హోటళ్లలో సరికొత్త బాదుడు
సరదాగా సెలవు రోజుల్లో దుబాయ్ వెళ్లి వద్దామనుకుంటున్నారా? అయితే జేబులు మరికాస్త ఎక్కువగా నింపుకోండి. ఎందుకంటే, అక్కడి హోటల్ బిల్లులపై 4 శాతం అదనపు మునిసిపల్ ఫీజులను విధించనున్నారు. దాంతోపాటు, రాత్రిపూట బసచేస్తే ఇంకా అదనపు వడ్డింపు కూడా ఉంటుంది. ఇవన్నీ జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ విషయమై మునిసిపల్, రవాణా శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అన్ని ఆర్థిక రికార్డులలోను పర్యాటక ఫీజును, మునిసిపల్ ఫీజును ప్రత్యేకంగా చూపించాలని హోటళ్లకు తెలిపారు. మునిసిపల్ ఫీజును ఎలా వసూలు చేయాలన్న విషయమై త్వరలోనే వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తారట. అబుదాబి నగరంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఫీజును మునిసిపల్ శాఖ ఉపయోగిస్తుందని, హోటళ్లలో ఉండే అతిథులు, ఇతర కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుందని అంటున్నారు.