సాక్షి,హైదరాబాద్ : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం.. ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ హజరయ్యారు. ప్రస్తుతం కోర్టు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తుంది. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి,బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు.
కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్
- అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నాను
- చదువు పూర్తి అయ్యాక ఇండియా కు తిరిగి వచ్చాను
- భారత్‌కు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది
- 2006 ఆగస్ట్ కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు
- మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి
- 2006 నుంచి 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశాను
- తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను
- 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలో గెలిచాను
- ఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచా
- ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను
- 2014లో నేను మంత్రి గా పనిచేశాను
- 2023 వరకు నేను మంత్రిగా ఉన్నాను
- మంత్రిగా ఉన్న కొండాసురేఖ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసింది
- నాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడింది
- ఆమె చేసిన వాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది
- ఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయి
- నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు
- ఫోన్ ట్యాపింగ్ చేసానని వాఖ్యలు చేశారు
- ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం
- బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారు
- నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు ఆరెంజ్ చేస్తా అని కొండా సురేఖ వాఖ్యానించారు
- సాక్షులు నాకు 18 సంవత్సరాలుగా తెలుసు
- సాక్షులు కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసి వారు నాకు ఫోన్ చేశారు
- కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నది
- కొండ సురేఖ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వాఖ్యలు చేసి నాతో పాటు బీఆర్‌ఎస్ పార్టీని డ్యామేజ్ చేశారు
- రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారు
- తనపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారు
- అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించాను
- యూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చాను
- చట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు అని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కాపీలోని వివరాల్నే ప్రామాణికంగా తీసుకోవాలా ? స్టేట్మెంట్ ఇస్తారా ? మరోసారి కోర్టు వివరణ అడిగింది. అందుకు స్పందించిన కేటీఆర్.. కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్తాను అని అన్నారు. అందుకు కోర్టు అనుమతించగా.. కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కేటీఆర్ చదివి వినిపించారు.
- నాగ చైతన్య విడాకులకు నేను కారణం అని ఆమె అన్నారు
- ఎన్‌కన్వెన్షన్ విషయంలో సమంత, నా గురించి లేని పోని విధంగా మాట్లాడారు
- నేను ఫోన్లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారు
- నేను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించనని ఆమే వ్యాఖ్యానించారు
- నా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయనీ ఆమె అన్నారు.
- అనంతరం కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సరిపోతుందని కోర్టు తెలిపింది. తర్వాత కేటీఆర్ తరుఫు సాక్షుల స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేయడం ప్రారంభించింది
కొండా సురేఖ వ్యాఖ‍్యలపై కేటీఆర్ మనస్తాపం
ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపం చెందానని,కొండా సురేఖపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.
కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు.
గత విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, అందుకు కేటీఆర్ కొంతసమయం అడిగారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment