పాత పెన్షన్‌ స్కీం అమలుకు కృషి | work on old pension scheme, says swamy goud | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ స్కీం అమలుకు కృషి

Published Wed, Apr 12 2017 4:30 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

work on old pension scheme, says swamy goud

మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వెల్లడి
సాక్షి, హైదరాబాద్‌: పోరాడి సాధించు కున్న తెలంగాణలో ప్రతి ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని  మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానంపై ఉద్యోగుల ఆందోళ నను పరిగణనలోకి తీసుకొని, వారికి ఏ విధానం లాభదాయ కమో దానినే ప్రభుత్వం అమలు చేసేలా కృషి చేస్తానని హామీ నిచ్చారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డైరీని ఆయన చాంబర్‌లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా  ఉద్యోగులకు ఆందోళనకరంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సంఘం ప్రతినిధులు స్వామిగౌడ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్,  వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement