సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అధిక పెన్షన్ పథకం కోసం ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినా.. దీనిపై చందాదారులు, పెన్షనర్లలో సందేహాలు వీడటం లేదు. ఫిబ్రవరి 20న అధిక పెన్షన్ దరఖాస్తులకు ఉత్తర్వులను వెలువరించగా.. దరఖా స్తు ప్రక్రియ, ఉమ్మడి ఆప్షన్ నమోదు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధి, ఇతర అంశాలపై అయోమయం వీడటం లేదు. అధిక పెన్షన్ లెక్కించే ఫార్ము లాను ఈపీఎఫ్‌ఓ ఇంకా వెల్లడించలేదని.. దీనికి ఎంపికైతే జరిగే లబ్ధిపై ఎలాంటి స్పష్ట త లేదని చందాదారులు వాపోతున్నారు.
ఈపీఎఫ్‌ఓ ప్రస్తుత నిబంధనల ప్రకా రం రూ.15 వేల గరిష్ట వేతనాన్ని పెన్షన్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వేతన పరిధిలోని వారికి పదవీ విరమణ పొందిన తర్వాత సాధారణ పెన్షన్ మాత్రమే అందుతుంది. ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి ముందు నుంచీ ఉన్న చందాదారులకు కూడా దీన్ని వర్తింపజేశారు. దీంతో అధిక వేతనమున్న వారికి అధిక పె న్షన్ పొందే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది.
ఈ క్రమంలో.. ఈ నిబంధన అమల్లోకి రాకముందే అధిక వేతనం పొందుతున్న చందాదారులు, పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ అందే అవకాశం ఇవ్వా లని కోర్టు ఈపీఎఫ్‌ఓను ఆదేశించింది. దీని తో ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చింది. గరిష్ట వేతనంపై అటు చందాదారుడు, ఇటు యాజమాన్యం చెరో 12శాతం చొప్పు న చందా చెల్లిస్తే.. అధిక పెన్షన్‌కు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంలో పలు సందేహాలున్నాయి.
కొన్ని కంపెనీలు ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితికి లోబడి జీతాల చెల్లింపులు చేస్తూ వచ్చాయి. అలాంటి వారి కి అధిక వేతనంపై చెల్లింపులు చేసే అంశంపై స్పష్టత లేదు. ఇక అధిక వేతనం పొందుతున్న చందాదారులకు ప్రభుత్వం వాటా 1.12 శాతాన్ని ఈపీఎఫ్‌లో జమచేసే అంశంపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం జమచేయని పక్షంలో ఆ మొత్తాన్ని ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు ఈపీఎఫ్‌ఓ దగ్గర సమాధానం లేదు.
‘అధిక పెన్షన్’ఫార్ములా ఇంకెప్పుడు?
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పెన్ష న్‌కోసం ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ లింకు ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖా స్తు చేసుకున్నవారు.. చందాకు సంబంధించి యాజమాన్యంతో కలసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పూర్తిస్థాయి ఆధారాలను సమర్పించాలి. దీనికి మే 3వ తేదీవరకే గడువు ఉంది.
ఇలా సమయం ద గ్గరపడుతున్నా.. అధిక పెన్షన్ లెక్కింపునకు సంబంధించిన సూత్రాన్ని (ఫార్ములా) ఈపీఎఫ్‌ఓ ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో అధి క పెన్షన్ అర్హతలు, ఎంపికైతే వచ్చే లబ్దిపై చందాదారులకు ఇప్పటికీ స్పష్టత లేదు. కొ న్ని సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు అధిక వేతనంపై ఈపీఎఫ్ జమ చేస్తున్నా.. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇలాంటి సందేహాలను ఈపీఎఫ్‌ఓ అధికారుల దృష్టికి తీ సుకువెళుతున్నా.. ఎలాంటి స్పందన లేదని చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment