రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి
Published Tue, Aug 6 2013 4:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాజధానిపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టత ఇవ్వకుం డా ఆంధ్రలో ఓ ప్రకటన చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సోమవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మంత్రుల మాటలకు పొందన లే కుండాపోయిందని, యూపీఏ చైర్ పర్స న్ సోనియా తెలంగాణపై కఠిన నిర్ణయం తీసుకుని డిమాండ్‌చేశారు. పది జిల్లాల తో కూడిన తెలంగాణ,
అలాగే రా జధాని హైదరాబాద్ కావాలని డిమాండ్‌చేశారు. సీమాంధ్రలో ఆందోళనలతో విద్యార్థుల కు నష్టం జరుగుతుందన్నారు. వెంటనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించి వి ద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అధిష్టానం అనుమతితోనే సీ మాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్‌లను వెంటనే డిస్మిస్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే నవభార యువభేరి సభకు లక్షలాది మంది యువకులు హాజరవుతున్నారని తెలిపారు.
నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయం
దేశంలో నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, కచ్చితంగా ఆయన ప్రధానమంత్రి కావడం ఖాయమని బీ జేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తత్రేయ అన్నారు. యువత దేశంలో మార్పుకావాలని ఆకాంక్షిస్తున్నారని, అం దుకు నరేంద్రమోడీని సమర్థవంతుడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం స్థానిక విజన్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామగ్రామానా బీజేపీ ని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రంపై బీజేపీ ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. దేశంలో రానున్న రోజు ల్లో ఎన్‌డీఏ కూటమి ఏర్పాటు అవుతుం దని సర్వేలు తేల్చిచెప్పడంతోనే భయపడి తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, సౌకర్యాలు సమకూరుతాయని చెప్పారు.
నూతన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి విజ యపరంపర దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ రాకతో రాష్ట్రంలో ఉత్సహంగా నెలకొందన్నారు. పాకిస్తాన్, చైనా ఉగ్రవాదులు దే శంలోకి చొరబడి, భూ ఆక్రమణకు పాల్పడుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
అనంతరం బం డారు దత్తాత్రేయ, ప్రేమేందర్‌రెడ్డిలను పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో నూతనంగా ఎంపికైన బీజేపీ సర్పంచ్‌లను కూడా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.రతంగపాండురెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రాములు, నింగిరెడ్డి, బీజేపీ నాయకులు కొండయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement