లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా మాజీ కేంద్ర మంత్రి రామ్ నాయక్(80) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధనంజయ వై చంద్రచూద్ రాజ్ భవన్ వద్ద నాయక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందలు తెలియజేశారు. అంతకుముందు ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బీఎల్ జోషి గతనెల్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే జోషి.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీనామా చేయక తప్పలేదు.
యూపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రామ్ నాయక్ కు గత ఎన్డీఏ పాలనలో పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు చేసిన ఘనత ఉంది. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ రామ్ నాయక్ రాజకీయాలకు దూరమైయ్యారు. ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని 2013 లో ప్రకటించారు.