వయస్సులో ఊన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా భూమి మీద ఇన్వెస్ట్ చేయడం లేదా ఇతరులకు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాం. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ తట్టుకునే శక్తి అప్పుడు ఉంటుంది. కానీ, 60 ఏళ్లు దాటాక అంతా రిస్క్ తీసుకోలేరు కాబట్టి తమ దగ్గర ఉన్న నగదును ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎమ్‌వీవీవై) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల కొత్త మొత్తం నగదును పెన్షన్ రూపంలో పొందవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్దుల కోసమే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
వయో వృద్దులకు ఆర్దిక భరోసా
దీనిలో చేరాలంటే 60 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా వయో వృదూలకు ఆర్దిక భరోసా లభిస్తుంది. 10ఏళ్ల పాటు ఫింఛనుకు హామీ ఉంటుంది. పీఎమ్‌వీవీవైను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండేది కానీ ప్రస్తుతం కేంద్రం గడువును మార్చి 2023 వరకు పొడగించింది. ఇందులో చేరాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా గానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు.
పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు ఖచ్చితమైన పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం డెత్‌బెనిఫిట్‌ని కూడా అందిస్తుంది. పాలసీ కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి వుంటే… ఎంత ప్రీమియంకైతే కొన్నామో అంతే మొత్తం పది ఏళ్ల తర్వాత తిరిగి మొత్తం చెల్లిస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను కూడా పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు.
పీఎమ్‌వీవీవై ప్రీమియం
ఒక్కసారే ప్రీమియం చెల్లించి దీనిలో చేరాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా కనీసం రూ.1.5 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షలు నగదు చెల్లించి పాలసీ కొనుగోలు చేయవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన రూ.1.5లక్షల నుంచి రూ. 15లక్షల నగదుపై ప్రతి నెల నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10వేల దాకా వడ్డీని అందిస్తారు. ప్రస్తుతం వడ్డీ 7.4శాతంగా నిర్ణయించారు. నెల నెలా వద్దనుకుంటే మూడు మాసాలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్(ఈసీఎస్) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛను జమ అవుతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment