PMVVY
-
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్‌ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
PMVVY: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్లు ప్రతి నెల రూ.10వేల పెన్షన్!
Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. (చదవండి: Multibagger Stock: రూ.10 వేల పెట్టుబడితో ఏడాదిలో రూ.లక్ష లాభం!) ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు.అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ప్రతి నెల పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. (చదవండి: Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!) -
ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే..
వయస్సులో ఊన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా భూమి మీద ఇన్వెస్ట్ చేయడం లేదా ఇతరులకు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాం. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ తట్టుకునే శక్తి అప్పుడు ఉంటుంది. కానీ, 60 ఏళ్లు దాటాక అంతా రిస్క్ తీసుకోలేరు కాబట్టి తమ దగ్గర ఉన్న నగదును ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎమ్‌వీవీవై) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల కొత్త మొత్తం నగదును పెన్షన్ రూపంలో పొందవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్దుల కోసమే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వయో వృద్దులకు ఆర్దిక భరోసా దీనిలో చేరాలంటే 60 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా వయో వృదూలకు ఆర్దిక భరోసా లభిస్తుంది. 10ఏళ్ల పాటు ఫింఛనుకు హామీ ఉంటుంది. పీఎమ్‌వీవీవైను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండేది కానీ ప్రస్తుతం కేంద్రం గడువును మార్చి 2023 వరకు పొడగించింది. ఇందులో చేరాలనుకునే వారు ఆన్లైన్లో ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా గానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు. పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు ఖచ్చితమైన పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం డెత్‌బెనిఫిట్‌ని కూడా అందిస్తుంది. పాలసీ కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి వుంటే… ఎంత ప్రీమియంకైతే కొన్నామో అంతే మొత్తం పది ఏళ్ల తర్వాత తిరిగి మొత్తం చెల్లిస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను కూడా పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. పీఎమ్‌వీవీవై ప్రీమియం ఒక్కసారే ప్రీమియం చెల్లించి దీనిలో చేరాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా కనీసం రూ.1.5 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షలు నగదు చెల్లించి పాలసీ కొనుగోలు చేయవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన రూ.1.5లక్షల నుంచి రూ. 15లక్షల నగదుపై ప్రతి నెల నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10వేల దాకా వడ్డీని అందిస్తారు. ప్రస్తుతం వడ్డీ 7.4శాతంగా నిర్ణయించారు. నెల నెలా వద్దనుకుంటే మూడు మాసాలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్(ఈసీఎస్) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛను జమ అవుతుంది. చదవండి: ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్ -
ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా?
దేశ వ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో సరికొత్త పెన్షన్ పథకం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకంలో చేరడానికి గడువు తేదీని 2023 మార్చి 31 వరకు పొడగించింది. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై వార్షిక ఆదాయం 7.66 శాతం వరకు పొందవచ్చు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు. అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు వారికీ ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనకకు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు! -
ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం గడువును ఇటీవల పొడిగించింది. 2021 మార్చి 31తో ముగిసిన గడువును మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌లో కొత్తగా చేరాలనుకునేవారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. 60ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం పెన్షన్ ద్వారా అసరా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధాన మంత్రి వయ వందన యోజన పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇందులో చేరిన వారికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం వడ్డీని నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ వివరాలను చేస్తోంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ద్వారా ఈ స్కీమ్ కు దరఖాస్తు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. దీని ద్వారా పెన్షన్ పొందాలనుకునే వారు రూ.1,56,658 నుంచి రూ.15,66,580 లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడిని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 మధ్య వడ్డీ రూపంలో పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.10,000 పెన్షన్ కావాలనుకునే వారు రూ.15,66,580 పెట్టుబడి పెట్టాలి. ఈ స్కిమ్ గడువు వ్యవధి 10 ఏళ్లు. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు కాగా గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 కనీస పెన్షన్ లభిస్తుంది. ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెల రూ.10,000 పెన్షన్ కావాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి. పాలసీ ప్రారంభించి మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10 శాతం చెల్లించాలి. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాక ముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి. 10 ఏళ్ల గడువు పూర్తికాక ముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. చదవండి: అనధికారికంగా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండవచ్చు? -
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ చెల్లింపులు ఇలా.. ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు. రాబడులు.. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం. పన్ను బాధ్యతలు.. పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు. ముందుగా వైదొలగాలంటే.. పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది. లుకప్ పీరియడ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. చార్జీలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పూర్తి భద్రత.. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. -
క్రమం తప్పకుండా ఆదాయం
పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో అందించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. కానీ, దీనిపై వచ్చే పెన్షన్ చాలా తక్కువ. కనుక ప్రైవేటు రంగంలోని వారు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పదవీ విరమణ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. వీరికోసం అందుబాటులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు.. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడం (ఎస్‌డబ్ల్యూపీ) ఇలా ఎన్నో. అయితే, అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కనుక ఈ సాధనాలు, వాటిల్లో రాబడులు, రిస్క్ ఏ మేరకు తదితర వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది.. తమ పెట్టుబడులు, రాబడులపై ఎటువంటి రిస్క్ వద్దనుకునే వారు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాన్ని (పీవోఎంఐఎస్) పరిశీలించొచ్చు. అన్ని వయసుల వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయవందన యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే. కానీ, ఇవన్నీ సురక్షిత సాధనాలు. మూడు నెలలకోసారి అయినా ఫర్వాలేదనుకుంటే అందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ మూడింటిలో అధిక రాబడులను ఇచ్చే సాధనం. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ప్రస్తుతం పెట్టుబడులపై 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, అదే జాయింట్‌గా అయితే రూ.9 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. దీని కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది పూర్తయిన తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిలో 2 శాతాన్ని తపాలా శాఖ మినహాయించుకుంటుంది. అదే మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే అప్పుడు ఒక్క శాతమే కోల్పోవాల్సి వస్తుంది. పీవోఎంఐఎస్ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆ వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇతర ఆదాయ మార్గంలో దీన్ని చూపించి అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వయవందన యోజన ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనం. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. కాల వ్యవధి పదేళ్లు. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీఎంవీవీవై ద్వారా వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయ రిటర్నుల్లో ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంలో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తారు. 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఇందులో పెట్టుబడులకు అర్హులు. అదే ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు (55–60 ఏళ్ల మధ్య) ఒక నెల వ్యవధి మించకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రతీ త్రైమాసికం చివర్లో.. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెల చివరి తేదీన వడ్డీ చెల్లింపులు చేస్తారు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇమీడియట్ యాన్యుటీ పథకాలు కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనం. వీటిల్లోనూ రిస్క్ తక్కువే. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై, మరుసటి నెల నుంచే పెన్షన్ అందుకోవచ్చు. కాకపోతే వీటిల్లో పెట్టుబడులపై రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గరిష్ట రాబడి రేటు కేవలం 6 శాతమే. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఇతర మార్గాల కింద వచ్చిన ఆదాయంగా ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి రాబడులు ఎస్సీఎస్ఎస్లోనే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. పైగా మూడు నెలలకోసారి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మొదటి మూడు నెలలకు సరిపడా నిధి మీ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ పథకంలో పెట్టుబడులు సౌకర్యంగా, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఇది అనుకూలంగా లేదనుకున్న వారు వయవందన యోజనను పరిశీలించొచ్చు. అలాగే, ఒక పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితికి మించి ఇంకా నిధి మిగిలి ఉంటే అప్పుడు మరో పథకాన్ని ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు రిస్క్ కొంచెం తక్కువ కోరుకునే వారి కోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాకపోతే జాతీయ బ్యాంకుల్లో అయితే దీర్ఘకాలానికి వడ్డీ రేటు 7 శాతం వరకే ఉంది. ఒకవేళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తిగా ఉంటే 7–9 శాతం మధ్య వడ్డీ రాబడి పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులు త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. అయితే, డిపాజిటర్ కోరితే నెలవారీగా చెల్లింపులు చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. కాకపోతే నెలవారీగా కోరుకుంటే వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ అనే పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణ ఎఫ్‌డీతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో పెట్టుబడి కాల వ్యవధి తర్వాత చెల్లింపుల కాలవ్యవధి ఆరంభమవుతుంది. అంటే 24 నెలల పాటు పెట్టుబడి కాల వ్యవధిని ఎంచుకున్నారనుకంటే... ఆ తర్వాత, తదుపరి 24 నెలల పాటు చెల్లింపులు జరుగుతాయి. వడ్డీ రేటు 7.25 శాతం. చెల్లింపుల సమయంలో ప్రతి నెలా చెల్లింపులు చేయగా మిగిలిన మొత్తంపై వడ్డీ కలుస్తూ ఉంటుంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు అధిక రిస్క్ తీసుకునే వారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. కాకపోతే మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటినే పరిశీలించడం మంచిది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అధిక రేటును ఆఫర్ చేస్తాయి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏఏఏ రేటింగ్ కలిగిన బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం 7.72 నుంచి 8.05 శాతం వరకు వార్షిక వడ్డీని నెలవారీగా చెల్లింపులపై ఆఫర్ చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు 60 ఏళ్లు నిండిన వారు మినహాయింపు పొందొచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సాధనం (సిప్)కు ఇది పూర్తి వ్యతిరేకం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఇంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేదానిని ఎస్డబ్ల్యూపీగా పేర్కొంటారు. తన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల నుంచి ప్రతీ నెలా ఇంత మొత్తం కావాలని ఏఎంసీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ మీ రిస్క్‌ను బట్టి, పూర్తిగా డెట్ లేదా ఈక్విటీ లేదా ఈక్విటీ డెట్ కలయికతో కూడిన ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే తీసుకుంటే మొదటి ఏడాది వరకు ఎగ్జిట్‌లోడ్‌ను భరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక శాతంగా ఉండొచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీపై ప్రతి నెలా వెనక్కి తీసుకునే మొత్తంపై లాభం ఆర్జిస్తే, అది మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ పథకాలు అయితే స్వల్పకాల మూలధన లాభాలు (ఏడాదిలోపు)పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం.. మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించి ఉంటే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను అమలవుతుంది. ఈక్విటీ కాకుండా ఇతర పథకాలు అయినా మూడేళ్లకు మించి కొనసాగించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20 శాతం వర్తిస్తుంది. మూడేళ్ల లోపు కాలంలో వచ్చే లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. -
8 శాతం పెన్షన్ స్కీమ్ లాంచ్, కేవలం వారికే..
ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పెన్షన్ స్కీమ్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కేవలం 60ఏళ్లు, ఆపైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు(60ఏళ్లు, ఆపైబడిన వారికి) ప్రభుత్వం 10ఏళ్ల పాటు గ్యారెంటీ వడ్డీని ఇవ్వనుంది. పదేళ్ల కాలం పాటు ఉండే ఈ పాలసీలో పాలసీదారు కోరుకున్న విధంగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, పన్నెండు నెలల పద్ధతిలో పెన్షన్ అందుతుంది. 2017 మే 4 నుంచి ఈ స్కీమ్ ఆఫర్ చేయడాన్ని ఎల్ఐసీ ప్రారంభించింది. 2018 మే 3 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎల్ఐసీ ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ఈ స్కీమ్‌ను కొనుగోలుచేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాది పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకుంటే, కనీసం 1,44,578 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.7,22,892ను ఇన్వెస్ట్ చేయాలి. నెలవారీ పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకున్న పక్షంలో కనీసం రూ.1,50,000, గరిష్టంగా రూ.7,50,000 పెట్టుబడులుగా పెట్టాలి. రూ.1,50,000 పెట్టుబడులు పెట్టిన వారు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ పొందుతారు. అదేవిధంగా రూ.7,50,000 ఇన్వెస్ట్‌చేస్తే నెలవారీ పెన్షన్ రూ.5000 ఆర్జించే అవకాశముంది. ఒకవేళ 10ఏళ్ల కాల వ్యవధిలో పెన్షనర్ మరణిస్తే, కొనుగోలుచేసిన మొత్తాన్ని బెనిఫియరీకి అందిస్తారు. 10 ఏళ్ల కాలవ్యవధి అయిపోయే సమయానికి 98 శాతం కొనుగోలు ధరంతా రీఫండ్ అయిపోతుందని ప్రభుత్వం చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్కీమ్ నుంచి బయటికి వైదొలిగే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పాలసీపై జీఎస్టీ మినహాయింపు కూడా కల్పించడంతో పాటు, కొనుగోలు ధరపై 75 శాతం రుణసదుపాయం కూడా ఉంది. అయితే పాలసీ కాలం మూడేళ్లు పూర్తైన తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది.