Telangana party
-
అధికారంలోకి వస్తే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు పట్టాలు అందిస్తానని ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదివాసీ వర్గీకరణకు తమ పార్టీ కృషి చేస్తుందని హామీనిచ్చారు. సోమవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల మాట్లాడారు. జల్, జంగల్, జమీన్ కోసం గోండు నాయక్, కొమురం భీం మొదలుకొని నేటి దాకా ఆదివాసీలు పోరాడుతూనే ఉన్నారని, పదేళ్లుగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలపై కేసులు పెట్టి జైలులో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 అటవీచట్టం ఎంతో అద్భుతమని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ చట్టాన్ని మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం గత ఏడేళ్లుగా గిరిజనులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయంలో 3.30 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ బాధితులకు ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. తెలంగాణలో కనీసం 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన వాటికి కూడా విలువలేదని, వాటికి కూడా హక్కులు కల్పించలేమని, పట్టాలు ఉన్నా కూడా రైతుబంధు, రైతు బీమా ఇవ్వలేమని చెప్పడాన్ని షర్మిల ఆక్షేపించారు. ‘మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెబుతున్నాను, వైఎస్ఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్లుగానే తాము కూడా ఆదివాసీ గిరిజనులను గౌరవించి వారికి పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ వర్గీకరణకు కృషి చేస్తాన్నారు. -
సునీల్ నాయక్ కుటుంబానికి అండగా షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్‌కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అండగా నిలిచారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుమళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాలో సునీల్ నాయక్ తమ్ముడు బోడ శ్రీనివాస్ నాయక్‌కు ఉద్యోగం కల్పిస్తూ షర్మిల నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన్లను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని, యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్టీపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన 250 మందికి నియామక పత్రాలు అందజేశారు. మరో 700 మందికి వివిధ దశల్లో ఇంట ర్వూ్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన దార్శనికుడు వైఎస్ఆర్ అని పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ కొనియాడారు. -
టార్గెట్ ‘గ్రేటర్’
- ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నిరసన గళం - త్వరలో గ్రేటర్ పార్టీకి కొత్త నాయకత్వం - జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యరంగంలోకి దిగింది. తెలంగాణ పార్టీ ముఖ్య నేతలే ఆయా నియోకవర్గాల సమన్వయకర్తల బాధ్యతలను తీసుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపే కసరత్తును ప్రారంభించారు. ఆదివారం ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాలకు ఓ మోస్తరుగానే కార్యకర్తలు హాజరయ్యారు. మిగిలిన నియోజకవర్గాల్లో సోమ, మంగళ వారాల్లో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే గత సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న నగరం తదనంతర పరిణామాలతో పూర్తిగా డీలా పడిపోయింది. ఈ ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేసే దిశగా పీసీసీ, సీఎల్పీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే ఆరుణ, గీతారెడ్డి, సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆదివారం నగరంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కుత్బుల్లాపూర్, సనత్‌నగర్‌లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తల హాజరు పలుచగానే కనిపించింది. ఉప్పల్‌లో ఎంపీ సర్వే వర్గీయులు గైర్హాజరయ్యారు. త్వరలో గ్రేటర్ కమిటీకి కొత్త రూపు ఇటీవలి ఎన్నికల్లో నగరంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త రూపు ఇచ్చే కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది వైఫల్యాలను నిలదీసే నిమిత్తం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల అనంతరం, డివిజన్ వారిగా ఆందోళనలు నిర్వహించే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. రెండవ దశ కార్యక్రమాల అనంతరం పార్టీలో అన్ని వర్గాల నాయకులతో సంప్రదించి గ్రేటర్ కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకున్ని నియమించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ కమిటీ బాధ్యతలు చూస్తున్న నాయకులకు పీసీసీలో స్థానం కల్పించి కొత్తవారికి నగర బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
‘చెమట సుక్క’ సిన్నబోయింది!
- ప్లీనరీలో నల్లపూసైన హరీశ్‌రావు - వేదిక పై రెండో వరుస చివరలో కూర్చున్న మంత్రి - ‘వైఫై మాయ’ అంటున్న మెతుకుసీమ కార్యకర్తలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సెంటు వాసన’ పరిమళంతో చెమట చుక్క చిన్నబోయింది. ఒక్కో కార్యకర్తను పోగేసి, గుంపు కట్టిన యువ‘జన నాయకుడు’ తెలంగాణ పార్టీ తొలి ప్లీనరీలో వెనుక బెంచీకే పరిమితం కావడం మెతుకు సీమలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతా తానై పార్టీ ప్లీనరీని నడిపించాల్సిన నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అంటీముట్టనట్టు ఉండటం పై పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కావడంతో ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిస్థాయి ప్రసారాలు చేసింది. ఎక్కడ కూడా హరీశ్‌రావు హల్చల్ లేకపోవడం పై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్లీనరీ సజావుగా సాగటం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏడు కమిటీలు వేసింది. ఏ ఒక్క కమిటీలోనూ హరీశ్‌రావుకు స్థానం కల్పించలేదు. అప్పటినుంచే పార్టీ కేడర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. కేసీఆర్ పార్టీ అధ్యక్షునిగా ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కేసీఆర్‌కు అభినందనలు చెప్పడానికి ఎగబడ్డారు. కొందరు నేతలు కరచాలనం చేయగా... ఇంకొందరు నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. కానీ హరీశ్‌రావు మాత్రం ముబావంగా ఉండిపోయారు. ప్లీనరీ సమయంలో వీఐపీ గ్యాలరీలో కొద్దిసేపు కూర్చున్న తరువాత వేదిక మీదకు వెళ్లారు. అక్కడ ముందు వరుసలో కాకుండా రెండో వరుస చివరన కూర్చున్నారు. ‘హరీశ్‌రావు ఏడి..?, ఎక్కడ ఉన్నడు?’ అని అన్ని గ్యాలరీల్లోని పార్టీ కార్యకర్తలు ఆయన్ను వెతకడం కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం సెషన్లో హరీశ్‌రావు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.. ‘ఇందంతా వైఫై... హైఫై మాయాసార్.. సెంటు రుద్దుకొని స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టుకునేటోళ్లకు, జనం మధ్య నిలబడిన నేత ‘చెమట వాసన’ ఎట్టా గిట్టుంది సార్’ అంటూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. పార్టీలో అందరికీ ప్రాముఖ్యత కల్పించాలనే ఆలోచనతోనే హరీశ్‌రావు కొద్దిగా వెనక్కి తగ్గారని, ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది లేదని హరీష్‌రావు సన్నిహితులు చెబుతున్నారు. -
సిట్టింగ్‌లకే సీట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హస్తినలో హడావుడి అనంతరం... కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఊహించిన విధంగానే జిల్లాలోని వుూడు లోక్‌సభ సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకే చోటు కల్పించింది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రత్యర్థి బి.వినోద్కువూర్పై విజయుం సాధించిన పొన్నం తెలంగాణ ఉద్యవు ఊపులో ఢిల్లీ స్థారుులో అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త రాష్ట్రం ఆవిర్భావ సవుయుంలో వరుసగా రెండోసారి పాత ప్రత్యర్థితోనే తలపడుతున్నారు. వరుసగా రెండోసారి పెద్దపల్లి(ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేక్‌కు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. తెలంగాణపై పార్టీ వైఖరిని నిందించి నిరుడు టీఆర్ఎస్లో చేసిన వివేక్ వారం రోజుల కిందటే సొంత గూటికి చేరుకున్నారు. పాత సీటు నుంచే రెండోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. వుధుయూష్కీ వురోసారి నిజావూబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధవువుతున్నారు. -
తెలంగాణలో పార్టీ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో తెలంగాణలో పార్టీ పుంజుకుందా?, ప్రజల్లో స్పందన ఎలా ఉంది?, అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా?.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ప్రయత్నించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. సుమారు గంటకు పైగా గాంధీభవన్‌లో గడిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, సురేష్‌షెట్కార్, పొన్నం ప్రభాకర్, వీహెచ్, ఎంఏ ఖాన్, మాజీమంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫరీదుద్దీన్తోపాటు పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆజాద్‌ను కలిశారు. జానారెడ్డి, డీఎస్, తర్వాత డిప్యూటీ సీఎం ఆజాద్‌తో ముఖాముఖి సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. వీరు వేర్వేరుగా ఆజాద్‌తో మాట్లాడే సమయంలో బొత్స కూడా బయటే ఉన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆరా తీసిన ఆజాద్‌తో ఆ ప్రాంత నేతలు.. గతంలో తాము తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉండేదని, విభజనపై నిర్ణయం తీసుకున్న తరువాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం తమకు ఏర్పడిందన్నారు. ఎంపీ సీట్ల విషయానికొస్తే అంజన్‌కుమార్ 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా... షెట్కార్ మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. అంతకుముందు డీఎల్ రవీంద్రారెడ్డి సైతం ఆజాద్‌ని కలిసివెళ్లారు. పార్టీ పరిస్థితి, సీఎం కిరణ్ వల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై డీఎల్ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మస్తాన్‌వలీ కూడా ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు హైకమాండ్ దగ్గర గట్టి వ్యూహం ఉందని వారితో ఆజాద్ చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా ఆజాద్‌తో విడిగా సమావేశమయ్యారు. విభజన విషయంలో అసెంబ్లీలో ఏయే పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్న వివరాలను ఆజాద్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర పగ్గాలు మళ్లీ ఆజాద్‌కే? కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలను మళ్లీ కేంద్రమంత్రి ఆజాద్‌కే అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు విషయంలో ఆజాద్ క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదా పొత్తు కుదుర్చుకునే అంశాల్లో ఆజాద్ చొరవ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. -
బాబూ.. బైబై
సాక్షి, కరీంనగర్ : తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధోరణితో తెలుగు తమ్ముళ్లు సొంతదారులు వెతుక్కుంటున్నారు. రెండు రోజులుగా పార్టీలో సాగుతున్న పరిణామాలను చూసి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ ముఖ్యనేతలు సైతం గందరగోళానికి గురవుతున్నారు. తాము లేఖ ఇవ్వడం వల్లే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఇదివరకు చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్పుడు అటు లోకసభలో, ఇటు శాసనసభలో సమైక్యవాదాన్ని వినిపిస్తున్న నేతలను నిలువరించలేకపోతున్నారు. ప్రతిరోజు స్వయంగా చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన రాజ్యంగ విరుద్ధంగా జరుగుతోందంటూ ప్రకటనలు చేస్తున్నారు. అధినేత వ్యవహార శైలితో తెలంగాణలో పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారిందని, అనేక కష్టాలు పడుతూ కేడర్‌ను కాపాడుకుంటూ వస్తుంటే ఈ ధోరణి మరింత దెబ్బ తీస్తోందని వారు వాపోతున్నారు. చంద్రబాబు తాజా వైఖరి సీనియర్ నేతలను సైతం ఆలోచనలో పడేసింది. ఒకరిద్దరు ముఖ్య నాయకులు మినహా మిగిలిన నాయకులు రాజకీయంగా సురక్షితమయిన దారులు వెతుక్కునే పనిలోపడ్డారు. జిల్లావ్యాప్తంగా చాలా మంది నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వీరవిధేయులు, ప్రత్యామ్నాయం లేని కొద్దిమంది నాయకులే జిల్లా పార్టీలో మిగులుతారని, వారు 2014 ఎన్నికలపై ఆశలు వదిలేసుకునే పార్టీలో కొనసాగాలని భావిస్తున్నారని అంటున్నారు. నాలుగేళ్ల నుంచి అదే తీరు.. 2009 తరువాత వివిధ సందర్భాల్లో టీడీపీ అధినేత తీరు వల్ల ఆ పార్టీ తెలంగాణవాదుల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. వేములవాడ, కరీంనగర్ ఎమ్మెల్యేలు సిహెచ్.రమేశ్‌బాబు, గంగుల కమలాకర్ టీడీపీని వదిలి టీఆర్ఎస్లోకి వెళ్లారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పడం ద్వారా సహకార, పంచాయతీ ఎన్నికల్లో పరువు దక్కించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు తిరిగి తీరు అనుమానాస్పదంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ఆమరణదీక్షలో వినిపించిన వాదనలు పార్టీపై అపనమ్మకాన్ని మరింత పెంచాయి. అప్పటినుంచే పలువురు జిల్లా నాయకులు వలసల గురించి ఆలోచిస్తున్నారు. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎ స్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ స భ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేం ద్రం నిర్ణయం తీసుకునే ముందు ఇరుప్రాం తాల ప్రజల అభిప్రాయాలను తీసుకుని, ఎ వరికీ అన్యాయం జరగకుండా చూడాల్సి ఉండేదన్నారు. బుధవారం గద్వాలలో బృం దావనం గార్డెన్ ఫంక్షన్హాల్లో జరి గిన స ర్పంచ్‌లు, సింగిల్‌విండో డెరైక్టర్ల సన్మానసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ పై పార్టీ ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉందన్నారు. సంప్రదింపుల పేరిట అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచిన కేంద్రం, నిర్ణయం వెలువరించే ముందు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. వై ఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తెలంగాణకు వ్యతిరేకం గా రాజీనామాలు చేసినట్లు వ్యతిరేక మీడియా చే స్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. తమ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఇడుపులపాయలో మరోసారి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేయడం ద్వారా ఇప్పటికైనా బురదజల్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రతోవైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా పార్టీ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్నారు. రాజన్న పాలనను ప్రజలు మళ్లీ చూస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీ నుంచి కొండా సురేఖ బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ నుంచి తెలంగాణ వారంతా వెళ్లినట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకులకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలోనూ వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్నం నాగిరెడ్డి మాట్లాడుతూ..మహానేత వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్‌ను రాబోయే ఎన్నికల్లో సీఎంగా చూడాల్సి వస్తుందన్న భయంతోనే కుట్రపన్ని అక్రమ కేసులతో జైలుకు పంపారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయం: ఎడ్మ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గుర్తుల్లేని ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ వారిగా చెప్పుకోవచ్చన్న ఆలోచనతో సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించిందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలమేందో తెలుస్తుందన్నారు. ఇక ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ, సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ హవా కొనసాగుతుందన్నారు. పార్టీ గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..గద్వాల ప్రాంతంలో దౌర్జన్యపాలన కొనసాగుతుందని, ప్రజలు దౌర్జన్యానికి భయపడి తమకే ఓటు వేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టిన వారి భ్రమలు ఇక సాగవని హెచ్చరించారు. పల్లెల్లో తాగడానికి నీళ్లు దొరకడం లేదని, కానీ భరతసింహారెడ్డి మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కొండాపురం షఫిఉల్లా, చిన్నయ్య, కృష్ణారెడ్డి, మజీద్, గోవింద్, గంట రమేష్, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.