కాంగ్రెస్ను వీడేది లేదు: కె.ఆర్.సురేశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడేది లేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనేలేదని, టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 15 ఏళ్లు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశానని చెప్పారు.
తెలంగాణ చర్చల సందర్భంగా ఒకసారి ఢిల్లీలో కేసీఆర్‌తో మాట్లాడానే తప్ప, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయనను కలవలేదన్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వారందరితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించారని ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో గంటకు పైగా చర్చించారని, మిగతా వారితో ఫోన్‌లో సంప్రదించారని పేర్కొన్నారు.