రాజులు, సంస్థానాదీశులు, నిజాం నవాబుల కాలం నాటి ఆలయాలు, బురుజులు..వాటిలో అద్భుతంగా చెక్కిన శిల్పాలు పాలమూరు పర్యాటక కేంద్రాల సొంతం. జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం అందించే బృహత్తర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించినా..ఎవరు ముందుకురాకపోవడంతో పర్యాటకం కళ తప్పింది. విడుదల చేసిన నిధులు బ్యాంకులోనే మూలుగుతున్నాయి.
కలెక్టరేట్/గద్వాల, న్యూస్‌లైన్: జిల్లాలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదం అందించే ప్రక్రియ ఏడాదిగా ముందుకుసాగడం లేదు. 11 పర్యాటక కేంద్రాల్లో పనులు చేపట్టేందుకు ఇంతకుముందే టెండర్లు ఆహ్వానించారు. ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా మరోసారి మంగళవారం టెండర్లదాఖలుకు తుది గడువు విధించగా ముగ్గురు మాత్రమే ముందుకొచ్చారు.
ఎనిమిది కేంద్రాలకు టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకురాలేదు. జిల్లావ్యాప్తంగా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నా..ముందుగా 11 కేంద్రాలను మాత్రమే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో 9పురాతన ఆలయాలు కాగా, రెండు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. కానీ టెండర్లు పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.7.99కోట్లు మంజూరుచేసింది. ఏడాదిలోపే వీటిని వినియోగించాలని నిబంధనలు విధించినా, అధికారులు వాటిని వినియోగించుకోలేకపోయారు. ఇప్పటికీ వాటిని ఖాతాకే పరిమితం చేశారు.
‘పర్యాటకం’..పరిహాసం!
Published Wed, Aug 7 2013 4:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement