అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతం వైపు ప్రయాణిస్తుండగా సాయంత్రం సుమారు 4 గంటలకు జరిగిన ఈ దుస్సంఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పడవలో మొత్తం 45 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, 23 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడగలిగాయని, ఇద్దరు గల్లంతయ్యారని దక్షిణ అండమాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.జోహార్ చెప్పారు. కోస్ట్‌గార్డ్ బృందాలు, స్థానిక సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
Published Mon, Jan 27 2014 3:20 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement