option
-
ఎన్పీఎస్, ఈపీఎఫ్ - రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు ఉండగా, వీటిని విక్రయించాను. ఈ లాభం లక్షలోపు ఉంది. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షలోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని విన్నాను. అయితే, ఈ లాభాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాలా? అవసరం లేదా? – గురుమూర్తి మీ వార్షికాదాయం ఆదాయపన్ను వర్తించే శ్లాబులో ఉంటే తప్పకుండా రిటర్నులు వేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సిన ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి రాని మూలధన లాభం ఉన్నప్పటికీ దాన్ని రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. లిస్టెడ్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు కలిగినా లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదికి మించి కలిగి ఉంటే, వాటిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా పేర్కొంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభం వస్తే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) ఆధారంగా మీరు దాఖలు చేయాల్సిన వార్షిక రిటర్నుల పత్రాల్లో ఈ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఆదాయం ఉంటే, పన్ను వర్తించని మూలధన లాభాలను వెల్లడించక్కర్లేదు. ఆదాయపన్ను పాత విధానం కింద సీనియర్ సిటిజన్లు అయితే (60 ఏళ్లు నిండిన) వార్షికాదాయం రూ.3 లక్షలు ప్రాథమిక పన్ను మిహాయింపు పరిమితిగా ఉంది. 80 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.5లక్షలుగా ఉంది. మిగిలిన వారికి రూ.2.5 లక్షలుగా ఉంది. నూతన పన్ను విధానంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆదాయపన్ను మినహాయింపు కనీస పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది. వార్షిక ఆదాయ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయం ఇంతకంటే తక్కువగా ఉన్న వారు మూలధన లాభాలు (స్వల్పకాల, దీర్ఘకాల) కలిగి ఉంటే, ఆ మొత్తాన్ని కనీస పరిమితి కింద భర్తీ చేసుకోవచ్చు ఉదాహరణకు వార్షికాదాయం రూ.1.8 లక్షలుగానే ఉండి, మూలధన లాభం రూ.లక్ష వచ్చి ఉంటే, అప్పుడు బేసిక్ పరిమితిలో మిగిలిన రూ.70వేలను భర్తీ చేసుకోవచ్చు. ఇది పోను మిగిలిన రూ.30వేలపైనే మూలధన లాభాల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీ ఆదాయం రూ.2.5 లక్షలకు పైన ఉంటే, అప్పుడు మూలధన లాభాలను రిటర్నుల్లో వెల్లడించి నిబంధనల కింద పన్ను చెల్లించాల్సిందే. ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థలో నా నెలవారీ వేతనం నుంచి ఈపీఎఫ్ పథకానికి చందాలు వెళుతున్నాయి. నేను వచ్చే ఏడాది నేను పదవీ విమరణ తీసుకోబోతున్నాను. పీఎఫ్ నిధి సుమారు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్పీఎస్కు మారేందుకు కార్యాలయం నాకు ఆప్షన్ ఇచ్చింది. మరి నేను ఎన్పీఎస్కు మారాలా? అది నాకు ప్రయోజనమేనా? – రాజేష్ కుమార్ భాసిన్ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండూ ముఖ్యమైన పథకాలుగా ఉన్నాయి. ఈపీఎఫ్ అనేది మీ వేతనం నుంచి తప్పకుండా మినహాయించే ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడమే ఇందులోని ఉద్దేశం. పదవీ విమరణ సమయంలో చేతికి అందే మొత్తంపై పన్ను ఉండదు. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద పథకం. పదవీ విరమణ నిధి ఏర్పాటుకు ఇది కూడా ఒక సాధనం. మీరు మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ద్వారా ఇప్పటికే నిధిని సమకూర్చుకున్నారు. కనుక ఈ సమయంలో ఎన్పీఎస్కు మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. వేచి చూసి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఈపీఎఫ్ నిధిని మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునేట్టు అయితే, మీ ఉద్దేశ్యాలకు అనుగుణంగా సాధనాలను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకోకపోతే అప్పుడు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. స్వచ్ఛందంగా అయినా ఎన్పీఎస్ ఖాతాను 70 ఏళ్ల వరకు తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటర్ ఆప్షన్ ఏదంటే?
దీర్ఘకాలం కోసం లార్జ్‌క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఏది బెటర్? – సుశాంక్ దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని అనుకుంటే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కొన్ని ఉప విభాగాలు కూడా ఉన్నాయి. అందులో లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ భాగం. లార్జ్‌క్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్ (పెద్ద మార్కెట్ విలువ) కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. చిన్న ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న పరిమిత పెట్టుబడులతో విడిగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎక్కువగా (ఒకటికి మించి కంపెనీలు) కొనుగోలు చేయలేరు. అటువంటి వారు ఒక లార్జ్‌క్యాప్ పథకం ద్వారా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుంది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అలా కాదు. వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్ మాదిరిగా ఏదో ఒక మార్కెట్ విలువకే పరిమితం కావు. వివిధ రంగాల్లోని, వివిధ స్థాయి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పన్ను పరంగా చూస్తే ఈ రెండు ఈక్విటీ పథకాలే కనుక ఒకే మాదిరి ఉంటుంది. ఏడాది లోపు లాభాలపై 15 శాతం, ఏడాది మించిన లాభాలపై (రూ.ఒక లక్ష తర్వాత) 10 శాతం పన్ను పడుతుంది. 2013 నుంచి లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ విభాగాల్లో చెరో రూ.10,000 చొప్పున సిప్ ద్వారా ఇన్వెస్టి చేసి ఉంటే, 2022 జూన్ నాటికి రూ.11.60 లక్షల మొత్తం పెట్టుబడి పెట్టి ఉంటారు. కానీ, రాబడుతో కలిపి మొత్తం నిధి ఫ్లెక్సీక్యాప్‌లో రూ.24.63 లక్షలు అయి ఉండేది. అదే లార్జ్‌క్యాప్‌లో రూ.22.78 లక్షలు సమకూరేది. అంటే ఫ్లెక్సీక్యాప్ విభాగం రూ.1.84 లక్షల అధిక రాబడి ఇచ్చింది. లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ రెండూ పూర్తిగా ఈక్విటీల్లోనే పెట్టుబడులు పెడతాయి. కనుక అస్థిరతలు ఉంటాయని మర్చిపోవద్దు. మార్కెట్లలో ఆటుపోట్లను, స్టాక్ మార్కెట్ పనిచేసే తీరును అర్థం చేసుకున్న వారికి ఇవి అనుకూలం. కేవలం లార్జ్‌క్యాప్ కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే వారు లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాదాపు ఇన్వెస్టర్లు అందరికీ లార్జ్‌క్యాప్ అనుకూలం. మార్కెట్లో ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే సౌలభ్యంతో ఉండేవి ఫ్లెక్సీక్యాప్ పథకాలు. కొంచెం అదనపు రిస్క్ తీసుకునే వారికి అనుకూలం. పేరులో ఉన్నట్టు.. మార్కెట్లో ఎక్కడ అనుకూల అవకాశాలు ఉంటే అక్కడికి పెట్టుబడులు మళ్లించే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. కానీ, లార్జ్‌క్యాప్ పథకాలకు ఈ స్వేచ్ఛ ఉండదు. కనుక వైవిధ్యం కోరుకునే వారికి ఫ్లెక్సీక్యాప్ అనుకూలం. కనీసం ఐదేళ్లు, అంతకుమించి కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే అసలైన రాబడులు కనిపిస్తాయి. అందుకని పెట్టుబడుల లక్ష్యాలు, రిస్క్ ఎంత మేరకు తీసుకోగలరు, ఎంత కాలం పెట్టుబడి పెట్టగలరనే అంశాల ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్, బంగారం వీటిల్లో ఏది మెరుగైనది? – రాజేంద్రన్ వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. నిజానికి బంగారంలోనూ ఎన్నో అస్థిరతలు ఉంటాయని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్-సరఫరా. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఒకటి. మన దేశం పెద్ద ఎత్తున ఏటా బంగారం దిగుమతి చేసుకుంటోంది. అనుత్పాదక సాధనం కనుక బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం సుంకాలను విధిస్తుంటుంది. ఇవి ధరలపై ప్రభావం చూపిస్తాయి. కనుక స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
‘అధిక పెన్షన్’పై తొలగని సందేహాలు!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ పథకం కోసం ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినా.. దీనిపై చందాదారులు, పెన్షనర్లలో సందేహాలు వీడటం లేదు. ఫిబ్రవరి 20న అధిక పెన్షన్ దరఖాస్తులకు ఉత్తర్వులను వెలువరించగా.. దరఖా స్తు ప్రక్రియ, ఉమ్మడి ఆప్షన్ నమోదు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధి, ఇతర అంశాలపై అయోమయం వీడటం లేదు. అధిక పెన్షన్ లెక్కించే ఫార్ము లాను ఈపీఎఫ్ఓ ఇంకా వెల్లడించలేదని.. దీనికి ఎంపికైతే జరిగే లబ్ధిపై ఎలాంటి స్పష్ట త లేదని చందాదారులు వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ ప్రస్తుత నిబంధనల ప్రకా రం రూ.15 వేల గరిష్ట వేతనాన్ని పెన్షన్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వేతన పరిధిలోని వారికి పదవీ విరమణ పొందిన తర్వాత సాధారణ పెన్షన్ మాత్రమే అందుతుంది. ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి ముందు నుంచీ ఉన్న చందాదారులకు కూడా దీన్ని వర్తింపజేశారు. దీంతో అధిక వేతనమున్న వారికి అధిక పె న్షన్ పొందే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ఈ క్రమంలో.. ఈ నిబంధన అమల్లోకి రాకముందే అధిక వేతనం పొందుతున్న చందాదారులు, పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ అందే అవకాశం ఇవ్వా లని కోర్టు ఈపీఎఫ్ఓను ఆదేశించింది. దీని తో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చింది. గరిష్ట వేతనంపై అటు చందాదారుడు, ఇటు యాజమాన్యం చెరో 12శాతం చొప్పు న చందా చెల్లిస్తే.. అధిక పెన్షన్‌కు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంలో పలు సందేహాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈపీఎఫ్ఓ వేతన పరిమితికి లోబడి జీతాల చెల్లింపులు చేస్తూ వచ్చాయి. అలాంటి వారి కి అధిక వేతనంపై చెల్లింపులు చేసే అంశంపై స్పష్టత లేదు. ఇక అధిక వేతనం పొందుతున్న చందాదారులకు ప్రభుత్వం వాటా 1.12 శాతాన్ని ఈపీఎఫ్‌లో జమచేసే అంశంపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం జమచేయని పక్షంలో ఆ మొత్తాన్ని ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు ఈపీఎఫ్ఓ దగ్గర సమాధానం లేదు. ‘అధిక పెన్షన్’ఫార్ములా ఇంకెప్పుడు? సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పెన్ష న్కోసం ఈపీఎఫ్ఓ ఆన్లైన్ లింకు ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖా స్తు చేసుకున్నవారు.. చందాకు సంబంధించి యాజమాన్యంతో కలసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పూర్తిస్థాయి ఆధారాలను సమర్పించాలి. దీనికి మే 3వ తేదీవరకే గడువు ఉంది. ఇలా సమయం ద గ్గరపడుతున్నా.. అధిక పెన్షన్ లెక్కింపునకు సంబంధించిన సూత్రాన్ని (ఫార్ములా) ఈపీఎఫ్ఓ ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో అధి క పెన్షన్ అర్హతలు, ఎంపికైతే వచ్చే లబ్దిపై చందాదారులకు ఇప్పటికీ స్పష్టత లేదు. కొ న్ని సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు అధిక వేతనంపై ఈపీఎఫ్ జమ చేస్తున్నా.. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇలాంటి సందేహాలను ఈపీఎఫ్ఓ అధికారుల దృష్టికి తీ సుకువెళుతున్నా.. ఎలాంటి స్పందన లేదని చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
గూగుల్‌లో ఈ మార్పును గమనించారా?
సాక్షి, టెక్నాలజీ : ఇంటర్నెట్ యూజర్లకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ షాక్ ఇచ్చింది. ఇకపై మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్ చేసుకోకుండా సెర్చింజన్లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్’ బటన్‌ను తొలగించేసింది. ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్ చేసినప్పుడు పక్కన విజిట్, షేర్లతోపాటు వ్యూ ఇమేజ్ ఆప్షన్ కూడా కనిపించేది. దానిని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఓపెన్ అయ్యి సేవ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను గూగుల్ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్ లో కేవలం విజిట్, షేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘గూగుల్‌లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది. దీని ద్వారా విజిట్ పేజ్ బటన్ ద్వారా ఆధారిత వెబ్ సైట్‌కు యూజర్ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. Today we're launching some changes on Google Images to help connect users and useful websites. This will include removing the View Image button. The Visit button remains, so users can see images in the context of the webpages they're on. pic.twitter.com/n76KUj4ioD — Google SearchLiaison (@searchliaison) 15 February 2018 -
రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త ఆప్షన్?
సాక్షి, న్యూఢిల్లీ: థర్డ్ జెండర్ కోసం భారతీయ రైల్వే కొత్త ఆప్షన్ ను పరిచయం చేస్తోంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌జెండర్ (మేల్ / ఫిమేల్) ఆప్షన్‌కు బదులుగా కేవలం ‘టి’ అనే ఆప్షన్‌ను పొందు పర్చనుంది. రిజర్వేషన్ ఫాంలో ట్రాన్స్ జెండర్ల కోసం టీ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ ఫాంలో సవరణలు చేయాలని అక్టోబరు 17న జోనల్ అధికారులకు ఒక లేఖలో రైల్వే బోర్డు తెలిపింది. మేల్, ఫీమేల్.. ఆప్షన్లతో పాటుగా ట్రాన్స్ జెండర్ (టి) ఆప్షన్ చేర్చాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీనికి సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు తేవాలని సూచించింది. అలాగే టికెట్ బుకింగ్ తో పాటు.. కాన్సిల్ చేసుకునే ఫాంలో కూడా ట్రాన్స్ జెండర్ ఆప్షన్ చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల చట్టం 2016పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులపై విమర్శలు వెల్లువెత్తడంతో 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మార్పులు చేస్తోంది. -
గర్భం.. అనుకోకుండా రాదు: హైకోర్టు
తిరువనంతపురం: గర్భం దాల్చిన విద్యార్థినులకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు జడ్జి ఒకరు వ్యాఖ్యానించారు. గర్భం దాల్చడం అనుకోకుండా జరిగే విషయం కాదని, అందువల్ల గర్భం దాల్చిన విద్యార్థినులకు హాజరు తగ్గినంత మాత్రాన వాళ్లకు మినహాయింపు అవసరం లేదని జస్టిస్ కె. వినోద్ చంద్రన్ అన్నారు. కన్నూర్ యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న జాస్మిన్ ప్రెగ్నెంట్‌తో ఉన్నందున తరగతులకు హాజరు కాలేకపోయింది. 75 శాతం అటెండెన్స్ఉండాల్సి ఉండగా, 45 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆమెను పరీక్షలకు అనుమించలేదు. డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్లు చూపించినా జాస్మిన్ రెండో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో తరగతుల హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆ విద్యార్థిని కోర్టును ఆశ్రయించింది. రెగ్యులర్ కోర్స్‌లలో తరగతుల నుంచి మినాహాయింపుకు గర్భిణులకు ఎలాంటి మినాహాయింపులు ఉండవని జాస్మిన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
మంచి ‘ఆప్షన్’ అని..
కోఆప్షన్ పదవికి భారీగా దరఖాస్తులు బరిలో మాజీ కార్పొరేటర్లు... విశ్రాంత అధికారులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కో-ఆప్షన్ పదవులపై అనేక మంది కన్నేశారు. కార్పొరేటర్లుగా అవకాశం రాని వారు కనీసం కో ఆప్షన్ సభ్యులుగానైనా ఎన్నిక కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా యాభై మంది పోటీలో ఉన్నారు. ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల నియామకానికి ఏప్రిల్ 4 వర కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 దరఖాస్తులు అందాయి. కార్పొరేటర్‌గా టిక్కెట్ లభించని వారితో పాటు మాజీ కార్పొరేటర్లు.. శివారు మున్సిపాలిటీల్లోని మాజీ కౌన్సిలర్లు... కో ఆప్షన్ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు జీహెచ్ఎంసీలో ఇంజినీర్లుగా పని చేసి రిటైరైన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కో ఆప్షన్ సభ్యులకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశం మినహా కార్పొరేటర్లకు గల అధికారాలన్నీ ఉంటాయి. కార్పొరేటర్ బడ్జెట్ ఏడాదికి రూ.కోటితో పాటు ఇతరత్రా వారికి గల అన్ని సదుపాయాలూ కోఆప్షన్ సభ్యులకు వర్తిస్తాయి. ఈ పదవులకు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 3న ప్రకటన జారీ చేశారు. తొలుత 21వ తేదీ వరకు మాత్రమే గడువిచ్చారు. ఆ తరువాత ఎన్జీవోల్లో పని చేసిన వారితో పాటు మరికొన్ని వర్గాలకూ అవకాశం కల్పిస్తూ జీవోను సవరించారు. గడువును ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. బరిలో వీరే... గత పాలక మండలిలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ కొత్త రామారావు... ఓల్డ్ మల్కాజిగిరి కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్... గౌతమ్‌నగర్ కార్పొరేటర్ సుమలత, ఆడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత.. ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ యాదవ్, మూసారాంబాగ్ కార్పొరేటర్ అస్లాంపాషా తదితరులు ఆశావహుల్లో ఉన్నారు. వీరిలో మెజార్టీ సభ్యులు గతంలో టీడీపీలో ఉండగా... ప్రస్తుతం టీఆర్ఎస్ గూటికి చే రారు. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహించి... ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరిన వారు సైతం ఉన్నారు. 1986, 2002 పాలక మండళ్లలో కార్పొరేటర్లుగా వ్యవహరించిన వారు సైతం ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాచర్ల పద్మజ, బండారు లత, లక్ష్మీనారాయణమ్మ తదితరులు ఉన్నారు. గత పాలక మండలిలో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా వ్యవహరించిన మల్లారపు శాలిని మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పని చేసిన మహేశ్ యాదవ్, శ్రీరాంచందర్ వంటి వారూ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు జీహెచ్ఎంసీ(ఎంసీహెచ్)లో గతంలో సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా పనిచేసి రిటైరైన ఎంఏ హమీద్, ఫయీముద్దీన్, డిప్యూటీ ఈఈ జయప్రకాష్ నారాయణరావు తదితరులూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి... వీరిలో నుంచి ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునేందుకు పాలక మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. -
వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్!
న్యూ ఢిల్లీ: ఇటీవలే ఫేస్బుక్ యాజమాన్యంలోకి మారిన మెసేజింగ్ యాప్ వాట్సప్.. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారం వ్యవధిలోనే రెండు సరికొత్త అప్డేట్లను వాట్సప్ అందించింది. ఇటీవలే షేర్డ్ లింక్ హిస్టరీ ట్యాబ్‌ను వాట్సప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. అంతేకాదు ఇతర ఫార్మాట్ల లోని ఫైళ్లను సైతం షేర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది. పీడీఎఫ్ ఫార్మాట్లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్‌ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ చాట్ లాంటి పలు చాట్ యాప్‌లతో నెలకొన్న పోటీ దృష్ట్యా.. పలు కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఎమోజీలలో వివాదాస్పదమైన మిడిల్ ఫింగర్ ఎమోజీని కూడా ప్రవేశపెట్టి వాట్సప్ దూకుడును ప్రదర్శించింది. తమ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరిందని వాట్సప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పాఠశాల విద్యా కమిషనరేట్ ఉద్యోగులకు ఆప్షన్
హైదరాబాద్: పాఠశాల విద్య కమిషరేట్లలో పని చేస్తున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తాము ఏ రాష్ట్రంలో పని చేయదల్చుకున్నారో ఆప్షన్ ఇవ్వాలని సాధారణ పరిపాలనా శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులు నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల్లోగా తమ ఆప్షన్‌ను ఇవ్వాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఆప్షన్ ఫారం, ఇతర వివరాలకోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.రీఆర్గనైజేషన్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్లో సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. -
‘ఆప్షన్’ ఇస్తే ఉద్యమమే
* ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలపై ఆర్టీసీ టీజేఏసీ హెచ్చరిక * ‘కమలనాథన్’ మార్గదర్శకాలనే హైలెవల్ కమిటీ అనుసరణపై ధ్వజం * దీని వెనక కుట్ర దాగుందని ఆరోపణ * ‘ఎక్కడివాళ్లక్కడే’ మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ * అభ్యంతరాలు తెలిపేందుకు పక్షం రోజుల గడువివ్వాలని పట్టు * ఈ వ్యవహారంపై యాజమాన్యానికి నిరసన తెలపాలని నిర్ణయం * యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమం చేపట్టాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఊరించి ఊరించి రూపొందించిన ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలు ఇప్పుడు ఆర్టీసీలో అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవల్ కమిటీ యథాతథంగా అనుసరించటంపై ఆర్టీసీ తెలంగాణ జేఏసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎక్కడివాళ్లక్కడే పనిచేసేలా ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలుండాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగులకు ‘అప్షన్’ అవకాశం కల్పించటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే వాటిని బుట్టదాఖలు చేసి గతంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిం చింది. ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్వైజర్స్ సంఘం, టీఎంయూలతో కూడిన జేఏసీ ప్రతి నిధులు, ఎన్ఎంయూ ప్రతినిధులు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. మూడు రోజుల క్రితం ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరిట జారీ అయిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని స్పష్టం చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఆర్టీసీకి సంయుక్త లేఖ రాసినప్పటికీ అవే మార్గదర్శకాలను అనుసరించటంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవే మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరుతో జారీ చే యటం, అందులో ఎక్కడా సీఎస్ల సంయుక్త లేఖ గురించి ప్రస్తావించకపోవటాన్ని తప్పు పట్టారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భేటీలో ఏం చర్చించారంటే... # ఉద్యోగులకు ‘ఆప్షన్’ అవకాశం ఇవ్వటం వల్ల రెండు ప్రాంతాల్లో పదోన్నతులు పొందే వెసులుబాటు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులతోపాటు పోస్టులనూ కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 56 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆప్షన్ వల్ల వాటిని ఆంధ్రా ఉద్యోగులు ఆక్రమిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. # సీనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 13 ఖాళీలు కూడా ఆంధ్రా అధికారులకే దక్కుతాయి. వెరసి రెండు ప్రాంతాల్లో వారు పదోన్నతులు పొందితే తెలంగాణకు పోస్టులు దక్కవు. # పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఆంధ్రలో ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి భర్తీ చేసుకోవాలి. కాదంటే వేరే డిపార్ట్మెంట్లకు కూడా మారే వీలున్న కేడర్ అధికారులను వాటికి బదిలీ చేసుకోవాలి. # ఉద్యోగుల సంఖ్య మరీ అదనంగా ఉంటే... తప్పని స్థితిలో ఒకటి రెండేళ్ల కాలపరిమితితో డెప్యుటేషన్ పద్ధతిపై తెలంగాణకు రావాలి. ఆంధ్రలో పోస్టులు రాగానే తిరిగి వెళ్లిపోవాలి. # స్పౌజ్ (భార్య లేదా భర్త), వికలాంగులు తదితరులకు ఆప్షన్ అవకాశం కల్పిస్తే, పదేళ్లపాటు హైదరాబాద్ ఆంధ్రకు కూడా రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్‌లోని ఏపీఎస్ఆర్టీసీ పోస్టుల్లో వారిని నియమించుకోవాలి. # మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువు 7వ తేదీ వరకు మాత్రమే ఇచ్చారు. దాన్ని కచ్చితంగా మరో 15 రోజులు పొడగించాలి. # ప్రస్తుత మార్గదర్శకాల జారీ వల్ల తెలంగాణ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా వాటినే జారీ చేయడం చూస్తుంటే... మరికొంతకాలం జాప్యం జరిగి ఆ రూపంలో ఆంధ్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చవచ్చనే కుట్ర దాగుంది. # ఈ అభిప్రాయాలను ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. సానుకూలంగా స్పందించకుంటే వెంటనే ఉద్యమాన్ని ప్రారంభించాలి. -
ఆర్టీసీలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ!
నాలుగు నుంచి పదో తరగతి చదువు ప్రామాణికం ఈడీల కమిటీతో ఎండీ వరస భేటీలు తీవ్రమవుతున్న ఈడీ జయరావు అంశం సాక్షి, హైదరాబాద్: నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీచేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ విభజనకు సంబంధిం చి సంస్థలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీతో సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా సోమవారం ఓ దఫా చర్చించిన ఆయన మంగళవారం మరోసారి సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపకానికి కమలనాథన్ కమిటీ విధివిధానాలను ప్రకటిం చినా, అవి ఆర్టీసీకి వర్తించనందున ఆ సంస్థకు ప్రత్యేకంగా విధివిధానాల ఖరారు తప్పనిసరైంది. ఆప్షన్‌పై గందరగోళం... పాఠశాల విద్యను ప్రామాణికంగా చేసుకుని స్థానికతను నిర్ధారించే విషయంలో రెండు ప్రాంతాల నుంచి దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ ‘ఆప్షన్’ల విషయంలోనే గందరగోళం నెలకొంది. తెలంగాణలో డిపో మేనేజర్ కేడర్‌లో దాదాపు 30 మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన అధికారులు పనిచేస్తున్నారు. అంతకంటే పై కేడర్‌లో మరో 9 మంది ఉన్నారు. ఆప్షన్ సదుపాయం ఇవ్వాలని ఆంధ్రాప్రాంత అధికారులు కోరుతున్నారు. దీనికి తెలంగాణ అధికారులు ససేమిరా అంటున్నారు. సీనియర్ ఈడీ చుట్టూ వివాదం... సీనియర్ ఈడీ జయరావు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావును ఆంధ్రకు కేటాయించాలని తెలంగాణ అధికారులు, తెలంగాణలోనే ఉంచాలని ఆంధ్రాప్రాంత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరోవైపు వెళ్తే తమ ప్రాంతానికి ఈ పోస్టు దక్కుతుందనేది వారివారి వాదన. తన విషయాన్ని రెండు ప్రభుత్వాల ముందుంచి నిర్ణయం తీసుకోవాలన్న జయరావు వాదనను పెండింగులో పెట్టడంతో వివాదం ముదురుతోంది. తాను పుట్టింది, చది వింది తెలంగాణలోనేనని, ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థినైన తనను తెలంగాణకు కేటాయించాలని జయరావు ఎండీని కోరారని తెలిసింది. తెలంగాణ ఉద్యోగుల వాదన... నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని స్థానికతను నిర్ధారించాలి. జిల్లాను యూనిట్‌గా పరిగణించొద్దు. అధికారులు, ఉద్యోగులకు ఆప్షన్ అవకాశం ఉండరాదు. స్పౌజ్ అంశాన్ని ప్రామాణికంగా చేసుకుని కేటాయింపులు జరపరాదు ఆంధ్రాప్రాంత ఉద్యోగుల వాదన.. