పిఠాపురం మండలం జములపల్లి శివారు వీరరాఘవపురం పంట కాలువలో ఇటీవల దొరికిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. తనను చంపేస్తాడన్న భయంతో ముందస్తుగానే ఒక వ్యక్తి మరొకరిని హత్య చేసినట్టు సీఐ అప్పారావు తెలిపారు. గురువారం
-
హత్య కేసును ఛేదించిన పిఠాపురం పోలీసులు
-
నిందితుల అరెస్టు
పిఠాపురం :
పిఠాపురం మండలం జములపల్లి శివారు వీరరాఘవపురం పంట కాలువలో ఇటీవల దొరికిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. తనను చంపేస్తాడన్న భయంతో ముందస్తుగానే ఒక వ్యక్తి మరొకరిని హత్య చేసినట్టు సీఐ అప్పారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు హాజరుపర్చి వివరాలు వెల్లడించారు. పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన చక్రవర్తుల నాగేశ్వరుడు (నాగేశ్వరరావు) ఆటో డ్రైవర్. తన భార్యతో అదే గ్రామానికి చెందిన కూరాకులు వీరబాబు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో తొమ్మిది నెలల క్రితం అతనితో గొడవ పడి చంపేస్తానని బెదిరించి ఆమెను కూడా కొట్టాడు. దీనిపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదై నాగేశ్వరుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. గ్రామ పెద్దల సలహా మేరకు వారు లోక్‌అదాలత్‌లో రాజీ పడ్డారు. అనంతరం గ్రామ పెద్దల సూచన మేరకు నాగేశ్వరుడు తన భార్యతో కలిసి పిఠాపురం మండలం నవఖండ్రవాడకు కాపురం మార్చాడు. కాగా సంక్రాంతి సందర్భంగా గత నెల 13న రాయవరం వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు తనపై దాడి చేస్తాడని వీరబాబు భయపడ్డాడు. ఇటీవల రాయవరం రోడ్డులో మోటారు సైకిల్‌పై వెళుతున్న వీరబాబును నాగేశ్వరరావు తన ఆటోతో ఢీకొట్టగా గాయాలపాలై తనకు అతని వల్ల ప్రాణ భయముందని తన బంధువులకు చెప్పాడు. ఈ మేరకు ఆ రోజు రాత్రి తన బంధువులతో సమావేశమై నాగేశ్వరరావును మట్టుబెట్టేందుకు పథకం వేశారు. తునికి చెందిన లగిశెట్టి నరసింహారావు అలియాస్ జామ్‌ను నాగేశ్వరరావుపై నిఘా పెట్టాడు. గత నెల 16 వతేదీ రాత్రి పిఠాపురం నుంచి వెళ్తున్న నాగేశ్వరరావు పిఠాపురం మండలం జములపల్లి శివారు వీరరాఘవపురం పంట కాలువ దగ్గరకు వచ్చే సరికి అతనినే అనుసరిస్తున్న జామ్ తన బంధువులైన కూరాకుల వీరబాబు, కూరాకుల గంగాధర్, కూరాకుల అప్పారావు, పేకేటి వనగంగ, కూరాకుల అచ్చారావు, కూరాకుల కృష్ణ, కూరాకుల వెంకన్న, వేశలంక చిన్నయ్యలకు ఆ సమాచారం చేరవేశాడు. అక్కడకు దగ్గరలోనే ఉన్న వారంతా జామ్ సహాయంతో మెడకు ఉరి వేసి చంíపి పంట కాలువలో పడేశారు. తన భర్త కనిపించడం లేదని భార్య కృష్ణఅర్జవేణి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులకు 23వ తేదీన పంట కాలువలో మృతదేహం సమాచారం అందింది. పిఠాపురం రూరల్ పోలీసులు విచారణ జరిపి మృతదేహం నాగేశ్వరరావుదిగా నిర్థారించారు. ఈ మేరకు వీరబాబును, మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం పట్టణ, రూరల్, ఎస్సైలు వి.కోటేశ్వరరావు, సుభాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.