లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరు మారనుంది. ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. తాజాగా చారిత్రక నగరం సుల్తాన్‌పూర్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనుంది. ఈ మేరకు గవర్నర్ రామ్‌నాయక్ సీఎం యోగీకి లేఖ రాశారు. చారిత్రకంగా ప్రాధాన్యం కలిగిన సుల్తాన్‌పూర్ పేరును.. కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని ఆయన సీఎంకు సూచించారు. పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ మేధావులు, ప్రతినిధులు తనతో భేటీ అయ్యారని తెలిపారు. వారు సమర్పించిన మెమోరాండం, సుల్తాన్‌పూర్ చరిత్రను తెలిపే ఓ పుస్తకాన్ని కూడా యోగికి అందించారు. కుష్‌భావన్‌పూర్‌ను చారిత్రక నగరంగా గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. సుల్తాన్‌పూర్ పేరు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఆ రాష్ట్రం అసెంబ్లీలో ప్రతిపాదన కూడా చేశారు. ఇక మొగల్ చక్రవర్తుల కాలం నుంచి ఉన్న పలు పురాతన నగరాల పేర్లు మార్చుతున్న బీజేపీ తమ హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
(చదవండి : అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!)
Comments
Please login to add a commentAdd a comment