ బాధ్యతలు నిర్వహిస్తారు’ అని చెబుతోంది. ఇది ఒక మంత్రి మనుగడ పూర్తిగా గవర్నర్ ఇష్టా నిష్టాలపై ఆధారపడి ఉందనీ, ఏ మంత్రి పట్ల అయినా గవర్నర్ తన సంతుష్టిని ఉపసంహరించుకోవచ్చనీ అభిప్రాయాన్ని కలిగించవచ్చు. ‘గవర్నర్ సంతుష్టి’ అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51కి వెళ్లాలి. సెక్షన్ 51లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం, గవర్నర్ తన విచక్షణ మేరకే మంత్రులను పదవుల్లోకి ఎన్ను కోవాలి. అదేవిధంగా సెక్షన్ 51లోని సబ్–సెక్షన్ (5) మంత్రుల ఎంపికకు, తొలగింపునకు సంబంధించి గవర్నర్ తన విధిని విచక్ష ణతో అమలు చేయాలని చెబుతోంది. ఆ విధంగా, భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51, మంత్రులను ఎన్నుకోవడానికీ, వారిని తొలగించడానికీ గవర్నర్‌కు విచక్షణాధికారాలను అందిస్తోంది. సంతుష్ట సిద్ధాంతం ఇక్కడ పూర్తిగా పనిచేస్తోంది. భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనలను మన రాజ్యాంగం పెద్ద ఎత్తున పునరుత్పాదన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164లో సెక్షన్ 51 గణనీయంగా పునరుత్పాదన అయింది. అటువంటి నిబంధనలో సంతుష్ట సిద్ధాంతం ఒకటి. కానీ రాజ్యాంగ నిర్మాతలు దీనికి సంబంధించి కీలకమైన మార్పు చేశారు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, వారు ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. అంటే భారత గణతంత్రంలోని గవ ర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. పైగా ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొల గించే విచక్షణాధికారం గవర్నర్‌కు లేనప్పుడు సంతుష్ట సిద్ధాంతం దాని బలాన్ని కోల్పోతుంది. పైగా రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయిన ముఖ్యమంత్రి నుండి సలహా వచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించడం లాంఛనప్రాయంగా మారుతుంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టంగా నిర్ధారించవచ్చు. గవర్నర్ తీసుకునే అలాంటి చర్య రాజ్యాంగ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా మనం తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన గవర్నర్, మంత్రులను ఇష్టానుసారంగా తొలగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. స్వతంత్రంగా అమలు చేయగల కార్యనిర్వాహక అధికారం గవర్నర్‌కు లేదని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 153 ప్రకారం, రాజ్యాంగంలో పేర్కొన్న విచక్షణ విధులు మినహా, అతని అన్ని విధులు మంత్రిమండలి సహాయం, సలహాపై మాత్రమే నిర్వహించబడతాయి. 1974 నాటి శంశేర్ సింగ్ కేసులో, ఎన్ను కోబడిన ప్రభుత్వానికి సంబంధించినంతవరకు గవర్నర్ అధికారాలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. తదుపరి నిర్ణయాలన్నీ దానిని పునరుద్ఘాటించాయి. కాబట్టి, మన రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ స్థానంపై చట్టం స్థిరపడింది. అలాగే, మంత్రిని నియమించడం లేదా తొలగించడంలో గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని ఆర్టికల్ 164 స్పష్టం చేసింది. రెండూ సీఎం పరిధిలోనే ఉన్నాయి. గవర్నర్‌పై కాకుండా సీఎం విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రులు క్యాబినెట్లో ఉండగలరు. గవర్నర్ అత్యున్నత రాజ్యాంగ కార్యనిర్వాహకుడు. ఆయన ఆదర్శప్రాయమైన నిష్పాక్షికతతో వ్యవహరించాలి. క్రియాశీల రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించకూడదని రాజ్యాంగ అసెంబ్లీలో కొంతమంది సభ్యుల నుండి డిమాండ్ వచ్చింది. అటువంటి సూచనలు ఆ సమయంలో తీసుకోనప్పటికీ, రాజకీయ నాయకులు లేదా మాజీ అధికారులు రాజ్‌భవన్ లో పని చేసిన సమయంలో ప్రశంసనీయంగా పనిచేశారు. ఈ మహోన్నతమైన, ముఖ్యమైన రాజ్యాంగ పదవిని స్వీకరించే స్త్రీ పురుషులకు ఉంటున్న అనుకూలత, అర్హతల గురించి భారతీయ సమాజం చర్చను ప్రారంభించాల్సిన సమయం ఇది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో రాజ కీయాల కేంద్రం మెల్లగా రాజ్ భవన్ వైపు మొగ్గుతోంది. ఇది కచ్చితంగా సానుకూలమైన ఆలోచన మాత్రం కాదు. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్‌సభ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్‌లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
ప్రముఖులపై కరోనా పంజా
న్యూఢిల్లీ/బెంగళూరు/లక్నో: కరోనా మహ మ్మారి అత్యంత ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్ మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు. అమిత్ షాకు కరోనా పాజిటివ్ తనలో కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సుశీల్ కటారియా పర్యవేక్షిస్తున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. అమిత్ షాను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన ఇటీవలే కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, హరియాణా సీఎం ఖట్టర్ ఆకాంక్షించారు. యెడియూరప్ప కూడా.. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. యెడియూరప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసినవారు కరో నా టెస్టు చేయించుకోవాలని, హోం ఐసో లేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనాతో యూపీ మంత్రి మృతి యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆదివారం లక్నో లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశా రు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా బారిన తమిళనాడు గవర్నర్ సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు(80) కరోనా వైరస్ సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని కావేరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో ముగ్గురికి కరోనా సోకడంతో గవర్నర్ పురోహిత్ జూలై 29 నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఒక వైద్య బృందం ఎప్పటికప్పుడు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌లో కరోనా లక్షణాలు బయటపడలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశాయి. -
‘నక్కీరన్’ గోపాల్‌పై కేసు వెనక్కి తీసుకోవాలి
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను అగౌరవపరిచారనే కారణంతో ‘నక్కీరన్’ వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఖండించింది. భారత రాష్ట్రపతి, గవర్నర్లను కించపరుస్తూ, వారి బాధ్యతలకు తీవ్ర ఆటంకం కలిగించే వారిని శిక్షించేందుకు వాడే ఐపీసీ సెక్షన్ 124ను నక్కీరన్ గోపాల్‌పై మోపడం అన్యాయమని ఐఎన్ఎస్ అధ్యక్షులు జయంత్ మమెన్ మాథ్యూ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను గౌరవించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. నక్కీరన్ గోపాల్‌పై, వారపత్రిక సిబ్బందిపై దాఖలైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్కారుకు విజ్ఞప్తిచేశారు. -
నా రూటే సెపరేటు
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన రాజ్‌భవన్ కార్యకలాపాలు ఆధ్యంతం వివాదాస్పదంగా మారిపోయాయి. నారూటే..సెపరేటు అన్నట్లుగా ఆయన వ్యవహారశైలితో రాజ్‌భవన్‌రచ్చబండగా మారిపోయింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా 2017 అక్టోబర్ 6న బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే రాజ్‌భవన్‌లో మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారాన్ని నేను ముట్టను, మరెవ్వరినీ ముట్టనివ్వను అని హుకుం జారీచేశారు. రాజ్‌భవన్‌కు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే అతిథులకు సైతం స్వచ్ఛమైన శాఖాహారమేనని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ సిబ్బంది సైతం తమ లంచ్ బాక్సుల్లో మాంసాహారం తీసుకురాకూడదు, ఒక వేళ తినాలనిపిస్తే బైటకు వెళ్లి ఆరగించిరండి అంటూ ఆదేశించి రాజ్‌భవన్‌ను వెజ్‌భవన్‌గా మార్చివేశారు. ఈ ఆదేశాలకు లోలోన గొణుక్కున్నవారు లేకపోలేదు. ఇక ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. గవర్నర్ సమీక్షలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ సమీక్షలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. రామనాథపురం జిల్లా పర్యటనలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా గవర్నర్ తొంగిచూసాడంటూ కలకలం రేగింది. స్థానికులు గవర్నర్‌ను చుట్టుముట్టి నిలదీయడంతో సెక్యూరిటీ గార్డులు ఆయనను అర్ధంతరంగా కారులో ఎక్కించి కాపాడారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం సైతం గవర్నర్ మెడకు చుట్టుకుంది. కళాశాల విద్యార్థినులను లైంగికంగా ప్రలోభపెట్టేందుకు నిర్మలాదేవి జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల్లో గవర్నర్ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై నిర్మలాదేవి అరెస్టయిన అదే రోజు సాయంత్రానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానంతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించారు. గవర్నర్ హడావుడిని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు అనుమానించాయి. పోలీసులు, మదురై కామరాజ్ యూనివర్సిటీ ఈ వ్యవహారంలో నిగ్గుతేల్చాల్సి ఉండగా గవర్నర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంలోని మర్మమేమని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశం పెట్టి తనపై పడిన మచ్చను తొలగించుకునే ప్రయత్నంలో గవర్నర్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ఆమె చెంపను సుతారంగా నిమరడంతో జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో మరోసారి కంగారుపడిన గవర్నర్ సదరు మహిళా విలేకరికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అనేక గందరగోళాల మధ్య అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్ణాటకకు చెందిన సూరప్పను నియమించి మరో రచ్చకు తెరదీశారు. కళాశాల విద్యార్థినులపై లైంగిక ప్రలో భాలకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పదవి నుంచి తప్పుకోవాలని లేదా కేంద్రం రీకాల్ చేయాలని, సూరప్ప నియామకాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ప్రతిపక్షాల ఆందోళనలకు గవర్నర్ బంగ్లా శాశ్వత చిరునామాగా మారడం, ముట్టడి యత్నాలు కొనసాగుతున్నందున సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఇద్దరు సహాయ కమిషనర్లు, ఇద్దరు అదనపు కమిషనర్లు వెయ్యిమంది ఇతర పోలీసు అధికారులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్ బంగ్లాలోకి వెళ్లే రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధంగా ఉంచుకున్నారు. రాజ్‌భవన్ సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారిని మాత్రమే గవర్నర్ బంగ్లాలోకి అనుమతిస్తున్నారు. -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పిన గవర్నర్
చెన్నై : విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్ట్ పట్ల తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కోరారు. అసలేం జరిగిందంటే.. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
-
మహిళా జర్నలిస్ట్ చెంపను తాకిన గవర్నర్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అనుచిత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల ఆయన ప్రవర్తించి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి పేర్కొనడంతో ఆయన ఇరుకున పడినట్లయింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మహిళా పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. సమావేశ ముగింపు సమయంలో వేదికపై నుంచి వస్తున్న గవర్నర్‌ను ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం మంచి పద్థతి కాదంటూ ఆయన చర్యను ఖండించింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి.. ‘ ఆయన ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ గౌరవానికి అలా భంగం కలిగించడం సభ్యత అనిపించుకోదంటూ’ ట్వీట్ చేశారు. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్ అనుబంధ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. Washed my face several times. Still not able to get rid of it. So agitated and angered Mr Governor Banwarilal Purohit. It might be an act of appreciation by you and grandfatherly attitude. But to me you are wrong. — Lakshmi Subramanian (@lakhinathan) April 17, 2018 -
పురోహిత్ ప్రజల గవర్నర్
తంజావూర్: జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర గవర్నర్‌ను ప్రతిపక్షాలు తప్పుబడుతుండగా ఆయనకు తమిళనాడు మంత్రి ఒకరు అండగా నిలిచి పురోహిత్ ప్రజల గవర్నర్ అని కొనియాడారు. కమలాలు పండించే నాగపూర్ నుంచి ధాన్యం పండించే తంజావూర్‌కు వచ్చారని తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, పీఎంకే, ఏఐడీఎంకే నుంచి విడిపోయిన టి.టి.వి.దినకరన్‌లు గవర్నర్ చర్యలను తప్పుబట్టారు. ఇది రాష్ట్ర హక్కులలో జోక్యం చేసుకోవడమే అవుతుందని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కొందరు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పురోహిత్ ఎంజీఆర్‌కు నివాళులర్పించి ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనియాడారు. -
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
-
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా శశికళ వర్గీయుడైన మంత్రి ఎడపాడి పళనిస్వామికి పిలుపు వచ్చింది. ఉదయం 12.30 గంటలకు ఆయనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా శశికళ వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. పళని స్వామి, సెంగొట్టయాన్తో పాటు మరో నలుగురు నేతలు రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. గవర్నర్ అవకాశం ఇస్తే తాము ఈరోజే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే జరిగితే శశికళ జైలుకు వెళ్లినా, ఆమె జేబులోని మనిషి అయిన పళని స్వామే ముఖ్యమంత్రి అవుతారంటే.. పరోక్షంగా శశికళ వర్గం తన పట్టు నిరూపించుకున్నట్లు అవుతుంది. అయితే, అసలు గవర్నర్ పిలిచింది ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకేనా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత వాళ్లు చెబితే తప్ప అధికారికంగా ఏ విషయమూ చెప్పలేని పరిస్థితి ఉంది. బుధవారం కూడా పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని గవర్నర్ పిలిచి మాట్లాడారు. దాంతో ఇప్పుడు నేరుగా పళనిస్వామికి చాన్స్ ఇచ్చారా లేదా అన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాలేదనే చెప్పాలి. ఇక తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి వర్గం చెబుతోంది. అన్నాడీఎంకేకు అసెంబ్లీలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లలో 120 మంది వరకు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్టులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పళనిస్వామికి పిలుపు రావడంతో పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, అసెంబ్లీలో బల నిరూపణ సమయానికి తాము బలం పుంజుకోవచ్చని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామికి ఉండదని పన్నీర్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం వద్ద కనీసం 17-20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది నిజం అయితే మాత్రం పళని స్వామి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవడం కష్టమే అవుతుంది. ప్రజల మద్దతు తనకు స్పష్టంగా ఉన్నందున కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు పెట్టాలని, అది జరిగితే ఎవరికి ఎంతమంది మద్దతుందో స్పష్టంగా తేలిపోతుందని పన్నీర్ వర్గం అంటోంది. మరోవైపు అసలు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకే పిలిచారా, లేక కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తికి బలం నిరూపించుకోడానికి కొంత సమయం ఉంటుంది. కానీ శశికళ వర్గం మాత్రం వెంటనే బల నిరూపణ చేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
ముందు సెల్వం, తర్వాత శశికళ..
-
పన్నీరు సెల్వంకు ఫస్ట్ ఛాన్స్!
చెన్నై: అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. ఈ రోజు (గురువారం) చెన్నై వెళ్తున్న మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అన్నా డీఎంకే చీఫ్ శశికళ చెబుతుండగా.. తనకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెబుతున్నారు. ఇరు వర్గాలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తొలుత పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశముంది. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించిన పన్నీరు సెల్వం.. సభలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నారు. సభలో బలనిరూపణ జరిగితే ఎమ్మెల్యేలు తనవైపే వస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు శశికళ వర్గం కూడా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే ఓ హోటల్‌కు తరలించారు. పార్టీలో 134 మంది ఎమ్మెల్యేలకుగాను 131 మంది శశికళ క్యాంప్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలందరితో కలసి శశికళ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బలనిరూపణకు పన్నీరు సెల్వానికి అవకాశం ఇస్తారా? లేక ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? లేక అన్నా డీఎంకేలో చీలిక కారణంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. -
రాజ్‌నాథ్‌తో తమిళనాడు వ్యవహారాలపై చర్చ
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తమిళనాడు వ్యవహారాలపై కేంద్రమంత్రితో విద్యాసాగర్ రావు చర్చించారు. జయలలిత మరణంతో తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టగా, అన్నా డీఎంకే పగ్గాలు జయలలిత స్నేహితురాలు శశికళ చేతిలో ఉన్నాయి. జయలలిత మరణవార్తను దాచి రాజకీయాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అన్నా డీఎంకేలో విభేదాలున్నాయని, నాయకత్వ పోరు తప్పదని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత మరణించిన నాలుగు రోజుల తర్వాత ఆయన రాజ్‌నాథ్‌ను కలిశారు. -
జయకు గవర్నర్ విద్యాసాగర్ పరామర్శ
-
రోశయ్యకు కలిసొచ్చేనా !
సీఎం జయ సిఫార్సుగా ప్రచారం చెన్నై: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది సామెత. ఇందుకు భిన్నంగా కొత్త గవర్నర్‌గా శంకరమూర్తి నియామకం విషయంలో కావేరీ చిక్కులు ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్యకు కలిసొచ్చేనా? ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న చర్చ ఇదే. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని విశ్లేషకుల వాదన. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆయన ఐదేళ్ల పదవీకాలం ముగిసేందుకు మరో రెండువారాలు మాత్రమే ఉంది. కేంద్రంలో ప్రభుత్వం మారినపుడు సహజంగా గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను బదిలీ చేయడమో లేక ఇంటికి పంపడమే సహజంగా జరుగుతుంది. రెండేళ్ల క్రితం కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనించి అనేక రాష్ట్రాల గవర్నర్లను ఎడాపెడా మార్చివేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో నియమితులైన కాంగ్రెస్ కురువృద్ధుడు కె.రోశయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదాలకు అతీతమైన వ్యక్తిగా, ప్రతిపక్ష పార్టీలు సైతం గౌరవించే నేతగా పేరొందిన రోశయ్య తమిళనాడులో సైతం అదే కీర్తిని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్య మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కొనసాగింది. దీనికి తోడు ప్రధాని మోదీకి, సీఎం జయలలితకు మధ్య పార్టీలకు అతీతంగా నెలకొని ఉన్న సత్ససంబంధాలు రోశయ్యను మరో మూడేళ్లపాటూ కొనసాగేలా చేశాయి. ఈ నెలాఖరుతో పరోక్షంగా సాగిన పొడిగింపు కాలం ముగియబోతోంది. శంకరమూర్తితో సంకటం రాజకీయ పునరావాసం వంటి రాష్ట్ర గవర్నర్ల పోస్టుల కోసం బీజేపీలోని ఎందరో పెద్దలు ఢిల్లీలో క్యూ కట్టుకుని ఉన్నారు. అధికారంలోకి వచ్చి మూడో ఏడు గడుస్తున్న తరుణంలో వారిలో కొందరినైనా సంతృప్తిపరచాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పై ఉంది. ఈ తరుణంలో ఖాళీ కాబోతున్న తమిళనాడు గవర్నర్ స్థానంపై బీజేపీ కన్నుపడింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత, శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి పేరు రాబోయే తమిళనాడు గవర్నర్‌గా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆయన పేరును ఖరారు చేసినట్లు అనధికారికంగా వెల్లడైంది. అయితే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల సమస్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా నెలకొని ఉంది. దశాబ్దాల తరబడి నలుగుతున్న కావేరీ వాటా జలాల సమస్య రానురానూ జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తే రాష్ట్రం మూడు పోరాటాలు, ఆరు ఆందోళనలుగా మారుతుందోననే భయం కేంద్రంలో నెలకొని ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై సీఎం జయలలిత సైతం శంకరమూర్తి నియామకాన్ని విబేధిస్తున్నట్లు తెలుస్తోంది. కొరివితో తలగోక్కున్నట్లుగా మారే శంకరమూర్తిని తెచ్చుకునేకంటే ఐదేళ్లుగా అలవాటుపడిన రోశయ్యను కొనసాగించాల్సిందిగా సీఎం జయ కేంద్రాన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోశయ్య పదవీకాలం పొడిగింపు అవకాశమే లేదని రాష్ట్ర బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. అలాగే కావేరీ జలాల వివాదం నేపథ్యంలో శంకరమూర్తి నియామకంపై కేంద్రం వెనక్కు తగ్గినట్లు స్పష్టం చేశాయి. ఏదేమైనా పొడిగింపా, కొత్త నియామకమా అనే స్పష్టత కోసం మరో రెండువారాలు ఆగాల్సిందే. -
ఇలాగైతే హామీలే మిగలవు
‘ఉచిత’ పథకాలపై తమిళనాడు గవర్నర్ రోశయ్య హైదరాబాద్: జనాకర్షక ఉచిత పథకాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరువయ్యేందుకు పోటీపడుతున్నాయని, ఇలాగైతే భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు హామీలే మిగలవని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ... రాజకీయాలంటే ప్రజలకు దిశ, దశ నిర్దేశించేవిగా ఉండాలని, కానీ ప్రస్తుతం ఉచిత హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వైశ్యులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఐకమత్యంగా నిరంతర సామాజిక స్పృహతో ముందుకు సాగాలన్నారు. వేదికలపై తీర్మానాలు చేసి ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఎవరూ చైతన్యవంతులు కారన్నారు. సమాజంలో ఆర్యవైశ్యులపై మంచి అభిప్రాయం, గుర్తింపు ఉన్నాయని, దానిని నిలుపుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల్లో వెనుకబడిన వారి పిల్లల చదువుకు ఉపకార వేతనాలు ఇచ్చేలా సంఘం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ... రాష్ట్ర జనాభాలో 8 శాతం ఉన్న వైశ్యులు ఆ ప్రాతిపదికన రాజకీయంగా ఎదగాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్కుమార్సంఘీ, మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద పాల్గొన్నారు. -
ఇదొక సాహసం
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పౌరాణిక, చారిత్రక చిత్రం చేయడం ఓ సాహసం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. సుమన్, రమ్యకృష్ణ ముఖ్యతారలుగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో జె.ఆర్.పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ‘శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర’ పాటల సీడీని హైదరాబాద్‌లో రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ -‘‘కథాపరంగానే కాకుండా, సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది’’ అని చెప్పారు. ఇందులోని ఏడు పాటలూ అన్ని వర్గాలనూ అలరిస్తాయని సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు తెలిపారు. ఈ వేడుకలో డి.రామానాయుడు, మంత్రి టి.జి.వెంకటేష్, గంజి రాజమౌళి గుప్తా, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.