
సాక్షి, అనంతపురం: అమరాపురం మండలం వి.అగ్రహారంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి వీరంగం సృష్టించాడు. అక్రమంగా ఫించన్ల సొమ్ముని కొట్టేయడంతో పాటు విచారణ సందర్భంగా మహిళా వలంటీర్‌ను తీవ్ర దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడికి యత్నించాడు. వివరాలు.. డప్పు కళాకారుల పేరుతో కొన్నేళ్లుగా టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి పింఛన్ సొమ్ముని స్వాహా చేస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి 14 అనర్హుల పింఛన్లను తొలగించారు. అయితే, విచారణకు సందర్భంగా తిప్పేస్వామి తన అనుచరులతో కలిసి రెచ్చిపోయాడు. వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. తీవ్రంగా తిట్టాడు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
(చదవండి: ఒక మహిళ.. రెండు పింఛన్లు)
Comments
Please login to add a commentAdd a comment