రాజ్‌నాథ్‌తో తమిళనాడు వ్యవహారాలపై చర్చ
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తమిళనాడు వ్యవహారాలపై కేంద్రమంత్రితో విద్యాసాగర్ రావు చర్చించారు.
జయలలిత మరణంతో తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ‍్యతలు చేపట్టగా, అన్నా డీఎంకే పగ్గాలు జయలలిత స్నేహితురాలు శశికళ చేతిలో ఉన్నాయి. జయలలిత మరణవార్తను దాచి రాజకీయాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అన్నా డీఎంకేలో విభేదాలున్నాయని, నాయకత్వ పోరు తప్పదని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత మరణించిన నాలుగు రోజుల తర్వాత ఆయన రాజ్‌నాథ్‌ను కలిశారు.