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తించొచ్చు. అయితే ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలకు చెందిన వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వాలి. మిగతా ప్రాంతంలోనికి వారికి... కుటుంబసభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్య/భర్త మరో రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంటే వారికి ఆప్షన్ అవకాశం కల్పించాలి. కమలనాథన్ కమిటీ విధివిధానాలను ఆర్టీసీకి కూడా వర్తింప చేయాలి. -
‘ముంపు’లో ఆంధ్ర ఉద్యోగులు
భద్రాచలం : ఏపీకి బదలాయించిన ఏడు మండలాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఖాళీల్లో ఆంధ్రకు చెందిన ఉద్యోగులను నియమించేందుకు అక్కడి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ప్రత్యేక సర్క్యులర్ రూపంలో ఉన్న ఆ ఉత్తర్వులు మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టరేట్లకు అందినట్లుగా తెలిసింది. ఏపీ స్టేట్ రీ ఆర్గనైజేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన జూన్ 2, 2014 నాటికి ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రాతిపదికగా తీసుకొని నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్లుగా సమాచారం. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించిన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో విలీనమైన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద దీనిపై చర్యలకు ఉపక్రమించింది. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో మొత్తం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 3142 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2173 మంది పనిచేస్తుండగా, మిగతా 969 ఖాళీలను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యాశాఖలో 333, గిరిజన సంక్షేమ విద్యాశాఖలో 220 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్ని శాఖల్లోని ఖాళీల భర్తీకి అక్కడి ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో త్వరలోనే ముంపు మండలాలకు ఏపీ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్లపై స్పష్టత కరువు : ముంపు మండలాల్లోని వ్యవసాయశాఖ, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఇటీవలే తెలంగాణకు బదిలీపై వచ్చారు. తాజాగా పంచాయతీ కార్యదర్శులు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అవి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులు కూడా ఇదే రీతిన రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారుల నుంచి ఆదేశాలు తెచ్చుకొని తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ ఇలంబరితి ముంపు ఉద్యోగుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు 1585 మంది తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. 588 మంది ఉద్యోగులు ఆంధ్రలోనే పనిచేస్తామని వెల్లడించారు. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకుండానే ఓ పక్క బదిలీలు, మరో పక్క నియామకాలు జరిగిపోతుండడంతో ముంపు మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగుల నుంచి తీసుకున్న ఆప్షన్ల మేరకు ముంపు ఉద్యోగుల పంపకాలు జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వకుండా ఆందోళనకు గురిచేయటం సరైంది కాదని ముంపు ఉద్యోగుల ఫోరమ్ సమన్వయ కర్త స్వరూప్ కుమార్ అన్నారు. దీనిపై మూడు జిల్లాల కలెక్టర్లు తగిన చొరవ చూపాలని కోరారు. -
ఎబోలా విరాళాలకు ఫేస్బుక్లో కొత్త ఆప్షన్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రాణాంతక ఎబోలా వ్యాధిని రూపుమాపే కార్యక్రమానికి తోడ్పాటుగా ఫేస్బుక్ వెబ్సైట్ తన యూజర్లకు ఓ కొత్త అవకాశాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. ఎబోలా నిర్మూలనకు పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు తమ వినియోగదారులు విరాళాలు సులభంగా అందించేందుకు వీలుగా ఓ కొత్త బటన్‌ను రూపొందించినట్లు ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. -
రాజకీయ ప్రక్షాళనకు ‘నోటా’ మీట సరిపోతుందా?
దేశంలో రోజురోజుకూ నేరమయమవుతున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చొరవ ప్రధానంగా పట్టణ ప్రాంతానికి చెందిన పౌర సమాజ కార్యకర్తల నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్షాళనకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27, 2013న వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ఊపునిచ్చిందని చెప్పవచ్చు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై ‘‘పైన ఉన్న వారెవరికీ కాదు’’ (None of the Above - NOTA) అనే మీటను ఏర్పాటు చేయాలి. వాస్తవానికి ఎన్నికల సంఘం ‘నోటా’ వంటి మార్పు తీసుకురావాలని 2001లోనే ప్రతిపాదించింది. న్యాయ కమిషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ కొత్త మార్పు ద్వారా తాము నిలబెడుతున్న అభ్యర్థుల పట్ల ఓటర్లకు సదభిప్రాయం లేదన్న విషయం రాజకీయ నాయకత్వానికి అర్థమవుతుంది. ఇది రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ఎన్నికల ప్రక్రియలో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుంది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ‘నోటా’ను ప్రవేశపెట్టడం వల్ల ఓటరు గుర్తింపు, గోప్యత (Identity & Secracy)పరిరక్షణతో పాటు ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఎందుకంటే నకారాత్మక ఓటింగ్ ద్వారా అభ్యర్థులపై ఓటర్లు తమ అసంతృప్తిని రాజకీయ వ్యవస్థకు తెలియజెప్పేందుకు వీలవుతుంది. దొంగ ఓట్లు వేయడాన్ని నిరోధించేందుకూ దోహదపడుతుంది. వాక్ స్వాతంత్య్రంలో భాగమే! సుప్రీంకోర్టు అభిప్రాయంలో అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు.. వాక్ స్వాతంత్య్రంలో అంతర్భాగమే (ప్రకరణ- 19(1)). అంతేకాకుండా చీఫ్ జస్టిస్ సదాశివం అభిప్రాయంలో ఇది స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కులో అంతర్భాగం. ప్రపంచంలో ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్లతో పాటు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు/ నిరసన తెలిపే హక్కు/ ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను ఇచ్చే హక్కు వంటివి కల్పించారు. ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఆధారంగా ప్రజాస్వామ్య శక్తిని అంచనా వేయొచ్చు. తక్కువ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం యెడల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనే సంకేతాన్ని పంపుతుంది. న్యాయస్థానం అభిప్రాయంలో ఇది ప్రజాస్వామ్యం మనుగడకే భంగం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 41(2), (3) ఉప నిబంధనలు, 49-ౌ నిబంధనలు.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 128వ సెక్షన్, రాజ్యాంగ ప్రకరణ 19(1)(ఎ) నిబంధనలకు విరుద్ధం. 49-ౌ నిబంధన ప్రకారం ఇంతకుముందే ఓటరుకు తిరస్కరించే హక్కు ఇచ్చారు. అయితే అలా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారుల సమక్షంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలి. దీనివల్ల రహస్యంగా తిరస్కరించడమనే హక్కు కోల్పోవడం జరుగుతుంది. ఇది స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కుకు భంగం కలిగిస్తుంది (ప్రకరణ 21 ప్రకారం). నకారాత్మక ఓటింగ్‌పై ఇప్పటి వరకు జరిగిన పరిశోధన ఫలితాలు అంత స్పష్టంగా లేవు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఏవిధంగా తమ అసంతృప్తిని వెల్లడించారనే అంశంపై విసృ్తత సమాచారం అందుబాటులో ఉందిగానీ, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పట్ల ఓటర్ల అసంతృప్తి వెల్లడికి సంబంధించిన సమాచారం మాత్రం తగినంత లేదు. అమెరికాలో నకారాత్మక ఓటింగ్‌పై విసృ్తత పరిశోధన జరిగింది. అభ్యర్థులపై ఓటర్లకు అసంతృప్తి ఉన్నట్లయితే ఎన్నికలనే బహిష్కరించినట్లు విశదమవుతుందేగానీ, అభ్యర్థుల్ని తిరస్కరించేందుకు చొరవ తీసుకున్నట్లు చెప్పడానికి ఆధారాలు లేవు. ఓటింగ్ శాతం పెరుగుతుందా? సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు దేశంలో నకారాత్మక ఓటింగ్ విధానం వల్ల ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని చెప్పలేం. అంతమాత్రాన జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదనీ చెప్పలేం. స్వీడన్లో అభ్యర్థులపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకు ఓటర్లకు ఖాళీ బ్యాలెట్ పేపర్‌ను సమర్పించే అవకాశమిచ్చారు. చరిత్రాత్మకంగా ఈ దేశంలో ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు 85 శాతం అయితే వీరిలో ఖాళీ పేపర్‌ను సమర్పించిన వారు కేవలం ఒక శాతమే. దీన్నిబట్టి నకారాత్మక ఓటింగ్‌కు, ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడానికి ప్రత్యక్ష సంబంధం లేనట్లు అర్థమవుతోంది. సుప్రీంకోర్టు ప్రస్తావించిన గ్రీస్, బ్రెజిల్లో నిర్బంధ ఓటింగ్ విధానం అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లు తప్పకుండా ఓటు వేసేందుకుగానీ, లేదంటే నకారాత్మక ఓటింగ్కుగానీ అవకాశముంటుంది. నిర్బంధ ఓటింగ్ లేని దేశాల్లో ఓటర్లు.. తమ అసంతృప్తిని ఓటింగ్‌లో పాల్గొనకుండా తెలియజేయవచ్చు. 1975లో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నకారాత్మక ఓటింగ్‌ను ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఓటింగ్ శాతం క్రమేణా తగ్గుతూ వచ్చింది. కొందరు ఓటర్లు నకారాత్మక ఓటింగ్ విధానాన్ని తొలగించాలని కూడా కోరారు. ఎందుకంటే ‘నిరసన’ అభ్యర్థులకు లభించే మద్దతు క్రమేణా తగ్గుతూ వచ్చింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో 2008లో నకారాత్మక ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే గత ఎన్నికల్లో ఇలా ఓటేసిన వారు ఒక శాతం మాత్రమే. సుప్రీంకోర్టు ప్రస్తావించిన ఉక్రెయిన్‌లో కూడా క్రమేణా ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. నకారాత్మక ఓటింగ్/ నిరసన ఓటింగ్‌లపై విడివిడిగా సమాచారాన్ని సేకరించడం అంత సులభం కాదు. కాబట్టి వీటి ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం. కొన్ని దేశాల్లో ఖాళీ ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారు. మరికొన్ని దేశాల్లో వీటిని నిరసన ఓట్లుగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం.. దాదాపు ఈ దేశాలన్నింటిలోనూ నకారాత్మక ఓట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల ఫలితాలను నిర్ధారించేందుకు చట్టబద్ధమైన అధికారం లేదు. భారత దేశంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి కంటే నకారాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువైనప్పటికీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థినే గెలిచినట్లు ప్రకటించాలి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ వ్యాఖ్యానించినట్లు పోలైన వంద ఓట్లలో 99 నకారాత్మక ఓట్లు అయినప్పటికీ ఒకే ఒక ఓటు పొందిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాల్సిందే. ఆ 99 ఓట్లను చెల్లనివిగా పరిగణించాల్సి వస్తుంది. మరో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాజకీయ ప్రక్షాళనకు దోహదం: నకారాత్మక ఓటింగ్ విధానం దేశంలో నిష్కళంక రాజకీయాలకు దోహదం చేస్తుందా? రాజకీయ పక్షాలపై నైతిక ఒత్తిడి తీసుకురాగలుగుతుందా? వీటిపై న్యాయశాస్త్ర కోవిదులు, ఎన్నికల నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తంచేశారు. న్యాయకోవిదుడు కె.కె.వేణుగోపాల్ అభిప్రాయంలో ఇది శుభపరిణామం. ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థికంటే నకారాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువైనప్పుడు ఆ ఎన్నికను రద్దుచేయాల్సిందే. ఇది రాజకీయ పక్షాలపై గణనీయ ప్రభావం చూపుతుంది. నేరచరితులు రాజకీయ అధికారం చేపట్టకుండా నివారించేందుకు ఇది ఒక మంచి పద్ధతి. కానీ, ఖురేషీ అభిప్రాయంలో ఈ విధానం రాజకీయ పక్షాల వైఖరిలో సకారాత్మక మార్పు తీసుకొస్తుందనుకోవడం పొరపాటే. భిన్నాభిప్రాయాలు: గత రెండు దశాబ్దాలుగా నేరచరితులను ఎన్నికల్లో పోటీచేయనివ్వకూడదని పౌర సమాజం ఎంతగా ఘోషిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తుండటం ఇందుకు నిదర్శనం. ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్ కూడా వెలిబుచ్చారు. ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులైన సుభాష్ కశ్యప్ అభిప్రాయంలో ఈ తీర్పు.. ‘‘రాజకీయ పక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ఏ మాత్రం ప్రభావితం చేయదు’’. భారతీయ జనతాపార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించగా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీపీఎం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు దేశంలో ఎన్నికల విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదాన్ని కాలమే నిర్ణయించాలి. కొత్త మార్పుతో కలిగే ప్రయోజనాల కంటే తలెత్తే సమస్యలు ఎక్కువేమోనన్న సందేహాన్ని ఖురేషీ వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ తిరస్కరణకు గురైతే, మళ్లీ జరిపే ఎన్నికల్లో ఆ అభ్యర్థులు పోటీ చేయవచ్చా? వారికి అనుమతిస్తే నకారాత్మక ఓటింగ్ లక్ష్యమే దెబ్బతింటుంది. ఎంతకాలం వారిని నిషేధించాలి? తరచూ ఎన్నికల్ని నిర్వహిస్తే ఓటర్లలో ఎన్నికల అలసట (Election Fatigue) ఏర్పడదా? పదేపదే ఎన్నికలు నిర్వహిస్తే పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా మారుతుంది. ఖర్చు కూడా తడిసిమోపెడవుతుంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంతకాలం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు వీలుండదు. దీనివల్ల నష్టపోయేది ప్రజలే. సంస్కరణలు వేగవంతం కావాలి: ఎన్నికల సంస్కరణల్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, దానికంటే ముఖ్యమైనది నేరచరిత రాజకీయాలకు దోహదం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు; బలహీన వర్గాలు.. సంపన్న వర్గాల అణచివేతకు గురికావడం మొదలైన వాటిని నిర్మూలించాలి. రాజకీయ, వ్యవస్థాపరమైన మార్పుల వల్ల నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేయొచ్చు. పౌరులను ఎన్నికల ప్రక్రియలో మరింత ప్రభావవంతమైన భాగస్వాములుగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రతిబంధకాలు: ఎన్నికల్లో ప్రజా భాగస్వామ్యానికి సంబంధించి కొన్ని ప్రతిబంధకాలున్నాయి. అవి: ప్రస్తుతం కొనసాగుతున్న కఠినతరమైన ఓటరు నమోదు ప్రక్రియ, ఓటర్లలో నిరాసక్తి, ఆదాయంలో వ్యత్యాసాలు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం వల్ల దినసరి వేతనం పొందే కార్మికులకు నష్టం వాటిల్లడం. ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే కొట్లాటలు, ధనిక వర్గం.. తమ ప్రతినిధికి ఓటు వేయాలనో లేదంటే ఓటింగ్‌లో పాల్గొనవద్దనో బెదిరించడం. ఎన్నికల సమయంలో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టడం. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టడం. ఈ ప్రతిబంధకాలను తొలగిస్తేనే పౌరుడు స్వేచ్ఛగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలవుతుంది. అంతేగానీ కేవలం ‘నోటా’ విధానంతో ఓటర్లను ఉత్తేజపరచగలమనుకోవడం పొరపాటు. భారతీయ జనతా పార్టీ వంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో ఓటింగ్‌ను నిర్బంధం చేయాలని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛలో ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా అంతర్భాగమే. బలవంతంగా ఓటు వేయించడం అప్రజాస్వామ్యం. తీసుకోవాల్సిన చర్యలివీ: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాజకీయ పక్షాల పనితీరు ప్రజాస్వామ్యబద్దం గా ఉండేలా చూడాలి. అంటే రాజకీయ పక్షాలు వ్యవస్థాపరమైన ఎన్నికల్ని క్రమంతప్పకుండా నిర్వహించాలి. వాటికి బహుళ జాతి సంస్థల నుంచి భారీ ఎత్తున అందే విరాళాల్లో పారదర్శకత ఉండాలి. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ఎన్నికల బరిలో నిలబెట్టకుండా అన్ని రాజకీయ పక్షాల మధ్య అవగాహన ఏర్పడాలి. రోజురోజుకూ పెరిగిపోతున్న కుల, మత, సంకుచిత ధోరణుల్ని ఎన్నికల్లో అరికట్టాలంటే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికి కనీసం 50 శాతం ఓట్లు రావాలనే నిబంధన కూడా విధించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులను పునరాయనం గావించే (రీకాల్) హక్కు ఓటర్లకు ఇవ్వాలి. మీడియా, మేధావి వర్గం, పౌర సమాజం.. సగటు ఓటరును చైతన్యపరచడంలో చొరవ తీసుకోవాలి. వీటన్నికంటే ముఖ్యమైంది ఏంటంటే కృత్రిమమైన సామాజిక, ఆర్థిక, లింగపరమైన అసమానతల్ని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ‘నోటా’ లాంటి చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వగలవు.