విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేతనం
Published Tue, Aug 6 2013 4:50 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
పాలమూర్ సేవా నిధికి ఉద్యోగుల ఒకరోజు బేసిక్ వేతనాన్ని ఈనెల వేతనంలో తీసుకోవాల ని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ జిల్లా కోశాధికారి కార్యాలయ ఉపసంచాలకులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన పాలమూర్ సేవానిధి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గతంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఆ యా శాఖల జిల్లా అధికారుల సమ్మతి మేరకు పాలమూర్ సేవానిధికి ఉద్యోగుల ఒక రోజు బేసిక్ వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు హామీ ఇచ్చారని గు ర్తు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సంద ర్భంగా దీనిని వెంటనే అమ లు చేయలేకపోయామన్నారు.
ఈ నెల బేసిక్ వేతనాన్ని చెల్లిస్తేనే జీతాల బిల్లు లు పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ఆ యా శాఖల అధికారులు వారి కింద ప నిచేసే ఉద్యోగులతో పాలమూర్ సేవానిధికి ఒక రోజు బేసిక్ వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సమ్మతి పత్రాన్ని పొం దాకే, వారి జీతం బిల్లులో సదరు మొ త్తాన్ని మినహాయించాలని, ఆ తర్వాత బిల్లుల ను డీటీఓకు పంపాలన్నారు. ఈ విషయాంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుం డా సహకరించాలని ఆయన కోరారు.
సేవానిధికి ఇచ్చిన హామీల ప్రకారం నిధులొస్తే చేపట్టాల్సిన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించనున్నట్లు వెల్లడిం చారు. అలాగే ఈనెల 7న జిల్లా కేంద్రం లో వికలాంగులకు పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒ క్కరూ పాల్గొని విజయవంతం చేయాల న్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement