రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ కే రోశయ్యకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రోశయ్యకు అదనపు బాధ్యతులు అప్పగించారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ఐదేళ్ల క్రితం కర్ణాటక గవర్నర్గా నియమితులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.