శాన్ ఫ్రాన్సిస్కో: ప్రాణాంతక ఎబోలా వ్యాధిని రూపుమాపే కార్యక్రమానికి తోడ్పాటుగా ఫేస్‌బుక్ వెబ్‌సైట్ తన యూజర్లకు ఓ కొత్త అవకాశాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. ఎబోలా నిర్మూలనకు పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు తమ వినియోగదారులు విరాళాలు సులభంగా అందించేందుకు వీలుగా ఓ కొత్త బటన్‌ను రూపొందించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు వెల్లడించాయి.