K.Rosaiah
-
‘కొత్త’ వేడుకల కోలాహలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ రోడ్లపైకొచ్చి చిందులేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు రాగానే 2015కు ఘన స్వాగతం పలికారు. చెన్నై మెరీనాబీచ్ తీరం, ఫాంహౌస్‌లు, క్లబ్బులకు పేరుగాంచిన ఈసీఆర్ రోడ్డు జనంతో నిండిపోయూయి. స్టార్ హోటళ్లలో సందడి నెలకొంది. మెరీనాబీచ్ జనసంద్రంగా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కరచాలనం చేసుకున్నారు. కేకులు కట్‌చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకురావడంతో జనాన్ని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. మద్యం మత్తలో జోగుతూ వాహనాలు నడిపేవారికి భారీ జరిమానా విధించారు. ఉట్టిపడిన ఆధ్యాత్మికత: చెన్నైలోని పార్థసారథి ఆలయం, తిరుచ్చీలోని శ్రీరంగనాథుని ఆలయంతో పాటు ఇతర ఆలయూల్లో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పార్థసారథి ఆలయంలో పూజలు చేయించారు. కిటకిటలాడిన శ్రీవారి ఆలయం చెన్నై టీనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడింది. శ్రీవారి భక్తులతో తిరుమలను తలపించింది. కొత్త ఏడాది, వైకుంఠ ఏకాదశి ఒకేసారి రావడంతో ఊహించని రీతిలో భక్తులు స్వామివారి సేవలో తరించారు. సహజంగా 12 గంటలు దాటగానే నిర్వహించే స్వామివారి దర్శనాన్ని తెల్లవారుజాము 4 గంటలకు మార్చినట్లు టీటీడీ స్థానిక సలహామండలి ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయినా భక్తులు బుధవారం రాత్రి 10 గంటల నుంచే క్యూ కట్టారు. ఆలయంలో స్వామివారికి చేపట్టిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. అనంతరం 3.30 గంటలకే సర్వదర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ భక్తుల కోసం పాస్‌లు జారీచేయగా ఆ క్యూసైతం పెరిగిపోయింది. సర్వదర్శనం క్యూ రెండు కిలోమీటర్ల దూరం దాటిపోయింది. భక్తులకు రూ.25 లడ్డూ, ప్రసాదంగా ఉచిత లడ్డూలను, పసుపు, కుంకుమలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం గవర్నర్ కే రోశయ్య దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సలహామండలి అధ్యక్షులు ఆనందకుమార్రెడ్డి, సభ్యులు కృష్ణారావు, మోహన్‌రావు, రవిబాబు, నారాయణగుప్త తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ కే రోశయ్యకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రోశయ్యకు అదనపు బాధ్యతులు అప్పగించారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ఐదేళ్ల క్రితం కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
రుణమాఫీ లెక్క కుదిరింది..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇద్దరు మంత్రులు రాజీపడ్డారు. పర్సంటేజీల లెక్క కుదిరింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే ఈ పంచాయితీ చేశారు. బోగస్ చే‘నేత’ సంఘాలకు రూ. 40.83 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2002 నుంచి 2004 మధ్య ఉరవకొండ, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, గుంతకల్లు, హిందూపురం, సోమందేపల్లి, నార్పల ప్రాంతాల్లోని కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై బోగస్ చేనేత సంఘాలను ఏర్పాటు చేశారు. కనీసం మగ్గంపై అవగాహన లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించి.. ఆర్టీజన్ కార్డులు కూడా ఇప్పించేశారు. జౌళిశాఖ అధికారులతో కుమ్మక్కై 2003-2008 మధ్య దీన్‌దయాళ్ హర్గత్ యోజన(డీడీహెచ్‌వై) కింద కేంద్రం ఇచ్చే రాయితీలను మింగేయడానికి పథక రచన చేశారు. ముడి సరుకులు కొనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించారు. మార్కెట్ ధరకన్నా అధిక ధరకు కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులు సృష్టించి.. రూ. 32.54 కోట్లను డీడీహెచ్‌వై పథకం కింద రాయితీ రూపంలో మింగేశారు. 127 బోగస్ చేనేత సంఘాలు రూ. 32.54 కోట్ల డీడీహెచ్‌వై నిధులను కాజేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విచారణలో బహిర్గతమైంది. ఆ విభాగం ఇచ్చిన నివేదికపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య బోగస్ సంఘాలకు రుణమాఫీ నిధులు విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితుడైన ఆప్కో సభ్యుడు ఒకరు రుణమాఫీ నిధులను విడుదల చేయిస్తానని బోగస్ చే‘నేత’లకు ప్రతిపాదించారు. అందుకు కనీసం రూ. 5 కోట్లను మంత్రికి ముడుపుల రూపంలో ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి.. ఆ మేరకు నిధులు వసూలు చేశారు. ఆ నిధులను మంత్రికి అప్పగించేశారు. ప్రభుత్వ పెద్ద వద్ద తన పలుకుబడిని ఉపయోగించి రుణమాఫీ నిధులు విడుదల చేయించేందుకు సదరు మంత్రి ప్రయత్నించారు. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయాల్సిన దశలో తెలంగాణకు చెందిన కీలక మంత్రికి పర్సంటేజీల వ్యవహారం తెలిసింది. వసూలు చేసిన పర్సంటేజీల్లో తన వాటా ఇస్తేనే రుణమాఫీ ఫైలుకు ఆమోదం లభిస్తుందని సదరు మంత్రి తెగేసి చెప్పారు. దాంతో పంచాయితీ ప్రభుత్వ పెద్దకు వెళ్లింది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ పెద్ద ఇద్దరు మంత్రుల మధ్య రాజీ చేసినట్లు సమాచారం. బోగస్ చే‘నేత’ల నుంచి వసూలు చేసిన కూ. 5 కోట్ల పర్సంటేజీల్లో చెరి సగం పంచుకనేలా ఇద్దరు మంత్రుల మధ్య ప్రభుత్వ పెద్ద రాజీ చేసినట్లు జౌళి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు సరి కొత్త ప్రతిపాదనలు పంపాలని జౌళి శాఖ అధికారులను సదరు మంత్రి ఆదేశించడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు సరికొత్త ప్రతిపాదనలు తయారుచేసిన జౌళి శాఖ అధికారులు ఆ ఫైలును సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ ఫైలుపై రెండు రోజుల్లోగా తెలంగాణ మంత్రి సంతకం చేయడం ఖాయమని.. ఆ వెంటనే రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తధ్యమనే అభిప్రాయం ఆ శాఖ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
మరో మంత్రిపై జయలలిత వేటు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన కేబినేట్ లోని ఓ మంత్రిపై వేటు వేసింది. ప్రాథమిక విద్య, క్రీడలశాఖను నిర్వహిస్తున్న వేగైసెల్వన్ ను మంత్రిపదవి నుంచి తప్పిస్తూ జయలలిత నిర్ణయం తీసుకుందని ఆధికార ప్రకటన వెలువడింది. వైగైసెల్వన్ ను బర్తరఫ్ చేయాలంటూ జయలలిత చేసిన సిఫారసును ముఖ్యమంత్రి రోశయ్య ఆమోదించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు వేగైసెల్వన్ శాఖను ఉన్నత విద్యాశాఖ మంత్రి పలనియప్పన్ కు అప్పగించారు.