additional charge
-
ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్‌కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్ఎండీసీలో చేరారు. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు. -
ఉక్కు శాఖ బాధ్యతలు స్వీకరించిన సింధియా
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య మాధవ్‌రావు సింధియా గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింధియా మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖను చేపట్టిన మూడో మంత్రి కావడం గమనించాలి. ఢిల్లీలోని ఉద్యోగభవన్‌లో ఉక్కు శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తన టేబుల్‌పై వినాయకుడి విగ్రహం ఉంచి, ఈ కార్యక్రమం చేపట్టారు. ‘‘ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు స్టీల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. శ్రేయోభిలాషుల దీవెనలతో నూతన బాధ్యతలను సాధ్యమైన మేర మెరుగ్గా నిర్వహిస్తాను. ఆర్సీపీ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించాను. అగ్ర నాయకత్వం ఇచ్చిన ఈ బాధ్యతలను పూర్తి సామర్థ్యాలతో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిర్వహిస్తాను’’అంటూ సింధియా రెండు వేర్వేరు ట్వీట్లు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉక్కు శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహించారు. అలాగే, ఉక్కు రంగానికి సంబంధించి అన్ని ప్రభుత్వరంగ సంస్థల అధిపతులతోనూ సమావేశమయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్సీపీ సింగ్ రాజీనామా చేయడం తెలిసిందే. -
వాటి సందర్శనకు అధిక రుసుం చెల్లించాల్సిందే..
వాషింగ్టన్ : అమెరికాలోని జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయాలని కోరుతూ యూస్ సెనేటర్ ఓ చట్టాని ప్రతిపాదించారు. తాజ్ మహల్ వంటి స్మారక కట్టడాల నుంచి భారత్ ఇలాగే వసూల్ చేస్తోందని ఊటంకిస్తూ అమెరికన్ అవుట్ డోర్ చట్టానికి సవరణగా సెనేటర్ మెక్ ఎంజీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలోని అనేక ప్రముఖ స్మారక చిహ్నాలు, జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి 16-25 డాలర్ల వరకు అదనపు రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలోని ఉద్యానవనాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మైక్ ఎంజి పేర్కొన్నారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పార్కుల నిర్వాహణ ఖర్చులు దాదాపు 12 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును గతేడాదితో పోల్చితే కేవలం 4.1 బిలియన్ డాలర్లు మాత్రేమే ఖర్చు అయ్యింది. అంటే ప్రతి ఏడాది పార్కుల నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటం వల్ల ఈ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. మన దేశానికి వచ్చే విదేశీ సందర్శుకుల తాకిడి పెరుగుతున్నందువల్ల వారిని దేశంలోకి అడుగుపెట్టేముందు 16-25 డాలర్లు చెల్లించాలని కోరాలి. యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది జాతీయ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది 14 మిలియన్లకు పైగా విదేశీ ప్రజలు జాతీయ ఉద్యాన వనాలను సందర్శిస్తున్నారు’. అని సెనేటర్ తెలిపారు. (అర్థనగ్నంగా పెయింట్, సోషల్ మీడియాలో దుమారం) ‘మన జాతీయ సంపదను పెంచడం కోసం ఈ చట్టం చేయాలని కోరడం న్యాయమే. ఉదాహరణకు భారతదేశంలోని తాజ్ మహల్ వద్ద విదేశీ సందర్శకులు 18 డాలర్లు చెల్లించాలి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులు రోజుకు 25 డాలర్లు చెల్లించాలి. స్థానిక సందర్శకులు మాత్రం కేవలం 6.25 డాలర్లు చెల్లిస్తారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి అనేక యూరోపియన్ దేశాలు పర్యాటక మౌలిక సదుపాయాలకు ఉపయోగించే హోటళ్ల గదులపై పర్యాటక పన్ను వసూలు చేస్తున్నాయి. కావున భవిష్యత్తు తరాల కోసం అమెరికా జాతీయ సంపదను కొనసాగించడానికి ఈ చట్టం అవసరం.’ అని సెనేటర్ మైక్ ఎంజీ పేర్కొన్నారు. -
‘దీపం’ లబ్ధిదారులపై అదనపు భారం
–కిరోసిన్ లీటరుపై రూ.4 వడ్డింపు – జిల్లాలో 2.16 లక్షల దీపం కనెక్షన్లు – లబ్ధిదారులపై నెలసరి రూ.8.64 లక్షల భారం అనంతపురం అర్బన్ : దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులపై ప్రభుత్వం అ‘ధన’పు భారం మొపింది. దీపం కనెక్షన్ కలిగిన వారికి కిరోసిన్ లీటర్ ధరపై రూ.4 అదనంగా వడ్డించింది. ఇప్పటి వరకు లీటరు రూ.15 ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ.19కు పెంచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులపై నెలసరి రూ.8.64 లక్షలు భారం పడనుంది. బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన) కార్డు కలిగినప్రతి ఒక్కరూ దీపం కనెక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. జిల్లాలో బీపీఎల్ కార్డులు (తెల్ల) 11.28 లక్షలు ఉన్నాయి. వీటికి నెలసరి 14.85 లక్షల లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మొత్తం కార్డుల్లో దీపం గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు 2.16 లక్షల మంది ఉన్నారు. కిరోసిన్ రద్దు దిశగా... దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు భవిష్యత్తులో కిరోసిన్ పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. బీపీఎల్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ దీపం కనెక్షన్లు ఇవ్వాలని ఇప్పటికే జిల్లాలకు ప్రభుత్వం లక్ష్యం విధించింది. దీంతో అధికారులు ఏజెన్సీలపై ఒత్తిడి పెంచారు. లబ్ధిదారులను గుర్తించి నవంబరు 15లోగా ప్రతి గ్యాస్ ఏజెన్సీ 2 వేల దీపం కనెక్షన్లు ఇవ్వాలని, 2017 మార్చి నాటికి నిర్ధేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రక్రియ పూరై్తన తరువాత దీపం లబ్ధిదారులకు కిరోసిన్ రద్దు చేయవచ్చునని తెలిసింది. ––––––––––––––––––––––––––––– ఇంకా ఉత్తర్వులు రాలేదు దీపం కనెక్షన్లు కలిగిన లబ్ధిదారులకు లీటర్ కిరోసిన్ రూ.19కి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంకా రాలేదు. – ప్రభాకర్‌రావు, జిల్లా సరఫరాల అధికారి -
అ‘ధన’పు మోతను తగ్గించండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యతను తీసుకున్న ట్రాన్స్‌కో, ఓవర్ హెడ్ చార్జీల(అదనపు చార్జీ) తగ్గింపు విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోంది. విద్యుత్‌ను సరఫరా చేసే సబ్స్టేషన్ల టెండర్ ప్రక్రియ మొదలు, నిర్మాణ బాధ్యతలను పూర్తిగా చూస్తున్నందున ఏకంగా 20 శాతం ఓవర్‌హెడ్ చార్జీల భారాన్ని తమపై మోపడం సరికాదని, దాన్ని పూర్తిగా గాని.. లేకుంటే 10 శాతానికి గాని తగ్గించాలని నీటిపారుదల శాఖ విన్నవిస్తున్నా ట్రాన్స్‌కో ఏటూ తేల్చడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ మరోమారు ట్రాన్స్‌కోకు ఈ విషయమై లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే తేల్చారు. ఈ మేరకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. ప్రాజెక్టు కోసం మేడిగడ్డ వద్ద 3, ఎల్లంపల్లి వద్ద 2, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 3 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఈ స్థాయిలో విద్యుత్ అవసరాలు లేక 133 కేవీ నుంచి 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలను సంబంధిత ప్రాజెక్టుల అథారిటీలే చేపట్టి, నిర్వహణ బాధ్యతలను మాత్రమే ట్రాన్స్‌కోకు అప్పగించాయి. ప్రస్తుతం 400 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం అవసరం ఉండటం, ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టే సామర్థ్యం తమ వద్ద లేకపోవడంతో వాటి బాధ్యతను పూర్తిగా ట్రాన్స్‌కో తీసుకోవాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ట్రాన్స్‌కో, సబ్స్టేషన్ల టెండర్ల ప్రక్రియ, అంచనాల తయారీ, టెండర్ల ఖరారు తదితర సేవలకోసం తమ అధికారులను వినియోగించుకున్నందుకుగానూ మొత్తం పని విలువలో 20 శాతం ఓవర్‌హెడ్ చార్జీల కింద చెల్లించాలని షరతు పెట్టింది. రూ.3 వేల కోట్ల పని విలువకు ఓవర్‌హెడ్ చార్జీల భారమే ఏకంగా రూ.600 కోట్ల వరకు ఉంటోంది. దీంతో ఓవర్‌హెడ్ చార్జీలను తొలగించాలని నీటి పారుదల శాఖ కోరుతోంది. దానికి ట్రాన్స్‌కో అంగీకరించకపోవడంతో కనీసం 10 శాతం చేసుకోవాలని కోరింది. ఈ లెక్కన చూసినా ఓవర్‌హెడ్ చార్జీల మొత్తం రూ.300 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిపై ట్రాన్స్‌కో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట నీటి పారుదల శాఖ ట్రాన్స్‌కో మరో లేఖ రాసింది. -
హోటళ్లలో సరికొత్త బాదుడు
సరదాగా సెలవు రోజుల్లో దుబాయ్ వెళ్లి వద్దామనుకుంటున్నారా? అయితే జేబులు మరికాస్త ఎక్కువగా నింపుకోండి. ఎందుకంటే, అక్కడి హోటల్ బిల్లులపై 4 శాతం అదనపు మునిసిపల్ ఫీజులను విధించనున్నారు. దాంతోపాటు, రాత్రిపూట బసచేస్తే ఇంకా అదనపు వడ్డింపు కూడా ఉంటుంది. ఇవన్నీ జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ విషయమై మునిసిపల్, రవాణా శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని ఆర్థిక రికార్డులలోను పర్యాటక ఫీజును, మునిసిపల్ ఫీజును ప్రత్యేకంగా చూపించాలని హోటళ్లకు తెలిపారు. మునిసిపల్ ఫీజును ఎలా వసూలు చేయాలన్న విషయమై త్వరలోనే వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తారట. అబుదాబి నగరంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఫీజును మునిసిపల్ శాఖ ఉపయోగిస్తుందని, హోటళ్లలో ఉండే అతిథులు, ఇతర కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుందని అంటున్నారు. -
హెచ్ఎంల నెత్తిన బాధ్యతల బండ
పని ఒత్తిడితో సతమతమవుతున్న ప్రధానోపాధ్యాయులు ఒకేసారి ఆరు రకాల పనులతో సతమతం కార్తీక వన మహోత్సవానికి లక్ష పేర్లు నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు స్కూళ్లలో కంప్యూటర్లున్నా నెట్ సదుపాయం లేక ఇక్కట్లు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల నెత్తిన ప్రభుత్వం ఒకేసారి ఆరు రకాల బాధ్యతల బరువు పెట్టింది. ఇప్పటికే రోజువారీ విధుల నిర్వహణతో సతమతమవుతున్న ప్రధానోపాధ్యాయులు ఈ అదనపు బాధ్యతలతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులన్నింటినీ ఆన్లైన్ ద్వారా చేయాల్సి రావడం, పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు. చైల్డ్ ఇన్ఫో ప్రాజెక్టులో భాగంగా విద్యార్థుల వివరాలను ఆధార్‌తో సహా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెల్ నంబర్లు, మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన రోజువారీ నివేదికలను జిల్లా అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపాలి. ఆన్లైన్ కష్టాలు ఈనెల 25న కార్తీక వన మహోత్సవం రోజున జిల్లాలోని పాఠశాలల్లో మొక్కలు నాటాలని నిర్ణయించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు జిల్లావ్యాప్తంగా లక్షమంది విద్యార్థులను ఏపీ గ్రీన్ కార్ప్స్ కింద నమోదు చేయాలని విద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల ఆధార్, సెల్ నంబరు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కాగా, గుంటూరు జిల్లాలోని 145 ఉన్నత పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో హెచ్ఎంలే కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ‘టెన్త్’తో తంటాలు మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల వివరాలను ఈ ఏడాదిలోనే ఆన్లైన్లో పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబరు, సబ్జెక్టు, మీడియం వివరాలతో నామినల్ రోల్స్‌ను పూర్తిగా ఆన్లైన్లో పంపాలని స్పష్టం చేయడంతో హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 30వేల మంది విద్యార్థులు హాజరనుకానుండగా, వీరికి సంబంధించిన వివరాలను హెచ్ఎంలే ఆన్లైన్లో పంపాల్సి ఉంది. ఆర్థిక అవస్థలెన్నో.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, సమీపంలో నెట్ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో హెచ్ఎంలు పట్టణ కేంద్రాలకు వచ్చి ప్రైవేటు నెట్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో పంపేందుకు ఒక్కో హెచ్ఎం వ్యక్తిగతంగా రూ.వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖర్చు చేసిన నిధులు ప్రభుత్వం తిరిగి చెల్లించే అవకాశం లేకపోవడంతో హెచ్ఎంలు ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా నెట్ సదుపాయం లేకపోవడం, ప్రభుత్వం ఏడాదికి ఇంటర్నెట్ బిల్లుల రూపంలో చెల్లించే నిధులు సరిపోకపోవడం, ఒకదానిపై మరొకటి అన్న చందంగా హెచ్ఎంల నెత్తిన కొండంత బాధ్యత బరువు పెరిగింది. సమీక్షా సమావేశాల్లో సమస్యలు ఏకరువు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాల్లో ప్రధానోపాధ్యాయులు తాము పడుతున్న సమస్యలను అధికారుల ఎదుట ఏకరువు పెట్టారు. కార్తీక వన మహోత్సవం, టెన్త్ ఆన్లైన్, చైల్డ్ ఇన్ఫో తదితర అంశాలపై మంగళ, బుధవారాల్లో బాపట్ల, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో డీఈవో శ్రీనివాసులురెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురు హెచ్ఎంలు ప్రభుత్వం తమపై మోపిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ప్రస్తావించారు. -
యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌కు రాజస్థాన్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నాటికి రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో గోవా గవర్నర్ బీ వీ వాంఛూ రాజీనామా చేయడంతో అల్వాకు ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అయితే అల్వా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లికి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ కే రోశయ్యకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రోశయ్యకు అదనపు బాధ్యతులు అప్పగించారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ఐదేళ్ల క్రితం కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ
దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవనం వెనువెంటనే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వీరప్ప మొయిలీ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జయంతి వెల్లడించారు. అయితే పర్యావరణ ప్రాజెక్టు అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగా జయంతిని పదవి నుంచి తొలగించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.