vidhyasagar rao
-
విద్యావేత్త అయోధ్య రామారావు మృతి
సాక్షి, కరీంనగర్ : వాణినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ చీటి అయోధ్య రామారావు(82) అనా రోగ్యంతో శుక్రవారం కరీంనగర్లో మృతిచెం దారు. కొన్ని నెలలుగా వయోభారం, అనా రోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ మంత్రి, సీని యర్ కాంగ్రెస్ నేత ఎం.సత్యనారాయణరావుకు అయోధ్యరా మారావు స్వయాన సోదరుడు. ఆయన మృతి వార్త తెలియగానే మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు, త దితరులు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుం బ సభ్యుల ను ఓదార్చారు. విద్య, సాహితీ లో కానికి ఆయన మరణం తీరని లోటన్నారు. ప్రముఖుల సంతాపం... అయోధ్య రామారావు మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోరేం సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతపల్లి శ్రీనివాస్‌రావు సంతాపం ప్రకటించారు. జిల్లా కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు చిట్టినేని లతకుమారి, రంగారెడ్డి, కరీంనగర్ మాజీ డీఈవో అనభేరి రాజేశ్వరావు, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాస్యం సేనాధిపతి, ఉదయసాహితీ అధ్యక్షుడు వైరాగ్య ప్రభాకర్, కవులు బీయన్‌ఆర్ శర్మ, మాడిశెట్టి గోపాల్, కేఎస్ అనంతాచార్య, పొన్నం రవిచంద్ర, గాజుల రవీందర్ ఉన్నారు. నివాళి అర్పిస్తున్న మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా.. చీటి అయోధ్య రామారావు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో 1937 జూలై 21 న చీటి హన్మంతరావు, యశోదమ్మ దంపతలకు జన్మించారు. ప్రాథమిక విద్యాభాసం కరీంనగర్లో పూర్తి చేశారు. 1963లో వాణినికేతన్ విద్యాసమితి ఆధ్వర్యంలో ప్రాథమిక విద్యాలయం ప్రారంభించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఈడీ కళాశాలలను నెలకొల్పారు. నే టి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, తదితర ప్రముఖులు వాణినికేతన్ పాఠశాలల్లో చది వారు. రా మారావు సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులుగా పని చేశారు. విద్య, సాహితీ సేవలకు గాను ప్రభుత్వంనుంచి అవార్డులు, సత్కారాలు పొందారు. నైతిక విలువలు గల విద్యావేత్త... నైతిక విలువలు గల విద్యావేత్త అయోధ్యరామారావు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఐదు దశాబ్దాలుగా విద్యావేత్తగా జిల్లా అభివృద్ధిలో భాగమయ్యారని అన్నారు. ఆయన తనకు చిన్నప్పుడు లెక్కల మాస్టర్‌గా చదువు చెప్పారని, విలువలతో కూడిన అందించారని, ఆయన లేని లోటు తీరనిదని, ఆయన అడుగు జాడల్లో తామందరం నడుస్తామని అన్నారు. ఇటీవలనే దసరా రోజున ఫోన్లో మాట్లాడుతూ తాను లేకున్నా విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తాను కలుస్తానని చెప్పాను.. ఇంతలోనే ఇలా జరుగడం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మంత్రి వెంట ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, తదితరులు ఉన్నారు. -
ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపాలి
మెట్పల్లి: వచ్చే ఎన్నికల్లో అన్ని కుల సంఘాలు టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పట్టణంలో ఆదివారం పలు కుల సంఘాలను ఆయన కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి ఇటీవల రూ.40కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే కుల సంఘాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక అంగడిబజార్‌లో విద్యాసాగర్‌రావు భార్య ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలిసి టీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంతో పాటు, మండలంలోని వర్షకొండలో శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆదివారం పాల్గొన్నారు. మండల కేంద్రంలో గూడ నిహారిక శారీ ఫంక్షన్‌కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. వర్షకొండలో వైష్ణవి,నవీన్ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల ధశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోరిగం రాజు, మాజీ జెడ్పీటీసీ కోక్కు పురుషోత్తం, నాయకులు సత్యనారాయణ ,ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. కోరుట్లటౌన్: కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును గెలిపించాలని పట్టణంలోని 5వ వార్డులో టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు గండ్ర శిల్ప, పుప్పాల ఉమాదేవి, రెంజర్ల కళ్యాణి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో ఆసరా కల్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. కోరుట్లరూరల్: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని వైస్ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని యూసుఫ్‌నగర్‌లో ఆదివారం ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ టిఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ సురేష్‌గౌడ్, నాయకులు భూమయ్య, రాజ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు -
బోయినపల్లి అల్లుళ్లు
బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ప్రత్యేక గుర్తింపు సంత రించుకుంది. కేవలం 28 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ చిన్న మండలం ఎన్నికల వేళ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. బోయినపల్లి మండలానికి ప్రముఖ నేతలతో ఉన్న బంధుత్వం, అనుబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ మండలం అల్లుళ్లు కావడం.. అనేక మంది ప్రముఖుల చుట్టరికం ఉండటంతో ఈ మండలవాసులు తెగ ఫీలవుతుంటారు. ‘ఫలానోడు మా మండలం అల్లుడోయి’అని గర్వంగా చెప్పుకుంటారు. బోయినపల్లి మం డలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, లక్ష్మి దంపతుల కూతురు శోభను పరిణయమాడిన సీఎం కేసీఆర్ కొదురుపాకకు అల్లుడయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి సత్యనారాయణరావు, లచ్చమ్మ దంపతుల కూతురు వినోదను వివాహమాడారు. కార్యకర్తలు, విద్యాసాగర్‌రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం ఇక్కడి అల్లుడే. మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి మార్తాండరావు–రాజ్యలక్ష్మి కూతురు మాధవిని ఆయన వివాహమాడారు. రాజ్యసభ సభ్యుడూ ఈ మండలవాసే కేసీఆర్ తోడల్లుడు మండలంలోని కొదురుపాకకు చెందిన జోగినిపల్లి రవీందర్రావు కుమారుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు మండలంలోని మాన్వాడలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపారు. ఆయన కూతురును మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి రాజేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ చల్మెడ ఆసుపత్రి అధినేత లక్ష్మీనరసింహరావుకు కోరెం గ్రామంతో చుట్టరికం ఉంది. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో బోయినపల్లి మండలానికి అనుబంధం ఉండటం ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు. -
అన్నా... నేను కేసీఆర్‌ను..!
హైదరాబాద్: ‘అన్నా.. విద్యన్నా.. నేను కేసీఆర్‌ను అన్నా..!’ అంటూ తెలంగాణా రాస్ర్ట ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావును పరామర్శిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్న మాటలు ఇవీ. ఇదే సమయంలో విద్యాసాగర్‌రావు సతీమణి కూడా...‘ ఏమండీ....సారొచ్చిండు...కేసీఆర్ సారొచ్చిండు....ఒక్కసారి చూడుండి’ అంటూ పిలవగా ఒకసారి కదిలినట్లు అనిపించారు. దీంతో మళ్ళీ కేసీఆర్ ‘అన్నా... విద్యన్నా.. అన్నా.’ అంటూ ఆప్యాయంగా మరోసారి పిలవగా శరీరంలో కదలిక ఏర్పడడంతో వైద్య చికిత్సకు స్పందించడం, కాళ్ళు, చేతులు కదిలించడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు సతీమణి, ఇతర, బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్‌రావు త్వరగా కోలుకుంటారని ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంటినెంటల్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్ రెడ్డి, ఇతర ఉన్నత వైద్యాధికారులతో మాట్లాడారు. ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలను అందిస్తున్నామని ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఆయన కోలుకొని మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చేలా తగిన వైద్య సేవలను అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా తనతో పాటు ఆస్పత్రికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు వినోద్‌కుమార్, గుత్తాసుఖేందర్‌రెడ్డిలు విద్యాసాగర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. -
రాజ్‌నాథ్‌తో తమిళనాడు వ్యవహారాలపై చర్చ
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తమిళనాడు వ్యవహారాలపై కేంద్రమంత్రితో విద్యాసాగర్ రావు చర్చించారు. జయలలిత మరణంతో తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టగా, అన్నా డీఎంకే పగ్గాలు జయలలిత స్నేహితురాలు శశికళ చేతిలో ఉన్నాయి. జయలలిత మరణవార్తను దాచి రాజకీయాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అన్నా డీఎంకేలో విభేదాలున్నాయని, నాయకత్వ పోరు తప్పదని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత మరణించిన నాలుగు రోజుల తర్వాత ఆయన రాజ్‌నాథ్‌ను కలిశారు. -
బాధ్యతలు స్వీకరించిన కొప్పుల
హాజరైన ఈటెల, నాయకులు కరీంనగర్ సిటీ/ధర్మపురి: చీఫ్‌విప్‌గా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో తనకు కేటాయించిన కార్యాలయంలో ఉదయం ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కోరుట్ల, మంథనిఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు హాజరై కొప్పులను అభినందించారు. మంత్రి పదవిని ఆశించిన కొప్పుల చీఫ్‌విప్ పదవిని ముందుగా నిరాకరించడం తెలిసిందే. ఆయన పదవీబాధ్యతలు చేపట్టకపోవడంతో టీఆర్ఎస్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత కొప్పుల చీఫ్‌విప్‌గా కొనసాగడానికే మొగ్గుచూపారు. ముహూర్తం ప్రకారం శుక్రవారం తన కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. -
వ్యవసాయం, నీటిపారుదలతో తెలంగాణ అభివృద్ధి : విద్యాసాగర్‌రావు
భువనగిరి : తెలంగాణ పునర్నిర్మాణానికి నీటిపారుదల,వ్యవసాయ రంగాల అభివృద్ధి ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక రహదారి బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. నదీజలాల విషయంలో సీమాంధ్రుల కుట్రల ఫలితంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర జల సంఘంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఇందుకోసం చిన్న నీటి వనరులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటల్లో సాగు నీటిని నింపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తితెస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్రావు ఉన్నారు. 5