- కొత్త పింఛన్ పథకం విషయంలో బీజేపీ వైఖరిపై దేవీ ప్రసాద్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ.. నేడు అధికారంలోకి రాగానే అదే పథకాన్ని కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతోందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల(టీఎన్జీవో) సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు.
అధికారంలో ఎవరున్నా ఉద్యోగుల పట్ల వారు అవలంభించే వైఖరి మాత్రం ఒకేలా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలభారత నవోదయ ఉద్యోగుల సంఘం మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కొత్త కార్యవర్గం ఎన్నిక
నవోదయ ఉద్యోగుల సంఘం మహాసభల ముగింపు కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం జాతీయ అధ్యక్షులుగా జగదీశ్ రాయ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. బుచ్చిరెడ్డి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.