వాషింగ్టన్ : అమెరికాలోని జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయాలని కోరుతూ యూస్ సెనేటర్ ఓ చట్టాని ప్రతిపాదించారు. తాజ్ మహల్ వంటి స్మారక కట్టడాల నుంచి భారత్ ఇలాగే వసూల్ చేస్తోందని ఊటంకిస్తూ అమెరికన్ అవుట్ డోర్ చట్టానికి సవరణగా సెనేటర్ మెక్ ఎంజీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలోని అనేక ప్రముఖ స్మారక చిహ్నాలు, జాతీయ ఉద్యానవనాలను సందర్శించే విదేశీ పౌరుల నుంచి 16-25 డాలర్ల వరకు అదనపు రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలోని ఉద్యానవనాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మైక్ ఎంజి పేర్కొన్నారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పార్కుల నిర్వాహణ ఖర్చులు దాదాపు 12 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును గతేడాదితో పోల్చితే కేవలం 4.1 బిలియన్ డాలర్లు మాత్రేమే ఖర్చు అయ్యింది. అంటే ప్రతి ఏడాది పార్కుల నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటం వల్ల ఈ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. మన దేశానికి వచ్చే విదేశీ సందర్శుకుల తాకిడి పెరుగుతున్నందువల్ల వారిని దేశంలోకి అడుగుపెట్టేముందు 16-25 డాలర్లు చెల్లించాలని కోరాలి. యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది జాతీయ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది 14 మిలియన్లకు పైగా విదేశీ ప్రజలు జాతీయ ఉద్యాన వనాలను సందర్శిస్తున్నారు’. అని సెనేటర్ తెలిపారు. (అర్థనగ్నంగా పెయింట్, సోషల్ మీడియాలో దుమారం)
‘మన జాతీయ సంపదను పెంచడం కోసం ఈ చట్టం చేయాలని కోరడం న్యాయమే. ఉదాహరణకు భారతదేశంలోని తాజ్ మహల్ వద్ద విదేశీ సందర్శకులు 18 డాలర్లు చెల్లించాలి. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులు రోజుకు 25 డాలర్లు చెల్లించాలి. స్థానిక సందర్శకులు మాత్రం కేవలం 6.25 డాలర్లు చెల్లిస్తారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి అనేక యూరోపియన్ దేశాలు పర్యాటక మౌలిక సదుపాయాలకు ఉపయోగించే హోటళ్ల గదులపై పర్యాటక పన్ను వసూలు చేస్తున్నాయి. కావున భవిష్యత్తు తరాల కోసం అమెరికా జాతీయ సంపదను కొనసాగించడానికి ఈ చట్టం అవసరం.’ అని సెనేటర్ మైక్ ఎంజీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment