పింఛన్ జాబితాలో పేరు లేదని.. | Where the pension is not on the list .. | Sakshi
Sakshi News home page

పింఛన్ జాబితాలో పేరు లేదని..

Published Sat, Dec 6 2014 1:03 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Where the pension is not on the list ..

  • వికలాంగుడి ఆత్మహత్య... ముగ్గురికి గుండెపోటు
  • సాక్షి నెట్‌వర్క్: నిన్నటి వరకు జీవనాధారంగా నిలిచిన పింఛన్ పథకం జాబితాలో పేరు లేదని నిజామాబాద్ జిల్లాలో ఓ వికలాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మరణించారు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన మద్దికుంట చంద్రం(35) వికలాంగుడు.

    రెండేళ్లుగా వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. తాజాగా వచ్చిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీకి చెందిన సుంకోజు కుమారస్వామి(65), ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు బొరిగాం శంకర్(52) పింఛన్ జాబితాలో తమ పేరు లేకపోవడంతో గుండెపోటుకు గురై మరణించాడు.

    నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంకు చెందిన కొండూరు ఇస్తారి(75) జాబితాలో తన పేరు లేదని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చి మంచంపై పడుకొని అలాగే మృతి చెందాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement