Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి.
(చదవండి: Multibagger Stock: రూ.10 వేల పెట్టుబడితో ఏడాదిలో రూ.లక్ష లాభం!)
ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు.అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ప్రతి నెల పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment