గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎ స్‌ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ స భ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
కేం ద్రం నిర్ణయం తీసుకునే ముందు ఇరుప్రాం తాల ప్రజల అభిప్రాయాలను తీసుకుని, ఎ వరికీ అన్యాయం జరగకుండా చూడాల్సి ఉండేదన్నారు. బుధవారం గద్వాలలో బృం దావనం గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో జరి గిన స ర్పంచ్‌లు, సింగిల్‌విండో డెరైక్టర్ల సన్మానసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ పై పార్టీ ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉందన్నారు. సంప్రదింపుల పేరిట అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచిన కేంద్రం, నిర్ణయం వెలువరించే ముందు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
వై ఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తెలంగాణకు వ్యతిరేకం గా రాజీనామాలు చేసినట్లు వ్యతిరేక మీడియా చే స్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. తమ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఇడుపులపాయలో మరోసారి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేయడం ద్వారా ఇప్పటికైనా బురదజల్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రతోవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా పార్టీ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్నారు. రాజన్న పాలనను ప్రజలు మళ్లీ చూస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీ నుంచి కొండా సురేఖ బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ నుంచి తెలంగాణ వారంతా వెళ్లినట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకులకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలోనూ వైఎస్‌ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్నం నాగిరెడ్డి మాట్లాడుతూ..మహానేత వైఎస్‌ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్‌ను రాబోయే ఎన్నికల్లో సీఎంగా చూడాల్సి వస్తుందన్న భయంతోనే కుట్రపన్ని అక్రమ కేసులతో జైలుకు పంపారని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీలు
కనుమరుగుకావడం ఖాయం: ఎడ్మ
జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గుర్తుల్లేని ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ వారిగా చెప్పుకోవచ్చన్న ఆలోచనతో సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించిందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలమేందో తెలుస్తుందన్నారు. ఇక ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయమన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ, సీమాంధ్రలో వైఎస్‌ఆర్ సీపీ హవా కొనసాగుతుందన్నారు. పార్టీ గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..గద్వాల ప్రాంతంలో దౌర్జన్యపాలన కొనసాగుతుందని, ప్రజలు దౌర్జన్యానికి భయపడి తమకే ఓటు వేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టిన వారి భ్రమలు ఇక సాగవని హెచ్చరించారు. పల్లెల్లో తాగడానికి నీళ్లు దొరకడం లేదని, కానీ భరతసింహారెడ్డి మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కొండాపురం షఫిఉల్లా, చిన్నయ్య, కృష్ణారెడ్డి, మజీద్, గోవింద్, గంట రమేష్, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదు
Published Thu, Aug 8 2013 3:25 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement