కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు కలుషిత ఆహారమే పరమాన్నమైంది. కడుపు మాడ్చుకోలేక.. ఆకలిబాధను ఎవరికీ చెప్పుకోలేక కుళ్లిన భోజనం తిని బుధవారం 18 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం.. వసతిగృహ పర్యవేక్షకుల కక్కుర్తి వెరసి విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారింది. వివరాల్లోకెళ్తే..స్థాని క కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నా రు.
ఎప్పటిలాగే మంగళవారం రాత్రి హాస్టల్‌లో అన్నం, పప్పు, చెట్నీ వడ్డించారు. భో జనాలు ముగించుకుని నిద్రకుపూనుకున్న విద్యార్థినులు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకరి తరువాత మరొకరు.. ఇలా 18 వాం తులు, విరేచనాలు చేసుకున్నారు. రాత్రి అందుబాటులో ఎవరూ లేకపోవడంతో త మ బాధను ఎవరికీ చెప్పుకోలేపోయారు. రాత్రంతా అలాగే గడిపిన విద్యార్థినులు ఉ దయం హాస్టల్‌కు వార్డెన్ రాగానే విషయం చెప్పగా..హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కవిత, రోజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరి గిందని తెలిపారు. అస్వస్థతకు గురైన వి ద్యార్థులకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుం డా సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ చె ప్పారు. జరిగిన ఘటనపై వార్డెన్ శ్రీలతను వివరణ కోరగా..విద్యార్థినులకు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు.
సందర్శించిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆస్పత్రి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన లు తలెత్తకుండా చూడాలని వార్డెన్ శ్రీలత ను ఆదేశించారు.
‘కస్తూర్బా’లో కలుషిత ఆహారం
Published Thu, Aug 8 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement