యూపీ గవర్నర్ రామ్ నాయక్కు అదనపు బాధ్యతలు | Ram Naik given additional charge of Rajasthan | Sakshi
Sakshi News home page

యూపీ గవర్నర్ రామ్ నాయక్కు అదనపు బాధ్యతలు

Published Tue, Aug 5 2014 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

Ram Naik given additional charge of Rajasthan

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్కు రాజస్థాన్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నాటికి రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత నెలలో  గోవా గవర్నర్ బీ వీ వాంఛూ రాజీనామా చేయడంతో అల్వాకు ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అయితే అల్వా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లికి గోవా గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement