
ఇదొక సాహసం
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పౌరాణిక, చారిత్రక చిత్రం చేయడం ఓ సాహసం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. సుమన్, రమ్యకృష్ణ ముఖ్యతారలుగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో జె.ఆర్.పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ‘శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర’ పాటల సీడీని హైదరాబాద్‌లో రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ -‘‘కథాపరంగానే కాకుండా, సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది’’ అని చెప్పారు.
ఇందులోని ఏడు పాటలూ అన్ని వర్గాలనూ అలరిస్తాయని సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు తెలిపారు. ఈ వేడుకలో డి.రామానాయుడు, మంత్రి టి.జి.వెంకటేష్, గంజి రాజమౌళి గుప్తా, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.