ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలి | Must Support To TRS In This Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలి

Published Mon, Nov 12 2018 12:31 PM | Last Updated on Mon, Nov 12 2018 12:31 PM

Must Support To TRS In This Elections - Sakshi

కోరుట్లలో ప్రచారం చేస్తున్న కౌన్సిలర్లు

మెట్‌పల్లి: వచ్చే ఎన్నికల్లో అన్ని కుల సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పట్టణంలో ఆదివారం పలు కుల సంఘాలను ఆయన కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి ఇటీవల రూ.40కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే కుల సంఘాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక అంగడిబజార్‌లో విద్యాసాగర్‌రావు భార్య ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంతో పాటు, మండలంలోని వర్షకొండలో శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆదివారం పాల్గొన్నారు. మండల కేంద్రంలో గూడ నిహారిక శారీ ఫంక్షన్‌కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. వర్షకొండలో వైష్ణవి,నవీన్‌ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎలాల ధశరథ్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బోరిగం రాజు, మాజీ జెడ్పీటీసీ కోక్కు పురుషోత్తం, నాయకులు సత్యనారాయణ ,ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

కోరుట్లటౌన్‌: కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును గెలిపించాలని పట్టణంలోని 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ మహిళా కౌన్సిలర్లు గండ్ర శిల్ప, పుప్పాల ఉమాదేవి, రెంజర్ల కళ్యాణి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో ఆసరా కల్పిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్ధతు ఇవ్వాలన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. 

కోరుట్లరూరల్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని వైస్‌ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని యూసుఫ్‌నగర్‌లో ఆదివారం ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ సురేష్‌గౌడ్, నాయకులు భూమయ్య, రాజ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement